అన్వేషించండి

CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !

Andhra News : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతామని జగన్ అన్నారు. ఏపీ ప్రజలను జగన్ హెచ్చరించారు. ప్రచారసభల్లో భాగంగా నంద్యాలలో జగన్ ప్రసంగించారు.

YSRCP :  చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కిపోతాం. ఎవరి పాలనలో మంచి జరిగిందో మీరే ఆలోచించండి. ఈ ఎన్నికల్లో మీ కుటుంబ భవిష్యత్‌ ఆధారపడి ఉందని సీఎం జగన్ నంద్యాలలో హెచ్చరించారు.  ఈ ఎన్నికలు  బాబుకు చివరి ఎన్నికలు కావాలన్నారు.   ప్రతి గ్రామంలోనూ అభివృద్ధి, సంక్షేమం చేసి చూపించాం. ప్రతి నెలా ఒకటో తేదీనే పెన్షన్‌ ఇస్తున్నాం. లంచాలు, వివక్ష లేకుండా పాలన అందిస్తున్నాం. నాడు-నేడుతో ప్రభుత్వ స్కూళ్ల రుపురేఖలు మార్చాం. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్‌ మీడియాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు.  

 తాను ఒంటరిగా ఎన్నికలు వెళ్తున్నానని.. తనను ఓడించేందుకు తోడేళ్లన్నీ ఏకమయ్యాయని వ్యాఖ్యానించారు. ఈ పొత్తుకు కాంగ్రెస్ కూడా తోడయ్యిందని ఎద్దేవా చేశారు. కుట్రలు, కుతంత్రాలు ఎదుర్కొనేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉండాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డబుల్ సెంచరీ కొట్టేలా ప్రజలు సిద్ధంగా ఉండాలన్నారు. మోసాల చంద్రబాబు ఇవే చివరి ఎన్నికలు కావాలన్నారు. మూడు రాజధానులు, కొత్తగా రాష్ట్రంలో మరో 13 జిల్లాలను ఏర్పాటు చేశామని తెలిపారు. చంద్రబాబు14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారని.. తాను చేసినన్ని అభివృద్ది పనులు ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు. చంద్రబాబు పేరు చెబితే వ్యవసాయం దండగన్న వ్యాఖ్యలు గుర్తు కొస్తాయని ఎద్దేవా చేశారు. 2019లో ఇచ్చిన ఎన్నికల హామీలు 99 శాతం అమలు చేశామని జగన్ పేర్కొన్నారు.

 నారా వారి పాలన రాకుండా చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా నంద్యాల బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. గతంలో చంద్రబాబు, అబద్ధాలు, మోసాలు చూశాం. బాబు కూటమిని ఓడించేందుకు మీరంతా సిద్ధమా?. చంద్రబాబు జిత్తులమారి, పొత్తులమారి.. నరకాసురుడు, రావణుడు, దుర్యోధనుడు కలిశారన్నారు. నారా వారి పాలన మళ్లీ ఒప్పుకోమని ఏపీ ప్రజలు చెబుతున్నారు. వైఎస్సార్‌సీపీ ఐదేళ్ల పాలనపై అందరితోనూ చర్చించండి. ఇటు వైపు నేను ఒక్కడ్నే..అటు వైపు బాబు, దత్తపుత్రుడు, బీజేపీ, పరోక్షంగా కాంగ్రెస్‌. జగన్‌ను ఎదుర్కొనేందుకు ఇంతమంది తోడేళ్లు ఏకమయ్యారు. ఐదేళ్ల పాలనలో ఎన్నో మార్పులు తీసుకువచ్చాం. నష్టపోయిన రైతులకు ఇన్‌ఫుట్‌ సబ్సిడి అందించాం. 175కు 175 అసెంబ్లీ స్థానాలు.. 25కు 25 ఎంపీ స్థానాలు సాధించేందుకు ప్రజలు సిద్ధం. ఐదేళ్ల ఇంటింటి ప్రగతిని వచ్చే ఐదేళ్లుకూడా ముందుకు తీసుకెళ్తాం. 2 లక్షల 77వేల కోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశాం. 80 శాతం ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకే ఇచ్చాం. ఈ ఎన్నికలు ప్రజల భవిష్యత్తును నిర్ణయిస్తాయి’’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

‘‘చంద్రబాబు పేరు చెప్తే కరువు గుర్తుకొస్తుంది. బషీర్‌బాగ్‌లో రైతులపై కాల్పులు గుర్తుకొస్తాయి. గతంలో చంద్రబాబు రైతుల రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా? పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?. ఆడబిడ్డ పుడితే రూ.25వేల డిపాజిట్‌ చేస్తానన్నాడు చేశాడా?. నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు.. ఇచ్చాడా?. మూడు సెంట్ల స్థలం ఇస్తానన్నాడు.. ఇచ్చాడా?. సింగపూర్‌కు మించి అభివృద్ధి చేస్తాన్నాడు.. చేశాడా?. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ఇవన్నీ ఎందుకు చేయలేదు? మళ్లీ మరోసారి మోసం చేసేందుకు బాబు అండ్‌కో వస్తుంది. కొత్త రంగులు, కొత్త మోసాలతో బాబు మేనిఫెస్టో ఉంది. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలి. చంద్రబాబు అండ్‌కో పని దోచుకోవడం, పంచుకోవడమే’’ అంటూ సీఎం జగన్‌ మండిపడ్డారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Russia Ukraine War: ట్విన్ టవర్స్ పై అల్‌ఖైదా దాడుల తరహాలో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ -రష్యాలో భారీ బిల్డింగులపై ఎటాక్ - వీడియో
ట్విన్ టవర్స్ పై అల్‌ఖైదా దాడుల తరహాలో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ -రష్యాలో భారీ బిల్డింగులపై ఎటాక్ - వీడియో
Vizag Human Trafficking Case: విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
Asifabad Student Dies: ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
Earthquake In Prakasam: 5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

శ్రీతేజ్‌ హెల్త్‌‌ బులెటిన్ రిలీజ్, బిగ్ గుడ్ న్యూస్!హైటెక్ సిటీలో పేలుడు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు పరుగో పరుగుAmbani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Russia Ukraine War: ట్విన్ టవర్స్ పై అల్‌ఖైదా దాడుల తరహాలో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ -రష్యాలో భారీ బిల్డింగులపై ఎటాక్ - వీడియో
ట్విన్ టవర్స్ పై అల్‌ఖైదా దాడుల తరహాలో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ -రష్యాలో భారీ బిల్డింగులపై ఎటాక్ - వీడియో
Vizag Human Trafficking Case: విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
Asifabad Student Dies: ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
Earthquake In Prakasam: 5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
Agriculture: వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
Pawan Kalyan Request: నేను మీసం తిప్పితే మీకు రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
నేను మీసం తిప్పితే రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
Virat Kohli News: వారం రోజుల్లో తప్పు సరిదిద్దుకో- కోహ్లీకి నోటీసులు
వారం రోజుల్లో తప్పు సరిదిద్దుకో- కోహ్లీకి నోటీసులు
Coimbatore : రూ.1, రూ.2 నాణేలతో భార్యకు భరణం-షాకైన కోర్టు, ఆ తర్వాతేమైందంటే..
రూ.1, రూ.2 నాణేలతో భార్యకు భరణం-షాకైన కోర్టు, ఆ తర్వాతేమైందంటే..
Embed widget