Jagan Health Tracker: జగన్ కుడి చేతి వేలికి హెల్త్ ట్రాకర్ - ఆరోగ్యాన్ని ప్రత్యేక టీం పర్యవేక్షిస్తోందా ?
YSRCP: జగన్ ఆరోగ్య పర్యవేక్షణకు హెల్త్ ట్రాకర్ వాడుతున్నారు. చంద్రబాబు కూడా ఈ హెల్త్ ట్రాకర్ ను ఉపయోగిస్తూంటారు.

Jagan using health tracker ring to monitor health: వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఎడమ చేతి మధ్య వేలికి హెల్త్ ట్రాకర్ రింగ్ ధరించారు. ఈ రింగ్ ఆరోగ్య సమాచారాన్ని, ముఖ్యంగా నిద్ర వివరాలను ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది. హృదయ స్పందన, నిద్ర నాణ్యత, ఒత్తిడి స్థాయిలు, శారీరక శ్రమ వంటి ఆరోగ్య సూచికలను ట్రాక్ చేస్తుంది. జగన్ ఆరోగ్య ఒత్తిళ్ల కారణంగా వీటిని ఉపయోగిస్తున్నారని భావిస్తున్నారు.
ప్రస్తుతం మార్కెట్‌లో దొరుకుతున్న హెల్త్ ట్రాకర్లు ప్రత్యేకమైన చిప్‌తో లభిస్తున్నాయి. ఫోన్ కు ఇది కనెక్టయి ఉంటుంది. ఇది పెట్టుకున్న వారి బాడీలోని మార్పులు ముఖ్యంగా..ఆక్సిజన్ లెవల్, బీపీ, షుగర్ వంటి అనేక అంశాలను ఫోన్ లో చూపిస్తుంది . రింగ్ కు చార్జింగ్ అవసరం. ఈ రింగ్ తో రేడియేషన్ సమస్య ఉడదు. రింగ్ ద్వారా హెల్త్ డిటైల్స్ ఫోన్ లో రికార్డు అవుతాయి. వాటిని డాక్టర్లు పర్యవేక్షించి.. ఏదైనా ట్రీట్మెంట్ అవసరం అయితే చేస్తారు.
ఏపీ సీఎం చంద్రబాబు గారు , మాజీ సీఎం జగన్ గారు .. ఇద్దరూ కుడి చేతి హెల్త్ ట్రాకర్ రింగ్ వాడుతున్నారు .. ఇది ఇంట్రెస్టింగ్ .. ఇప్పుడిప్పుడే ఈ రింగ్ వాడకం మొదలైంది pic.twitter.com/S30XmOabux
— ASHOK VEMULAPALLI (@ashuvemulapalli) June 19, 2025
ఫిట్‌నెట్ ట్రెండ్స్ గురించి ఆసక్తి ఉన్న ఎవరికైనా వేలికి పెట్టుకునే ఫిట్నెస్ మానిటర్స్ గురించి తెలుసు. చాలా మందికి వాచీలా చేతికి పెట్టుకుననే హెల్త్ మానిటర్స్ మెయిన్‌టెయిన్ చేస్తూంటారు. ఇప్పుడు లెటెస్ట్ టెక్నాలజీతో వేలికి పెట్టుకునే ఉంగరాల్లంటి పరికరాలు వచ్చేశాయి. ఇండియాలో ఇంకా పెద్దగా పాపులర్ కాలేదు. ఔరా స్మార్ట్ రింగ్ పేరుతో ఇది అక్కడి మార్కెట్లో అందుబాటులో ఉంది. ఫోన్‌కు కనెక్ట్ అవడం ద్వారా మొత్తం తెలిసిపోతుంది. ఎంత సేపు పడుకున్నారు, ఎంత సేపు పడుకోవాలో కూడా సజెస్ట్ చేస్తుంది. శరీరానికి అలసట లేకుండా ఆరోగ్యంగా ఎలా ప్రమాణాల ప్రకారం నడుచుకోవాలో ఎంత మేర పరిమితంగా తినాలో కూడా ఈ ఔరా రింగ్ సూచిస్తుంది. అయితే రింగ్ కొంటే సరిపోదు.. మెంబర్ షిప్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అంటే నెల నెలా చందా కట్టాలి. మొదటగా ఆ ఉంగరాన్ని కొనాలంటే 399 డాలర్లు వెచ్చించాలి. అంటే మన రూపాయల్లో 30వేలపైనే ఉంటుందని అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఒత్తిడికి గురవుతున్నందున ఆరోగ్యాన్ని ట్రాక్ చేసేందుకు ఏ ఏర్పాటు చేసుకున్నట్లుగా భావిస్తున్నారు. తినే ఆహారంతో పాటు ప్రతి అంశంలోనూ ఖచ్చితంగా ఉంటారు. అలాగే ఫిట్‌నెస్ విషయంలోనూ జాగ్రత్తగా ఉంటారు. కాపర్ బాటిల్‌లోని వాటర్ మాత్రమే తాగుతారు.
చంద్రబాబు కూడా గతంలో ఇలాంటి ఉంగరం వాడారు. అవయసు కూడా 70 దాటిపోయింది. అందుకే ఆయన శరీరంలో వచ్చే మార్పులపై కుటుంబసభ్యులు కూడా ప్రత్యేకంగా శ్రద్ద తీసుకుంటారు. ఈ రింగ్ ద్వారా వచ్చే సమాచారాన్ని విశ్లేషించి.. చంద్రబాబుకు ఆరోగ్యపరంగా సలహాలివ్వడానికి ఓ టీం ఎప్పుడూ పని చేస్తూ ఉంటుందని తెలుస్తోంది. ఇప్పుడు జగన్ కూడా అదే బాటలో నడుస్తున్నట్లుగా తెలుస్తోంది.





















