అన్వేషించండి

YS Jagan: ఆందోళనలకు సిద్ధం కండి - క్యాడర్‌కు జగన్ పిలుపు

YSRCP: ఇళ్ల స్థలాలలను ప్రభుత్వం రద్దు చేస్తోందని ఆందోళనలకు సిద్ధం కావాలని జగన్ క్యాడర్‌కు పిలుపునిచ్చారు. 71.8 వేల ఎకరాల్లో 31.19 లక్షల పట్టాలను తమ ప్రభుత్వంలో ఇచ్చామన్నారు.

Jagan calls on cadre to prepare for protests: భారీ ఎత్తున ఆందోళనలకు సిద్ధం కావాలని వైసీపీ క్యాడర్ జగన్ పిలుపునిచ్చారు. పేదలకొరకు అవసరమైతే దీనిపై న్యాయపోరాటాలు  చేస్తాం, వారికి అండగా నిలబడతాం. ధర్నాలు, నిరసనలు, ఆందోళనలకు సిద్దమవుతామన్నారు. ఈ మేరకు ట్విట్టర్ లో వైఎస్ జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 

ఇళ్ల స్థలాలను రద్దు చేస్తారా ? 

ప్రజలు మీకు  అధికారం ఇచ్చింది పేదలపై కత్తికట్టడానికా? వారి సొంతింటి కలలను నాశనం చేయడానికా? మీది పేదలకు ఏదైనా ఇచ్చే ప్రభుత్వం కాదని, వారికి అందుతున్నవాటిని తీసివేసే రద్దుల ప్రభుత్వం అని, మీరు పేదల వ్యతిరేకి అని మరోసారి నిరూపణ అయ్యింది. పేద అక్కచెల్లెమ్మలకు రిజిస్ట్రేషన్‌ చేసిమరీ ఇచ్చిన ఇళ్లస్థలాలను రద్దు చేసే అధికారం మీకు ఎవరు ఇచ్చారు? వాళ్లు ఇళ్లు కట్టుకునేలా అండగా నిలబడాల్సింది పోయి, మా హయాంలో ఇచ్చిన స్థలాలను లాక్కుంటారా? అక్కచెల్లెమ్మల ఉసురు పోసుకుంటారా? తక్షణం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.   మీ హయాంలో ఇళ్ల పట్టాలూ ఇవ్వక, ఇళ్లూ కట్టించక పేదలు ఎంతోమంది నిరాశ్రయులుగా  మిగిలిపోయారని ఆరోపించారు.  కాని మేము వారి సొంతింటి కలను నిజం చేసేలా “పేదలందరికీ ఇళ్లు’’ కార్యక్రమం కింద 71.8 వేల ఎకరాల్లో 31.19 లక్షల పట్టాలను అక్కచెల్లెమ్మలకు ఇచ్చి, వారి పేరుమీదే రిజిస్ట్రేషన్‌ చేయించామని తెలిపారు.  ఇందులో కొనుగోలుకే రూ.11,871 కోట్లు ఖర్చుచేశాం. మా ప్రభుత్వంలో పేదలకు ఇచ్చిన ఇళ్లస్థలాల విలువ మార్కెట్‌ రేట్లతో చూస్తే రూ.1.5లక్షల కోట్లపైమాటేనని చెప్పుకొచ్చారు. టిపట్టావిలువే ఒక్కోచోట రూ. 2.5 లక్షల నుంచి రూ.10ల‌క్ష‌లు - రూ.15లక్షల వరకూ ఉంది. ఇళ్లపట్టాలకోసం, ఇళ్లకోసం ధర్నాలు, ఆందోళనలు మా ఐదేళ్లకాలంలో కనిపించకపోవడమే మా చిత్తశుద్ధికి నిదర్శనం.  

వైసీపీ హయాంలో  17,005 కాలనీలు

మా హయాంలో మేం 21.75 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని శాంక్షన్‌ చేయించి, మొదలుపెట్టడం ద్వారా ఏకంగా 17,005 కాలనీలు ఏర్పడ్డాయి. కోవిడ్‌లాంటి సంక్షోభాలను ఎదుర్కొంటూ అనతి కాలంలోనే ఇందులో 9 లక్షలకుపైగా  ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేశాం. అక్టోబరు 12, 2023న ఒకేసారి 7,43,396 ఇళ్లను ప్రారంభించి చరిత్రాత్మక ఘట్టాన్ని ఆవిష్కరించాం. చంద్రబాబుగారూ మీ జీవితంలో ఎప్పుడైనా ఇలా చేయగలిగారా? అలా చేయకపోగా ఇప్పుడు మిగిలిన ఇళ్ల నిర్మాణాన్ని ఎందుకు నిలిపేశారు? ఇది పేదల ఆశలను వమ్ము చేయడం కాదంటారా అని ప్రశ్నించారు. మా హయాంలో లబ్ధిదారులకు సిమెంటు, స్టీలు, వంటి నిర్మాణానికి అవసరమైన దాదాపు 12 రకాల సామాన్లు తక్కువ ధరకే అందించాం. ఈ రూపంలో ప్రతి లబ్ధిదారునికి రూ.40వేలు మేలు జరగడమే కాకుండా, దీంతోపాటు 20 టన్నుల ఇసుకను ఉచితంగా అందించి మరో రూ.15వేలు సహాయం చేశాం. మరో రూ.35వేలు పావలా వడ్డీకే రుణాలు ఇచ్చి, ఆ వడ్డీ డబ్బును రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించడం ద్వారా ఇంటి నిర్మాణానికి అండగా నిలబడ్డాం. ఈ రకంగా ప్రతి ఇంటికీ కేంద్రం ఇచ్చే రూ.1.8లక్షలు కాక, మొత్తంగా రూ.2.7లక్షల లబ్ధి చేకూర్చడమే కాకుండా, మౌలిక సదుపాయాల కొరకు మరో రూ.1లక్ష కూడా ఖర్చు చేసుకుంటూ పోయామన్నారు.    

కాలనీల్లో మౌలిక వసతులు కూడా కల్పించరా? 

 కాలనీల్లో మౌలిక సదుపాయాల కొరకు, మురికికూపాలుగా ఉండకూడదని, నీరు, కరెంటు, డ్రైనేజీ, ఇంకుడుగుంతలు, రోడ్లు తదితర సదుపాయాలకోసం దాదాపుగా రూ.3,555 కోట్లు మా హయాంలో ఖర్చుచేశాం. ఇళ్ల నిర్మాణ కార్యక్రమం ద్వారా మొత్తంగా మేం చేసిన ఖర్చు దాదాపుగా రూ.35,300 కోట్లు. ఈ  16-17 నెలల కాలంలో మీరెంత ఖర్చుచేశారని ప్రశ్నించారు.  మా హయాంలో “పేదలకు ఇళ్లు’’ కార్యక్రమం ముందుకు వెళ్లకూడదని మీరు  చేయని పన్నాగంలేదు. మీ పార్టీ నాయకుల ద్వారా మీరు కోర్టులో కేసులు వేయించారు. అమరావతిలో 50వేల పేద అక్కచెల్లెమ్మలకు ఇళ్లపట్టాలు ఇస్తే, సామాజిక అసమతుల్యత వస్తుందని కోర్టుల్లో వాదించి స్టేలు తేవడమే కాకుండా,  అధికారంలోకి రాగానే కర్కశంగా వ్యవహరించి ఇచ్చిన ఆ పట్టాలను రద్దుచేసి విజయవాడ, గుంటూరు నగరాల్లోని పేదలకు తీరని ద్రోహం చేశారు. మరి మీరు చేసింది ద్రోహం కాదా? పేద కుటుంబాలమీద మీరు కక్ష తీర్చుకోవడం లేదా? ఇది చాలదు అన్నట్టు, ఇక మిగిలిన పట్టాల్లో ఎక్కడైతే ఇంకా ఇళ్లు మీరు బాధ్యతగా శాంక్షన్‌ చేయించి, కట్టించాల్సింది పోయి, అక్కడ ఇంకా ఇళ్లు కట్టలేదు కాబట్టి, వాటిని, రిజిస్టర్‌ అయిన ఆ పట్టాలను, మీకు హక్కులేకపోయినా వెనక్కి తీసుకుని, మీ స్కాముల కొరకు, ప్రైవేటు ఇండస్ట్రియల్‌ పార్కులు కడతాం అంటూ ప్రకటనలు ఇవ్వడం మంచిది కాదన్నారు. 

ఆందోళనలకు సిద్ధం ! 

ఈ 16-17 నెలల కాలంలో పేదలకు ఇళ్ల విషయంలో మీ పనితీరు చూస్తే సున్నా. మీరు అధికారంలోకి వస్తే మాకు మించి ఇస్తామన్నారు. కాని, ఇప్పటివరకూ ఒక్క ఎకరం గుర్తించలేదు, ఒక్క ఎకరం కొనలేదు. ఏ ఒక్కరికీ పట్టాకూడా ఇవ్వలేదు. ఎవ్వరికీ ఇల్లుకూడా ఇవ్వలేదు. పైగా ఇప్పుడు ఇచ్చినవాటిని లాక్కునే దిక్కుమాలిన పనులు చేస్తున్నారు. ఇంత చెత్తగా పరిపాలిస్తూ మరోవైపు పేదలకు ఇచ్చిన ఇళ్లపట్టాలను లాక్కుంటున్నారు. దీన్ని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. పేదలకొరకు అవసరమైతే దీనిపై న్యాయపోరాటాలు  చేస్తాం, వారికి అండగా నిలబడతాం. ధర్నాలు, నిరసనలు, ఆందోళనలకు సిద్ధం కావాల్సిందిగా కేడర్‌కు కూడా పిలుపునిచ్చారు.  

టాప్ హెడ్ లైన్స్

Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
YS Avinash Reddy: అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
AP Local Body Elections: స్థానిక ఎన్నికల్లో ఫ్రెండ్లీ పోటీలు తప్పవా? - టీడీపీ, జనసేన మధ్య ఏం జరగబోతోంది?
స్థానిక ఎన్నికల్లో ఫ్రెండ్లీ పోటీలు తప్పవా? - టీడీపీ, జనసేన మధ్య ఏం జరగబోతోంది?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Mega 158 Title : మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... కూల్ లుక్ To మాస్ అన్నయ్య
మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... కూల్ లుక్ To మాస్ అన్నయ్య
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
YS Avinash Reddy: అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
Romantic Drama OTT : రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
Embed widget