YSRCP: ఏపీలో 2 వారాలపాటు జగనన్నే మా భవిష్యత్, అతిపెద్ద పీపుల్స్ సర్వే!
ఏప్రిల్ 7 నుంచి ఒక సమూహంగా పీపుల్స్ సర్వే జరుగుతుందని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.
ఏప్రిల్ 7 (శుక్రవారం) అంటే నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర వ్యాప్తంగా మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం ప్రారంభం అవుతోంది. వైసీపీ ప్రజా ప్రతినిధులు.. ఎమ్మెల్యేలు, గృహ సారథులు కన్వీనర్లు జనంలోకి వెళ్లి సంక్షేమ కార్యక్రమాలు వివరిస్తారు. ప్రజల అభిప్రాయాలు తీసుకుంటారు. ఈ నెల 20 వరకు ఈ కార్యక్రమం జరగనుంది.
జనం జపం చేయాల్సిందే...
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమాన్ని భారీ గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. శుక్రవారం నుంచి ఈ నెల 20 వరకు జరగనున్న... మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమంతో ఎమ్మెల్యే లు... ప్రజాప్రతినిధులు... నియోజక వర్గ నేతలు.. గృహ సారధులతో ప్రజల్లోకి వెళ్ళేందుకు జగన్ ప్లాన్ చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు జనంలోకి తీసుకెళ్లి అభిప్రాయం తెలుసుకొనున్న నేతలు... వాటిని వీలయినంత త్వరగా పరిష్కారం చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
రెండు వారాల పాటు ఫుల్ జోష్ తో...
మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం రెండు వారాలు పాటు జరగనుంది. ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. ప్రజల అభిప్రాయం తీసుకుంటారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు వివరిస్తారు. ప్రజలకు గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి తేడా తెలియచేస్తూ ఐదు ప్రశ్నలు ఉండనున్నాయి. ప్రతి ఇంటికి వెళ్ళినపుడు వారి అనుమతితో జగన్ ఫోటో ఉన్న స్టిక్కర్ కూడా అందిస్తారు. వారికి నచ్చితే స్టిక్కర్ గోడకు అంటించుకోవచ్చు. అదే విధంగా సెల్ ఫోన్ పై కూడా అంటించే స్టిక్కర్ ఇవ్వనున్నారు. మొత్తానికి వైసిపి అతి పెద్ద మాసివ్ సర్వే ప్రోగ్రాం చేయబోతోంది. లక్షలాది మంది కోటి 60 లక్షల ఇళ్ల దగ్గరకు వెళ్లి ప్రజల అభిప్రాయం తీసుకుంటారు.
ఇదొక పీపుల్స్ సర్వే... సజ్జల
ఏప్రిల్ 7 నుంచి ఒక సమూహంగా పీపుల్స్ సర్వే జరుగుతుందని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గృహసారధులు కోటి 60 లక్షల మంది ఇళ్లకు వెళ్లి ప్రజలతో మాట్లాడతారని, ఇదొక వినూత్న కార్యక్రమంగా ఆయన అభివర్ణించారు. ప్రజల అభిప్రాయం తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని, ప్రజల మద్దతు కొరడమే ప్రధాన అజెండాగా కార్యక్రమం జరుగుతుందని వివరించారు. మా నమ్మకం నువ్వే జగన్ అనే పేరుతో ఈ కార్యక్రమం జరుగుతుందని, అన్ని ఇళ్లకు వెళ్లి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య తేడా ఆడిగి తెలుసు కుంటారని అన్నారు. స్వాతంత్ర్యం తర్వాత ఎక్కడా లేని విధంగా కుల మతాలకు అతీతంగా ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. సమానత్వం దిశగా అడుగులు వెయ్యడంలో సీఎం జగన్ నాలుగేళ్లు పూర్తి చేసుకున్నారని సజ్జల అన్నారు.
సంతృప్తి చెందితేనే ఆశీస్సులు ఇవ్వండి అని సీఎం జగన్ అడుగుతున్నారని, మా నమ్మకం, నువ్వే జగన్ అనే నినాదం ప్రజల్లోంచి వచ్చింది. ప్రజలు ఇచ్చిందేనని సజ్జల వెల్లడించారు. ఈ ఏడాది సంక్షేమ క్యాలెండర్ ఇప్పటికే జగన్ ప్రకటించారని, భవిష్యత్ లో కూడా ఇంతకు మంచిన సంక్షేమం ఉండబోతోందని ఆయన వెల్లడించారు. జగనన్నే.. మా భవిష్యత్ కు ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు ఉండబోతోందని ఆశిస్తున్నామని చెప్పారు. ప్రత్యేకంగా ముద్రించిన కరపత్రాన్ని జనం దగ్గరకి తీసుకుని నేతలు వెళతారని, గత ప్రభుత్వం ఇప్పటి ప్రభుత్వానికి మధ్య తేడా గుర్తించే విధంగా కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. జగన్ పాలన కి సంబంధించి ఐదు ప్రశ్నలు ఉంటాయని, పాలనపై అభిప్రాయం 82960 82960 నంబర్ కు తెలియచేయాలని సూచించారు. ఇంటి యజమాని అనుమతితో ఇంటికి జగన్ స్టిక్కర్ అంటిస్తారని, సెల్ ఫోన్ కు కూడా స్టిక్కర్ వేసుకోవచ్చు. ఇదంతా ప్రజల ఇష్ట ప్రకారం జరుగుతుందన్నారు.