అన్వేషించండి

Jana Sena Party Membership Registration: జనసేనలో మూడు రకాల కార్యకర్తలు - సభ్యత్వ నమోదులో పవన్ కల్యాణ్ వినూత్న ఆలోచన

Pawan Kalyan: పవన్ కల్యాణ్ జనసేన పార్టీని వ్యూహాత్మకంగా బలోపేతం చేస్తున్నారు. కార్యకర్తలను మూడు రకాలుగా వర్గీకరించి సభ్యత్వం ఇస్తున్నారు.

JanaSena three types of activists : జనసేన పార్టీ తన సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, కార్యకర్తల భాగస్వామ్యాన్ని క్రమబద్ధీకరించేందుకు సరికొత్త సభ్యత్వ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో పార్టీలో మూడు రకాల సభ్యత్వ వర్గాలను నిర్ణయించింది.                                     
 
జనసేన పార్టీ తన శ్రేణులను మూడు విభాగాలుగా విభజించింది. మొదటి  వారిని  ఉద్యమి గా పిలుస్తారు. వీరు పార్టీపై నమ్మకం, అభిమానంతో ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న వారు. రెండవ కేటగిరీకి చెందిన వారిని సాధక్ అని పిలుస్తారు.  వీరు కేవలం సభ్యులుగానే కాకుండా, పార్టీ సభ్యత్వ నమోదును వేగవంతం చేస్తూ, పార్టీ ఆశయాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లే క్రియాశీలక పాత్ర పోషిస్తారు. ఇక మూడవ కేటగిరీలోకి ప్రధాతలు వస్తారు. వీరు  పార్టీకి వివిధ రూపాల్లో ఆర్థికంగా లేదా మేధోపరంగా అండగా నిలుస్తూ, నాయకత్వ బాధ్యతలు చేపట్టి పార్టీ బలోపేతానికి కృషి చేస్తారు.            

 
సభ్యత్వ నమోదు ప్రక్రియను పారదర్శకంగా మరియు సులభంగా నిర్వహించేందుకు జనసేన పార్టీ డిజిటల్ పద్ధతులను అవలంబిస్తోంది. ప్రతి సభ్యుని వివరాలను ఆన్‌లైన్ డేటాబేస్‌లో నిక్షిప్తం చేయడం ద్వారా, భవిష్యత్తులో వారికి ఇన్సూరెన్స్ వంటి ప్రయోజనాలను అందించాలని పార్టీ భావిస్తోంది. ముఖ్యంగా యువతను ఈ  ఉద్యమి-సాధక్-ప్రధాత ' విధానం వైపు ఆకర్షించడం ద్వారా పార్టీలో జవాబుదారీతనం పెరుగుతుందని నాయకత్వం ఆశిస్తోంది.                             


ఏపీలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, ప్రతి గ్రామం, వార్డులో జనసేన జెండాను రెపరెపలాడించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం సాగుతోంది. సాధారణ సభ్యుల నుండి నాయకుల వరకు వారి పనితీరు , అంకితభావాన్ని బట్టి ఈ వర్గీకరణలో గుర్తింపు లభిస్తుంది. ఈ నూతన విధానం ద్వారా పార్టీ కేడర్‌లో కొత్త ఉత్సాహం నింపడంతో పాటు, క్రమశిక్షణతో కూడిన రాజకీయ వ్యవస్థను నిర్మించాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు.                 


 

టాప్ హెడ్ లైన్స్

DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
AP Local Body Elections: 2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు
Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
రూ.19.45 లక్షల నుంచి మహీంద్రా BE 6 Sporteq.. మీ అవసరానికి సరిపోయే వేరియంట్‌ ఇదే!
మహీంద్రా BE 6 Sporteqలో ఏ వేరియంట్‌ బెస్ట్? ధర, బ్యాటరీ, ఫీచర్ల పూర్తి వివరాలు!
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
Embed widget