Ongole CM Jagan : వంద మంది విలన్ల కంటే చంద్రబాబు దుర్మార్గుడు - ఒంగోలు సభలో జగన్ విమర్శలు
Ongole CM Jagan : ఒంగోలులో ఇళ్ల పట్టాల కార్యక్రమంలో చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు చేశారు. ఒక్క ఇంటి పట్టా కూడా చంద్రబాబు ఎవరికీ ఇవ్వలేదన్నారు.
Ongole CM Jagan : వంద మంది సినిమా విలన్ల దుర్మార్గం కంటే చంద్రబాబు దుర్మార్గమే ఎక్కువ అని సీఎం జగన్ ఆరోపించారు. ఒంగోలులో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు ఒక్క పేదవాడికీ చంద్రబాబు సెంటు స్థలం ఇవ్వలేదని. మనం మంచి చేస్తుంటే కోర్టులకు వెళ్లి రాక్షసుల్లా అడ్డుకున్నారని ఆరోపించారు. పేదలకు మంచి జరగకుండా కోర్టులో 1191 కేసులు వేశారు. చంద్రబాబు కుట్రలను అధిగమించి పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నామన్నారు.
ఇళ్ల పట్టాలివ్వకుండా చంద్రబాబు అడ్డుకున్నారు !
అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలిస్తే కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుందని చంద్రబాబు అంటున్నారని జగన్ ఆరోపించారు. ని కుట్రలు చేసి కూడా చంద్రబాబు ఇంకా బరితెగించి రాజకీయాల్లో ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారు. రుణమాఫీ పేరుతో పొదుపు సంఘాల మహిళలను చంద్రబాబు మోసం చేశారు. చంద్రబాబు 650 హామీలిచ్చి 10 శాతం కూడా అమలు చేయలేదు. చంద్రబాబు నిసిగ్గుగా కొత్త మేనిఫెస్టోతో ప్రజల ముందుకు వస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చే పథకం ఒక్కటైనా ఉందా?. చంద్రబాబులాంటి వారితో రాజకీయాలు భ్రష్టు పట్టాయి. ఏం మంచి చేశాడో చెప్పుకునేందుకు చంద్రబాబుకు ఏమీ లేవు.
చంద్రబాబు సతీమణి సిద్ధంగా లేమంటన్నారు !
మనం సిద్ధం అంటుంటే చంద్రబాబు సతీమణి సిద్ధంగా లేమంటున్నారు. కుప్పం నుంచే బైబై బాబు అంటున్నారు. చంద్రబాబును సమర్థించే వాళ్లు ఏపీలో లేని వాళ్లు మాత్రమే. చంద్రబాబు మాదిరి నాకు నాన్‌రెసిడెంట్స్ ఆంధ్రాస్ మద్దతు లేదు. మీ ఇంట్లో మంచి జరిగితే మీ బిడ్డకు తోడుగా ఉండండి. దళారులు, బ్రోకర్లను నేను నమ్ముకోలేదు. దేవుడి ఆశీస్సులు, ప్రజలే నా నమ్మకమని ప్రసంగించారు. దేశ చరిత్రలోనే 31 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చాం. 58 నెలల కాలంలో పేదల బతుకులు మారాలని అడుగులు వేశాం. ప్రతీ అడుగు పేదల సంక్షేమం కోసం వేశామన్నారు. చరిత్రలోనే తొలిసారిగా పేదలకు ఇంటి స్థలాల రిజిస్టర్డ్ కన్వేయన్స్ డీడ్స్ జరిగాయి. ఇళ్ల స్థలాలపై లబ్ధిదారులకు సర్వహక్కులు కల్పిస్తున్నాం. పేదల కోసం పెత్తందారులపై అనేక పోరాటాలు చేశామన్నారు.
రిజిస్ట్రేషన్ చేసిన పట్టాలు ఇస్తున్నాం !
రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు ఇవ్వడం వల్ల ఆస్తి మీద పూర్తి హక్కు ఉంటుందని సీఎం జగన్ తెలిపారు. భవిష్యత్‌లో రిజిస్ట్రేషన్లను క్యాన్సిల్ చేసే అవకాశం ఎవరికీ ఉండదు. రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వడం వల్ల కబ్జా చేసేందుకు కూడా వీలుపడదు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉండటం వల్ల సులభంగా బ్యాంక్ రుణాలు కూడా వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 17,005 జగనన్న కాలనీ లే అవుట్లు. 60వేల కోట్లతో 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు. రాష్ట్రవ్యాప్తంగా 71,811 ఎకరాల్లో ఇళ్ల పట్టాల పంపిణీ జరుగుతోంది. మౌలిక సదుపాయాల కోసం ప్రతీ ఇంటికి లక్ష ఖర్చు చేశాం. అక్కచెల్లెమ్మలను లక్షాధికారులు కాదు.. మిలియనీర్లను చేస్తున్నాం. ప్రాంతాన్ని బట్టి ఇంటి స్థలం విలువ 2.5లక్షల నుంచి 15లక్షల వరకు ఉంటుంది. ఒంగోలులో పేదల ఇళ్ల కోసం 210 కోట్లతో భూమి కొనుగోలు చేశాం. మరో 21 కోట్లతో లేఅవుట్ల అభివృద్ధి చేశాం. ఒంగోలులో తాగునీటి కోసం రూ.334 కోట్లతో పనులకు శంకుస్థాపన చేశాం. జగనన్న టౌన్‌షిప్‌లో మౌలిక వసతుల కోసం రూ.247 కోట్లు ఖర్చు చేశాం’ అని తెలిపారు.