Kadapa Youth Marriages : కడప యువకులు అందుకే పెళ్లిళ్లు చేసుకోవడం లేదట !
కడప యువకులు పెళ్లిళ్లు చేసుకోవడం లేదట. ఎందుకంటే దానికో కారణం ఉందంటున్నారు. అదేమిటంటే ?
కడప జిల్లాలో యువకులు పెళ్లిళ్లు కూడా చేసుకోవడం లేదట. ఎందుకంటే ఓ మంచి ముహుర్తం కోసం ఎదురు చూస్తున్నారు. అది అది పండితులు పెట్టే ముహుర్తం కాదు...బతుకులు మార్చే ముహుర్తం కోసమట. ఆ బతుకులు మార్చేది స్టీల్ ప్లాంట్ ( Kadapa Steel Plant ) అని కడప జిల్లా యువత నమ్ముతున్నారు. అందుకే సీఎం జగన్ స్టీల్ ప్లాంట్ ఎప్పుడు పెడతారో.. అప్పుడు ఉద్యోగాలు అందులో పొంది ... ఆ తర్వాత పెళ్లిళ్లు చేసుకుందామనుకుంటున్నారట. ఈ విషయాన్ని ఉక్కు సాధన ఐక్యవేదిక జిల్లా చైర్మన్ నారాయణరెడ్డి ప్రకటించారు.
కడప జిల్లా జమ్మలమడుగు లో ( Jammala Madugu ) స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన లు చేసిన స్థలాన్ని అఖిలపక్ష పార్టీల నేతలు సందర్శించారు. గతంలో మాజీ సీఎం చంద్రబాబు, ఇప్పటి సీఎం జగన్ ( CM Jagan )ప్రారంభించిన పైలాన్లు ను పరిశీలించారు. వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు, సీఎం జగన్ రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం కేంద్రాన్ని ప్రశ్నించడం లేదని కేంద్రం వద్ద లాలూచీ పడి రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షం లో ఉన్నప్పడు అధికారంలోకి రాగానే 3 సంవత్సరాల లోపు స్టీల్ ప్లాంట్ పనులు పూర్తి చేస్తామన్న సీఎం జగన్ మాటలు ఏమయ్యాయో వైఎస్ఆర్‌సీపీ నేతలు సమాధానం చెప్పాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వీడి స్టీల్ ప్లాంట్ కు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో ఉక్కు సాధన ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
విభజన చట్టం ప్రకారం కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాల్సి ఉంది. కేంద్రం ముందుకు రాకపోవడంతో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చైనా కంపెనీతో కలిసి ప్లాంట్ ను ఏర్పాటు చేయడానికి సిద్ధమయింది. కడప జిల్లా మైలవరం మండలం కంబాల దిన్నె గ్రామం వద్ద ఈ ఉక్కు ఫ్యాక్టరీకి శంఖుస్థాపన చేస్తారు. రూ. 18వేల కోట్ల రూపాయల పెట్టుబడితో మూడు మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్ధ్యంతో అదత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ ఫ్యాక్టరీని నిర్మించాలని నిర్ణయించారు . అయితే ప్రభుత్వం మారింది. దీంతో తర్వాత వచ్చిన వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం ( YSRCP ) స్టీల్ ప్లాంట్ పెట్టే ప్రాంతాన్ని మార్చింది.
2019 డిసెంబర్ 24న స్టీల్ ప్లాంట్‌కు కొబ్బరికాయ కొట్టారు. మూడంటే మూడేళ్లలో ఉక్కు పరిశ్రమ ఉత్పత్తి ప్రారంభించేలా చేస్తానని ఆయన ప్రకటించారు. రూ.15 వేల కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఈ పరిశ్రమ ద్వారా 25 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు వస్తాయని కూడా చెప్పారు. అయితే ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ ( AP High Grade Steels )పేరుతో ప్రత్యేకంగా సంస్థను ఏర్పాటు చేసిన ఏపీ సర్కార్ ఇంత వరకూ... కడప స్టీల్ ప్లాంట్ విషయంలో ఎలాంటి ముందడుగూ వేయలేకపోయింది. అతి కష్టం మీద పర్యావరణ అనుమతులు తీసుకుంది. కాన నిర్మాణాలు ప్రారంభం కాకపోవడంతో నిరుద్యోగుల్లో నిరాశ ఏర్పడుతోంది.