Pawan z Plus Security : పవన్ కల్యాణ్‌కు జెడ్ ప్లస్ సెక్యూరటీ కల్పించాలి - కేంద్రానికి జనసేన విజ్ఞప్తి !
పవన్ కల్యాణ్‌కు జెడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించాలని జనసేన పార్టీ కేంద్రాన్ని కోరుతోంది. పవన్ ప్రాణానికి ముప్పుందని జనసైనికులు ఆందోళన చెందుతున్నారు.
Pawan z Plus Security : పవన్ కల్యాణ్ భద్రతపై జనసేన పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. పవన్ కల్యాణ్ వాహనాలను కొంత మంది అనుసరిస్తున్నారని.. రెక్కీ నిర్వహిస్తున్నారన్న విషయం బయటపడిన తర్వాత ఈ ఆందోళన మరంత ఎక్కువ అయింది. ఏపీలో ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనలు , పరిణామాలు ప్రకారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ప్రాణహాని ఉందనిపిస్తోందని ఆ పార్టీ నేతలంటున్నరాు. ఆయన భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం పై నమ్మకం సన్నగిల్లిపోయిందని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి ప్రాణం కోట్లాదిమంది అట్టడుగు పేద, బహుజన వర్గాలకు ఎంతో ముఖ్యమని అందుకే ఆయనను కాపాడుకునేందుకు ఉద్యమం చేయాలని జనసేన క్యాడర్ పిలుపునిచ్చింది.
మోదీ , అమిత్ షాలకు లేఖలు రాయాలని జనసైనికులకు పిలుపు
" పవన్ కళ్యాణ్ గారికి కేంద్ర ప్రభుత్వం యొక్క జెడ్ ప్లస్ (Z+) కేటగిరి భద్రత కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీగారిని మరియు కేంద్ర హోమ్ శాఖ మంత్రివర్యులు అమిత్ షా గారిని ఈ మెయిల్స్ ద్వారా, ట్విట్టర్ ద్వారా మరియు ఉత్తరాల ద్వారా అడగవలసిందిగా కోరుతూ" ఓ క్యాంపైన్‌ను జనసైనికులు ప్రారంభించారు. ఎవరెవరికి లేఖలు రాయాలో.. కూడా ఈ మెయిల్స్ అడ్రస్‌లు కూడా ఇస్తున్నారు.
Visit and do complaint to:
1. WWW.pmindia.gov.in
(Prime Minister of India Office)
2. WWW.mha.gov.in
(Ministry of Home Affairs)
Email: Jscpgmha@nic.in
కేంద్ర ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకోవాలంటున్న నేతలు
ఇటీవల విశాఖలో జరిగిన పరిణామాలు, పోలీసులే పవన్ కల్యాణ్ వాహనంపైకి ఎక్కి రెచ్చొగట్టే ప్రయత్నం చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ఆయనను విశాఖలో పర్యటించకుండా చేశారు. విశాఖ పంపేశారు. ఈ పరిణామాలన్నింటితో పవన్‌కు ప్రాణహాని ఉందన్న ఆందోళన ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఇంటి వద్ద మరియు ఎక్కడికి వెళ్ళినా వెంట అనుసరిస్తూ అనుమానంగా కొందరు వ్యక్తులు గత రెండు రోజులుగా తిరుగుతూ ఆయన సిబ్బందిపై గొడవలకు దిగి పక్కాగా ప్లాన్ ప్రకారం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రాణ హాని కలిగించే అవకాశం ఉన్నందున
— JanaSena Party (@JanaSenaParty) November 3, 2022
(1/2) pic.twitter.com/JlLHMa5KWU
కేంద్రం భద్రత కల్పిస్తుందా?
ప్రస్తుతం పవన్ కల్యాణ్‌కు ప్రభుత్వ పరంగా ఎలాంటి సెక్యూరిటీ లేదు. వ్యక్తిగత సెక్యూరిటీనే ఉన్నారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ బీజేపీతో పొత్తులో ఉన్నారు. ఏపీలో ఉన్న పరిస్థితుల కారణంగా.. అక్కడి అధికార పార్టీ నేతల తీరు, పోలీసుల వ్యవహార శైలి కారణంగా పవన్ కు ముప్పు ఉందన్న ఆందోళన ఎక్కువగా వినిపిస్తోంది. అందుకే కేంద్రం పట్టించుకుంటుందని జనసైనికులు నమ్ముతున్నారు.
జగన్ రెడ్డీ నువ్వు సీఎంవా? గోడలు దూకి అరెస్టులేంటి? అయ్యన్న ఘటనపై చంద్రబాబు ఫైర్