అన్వేషించండి

CM Jagan : మంచి జరగాలంటే మీ బిడ్డకు తోడుగా ఉండండి - తుగ్గలిలో ప్రజలకు జగన్ విజ్ఞప్తి

Andhra News : మంచి జరగాలంటే మీ బిడ్డకు తోడుగా ఉండాలని జగన్ ప్రజల్ని కోరారు. బస్సు యాత్రలో భాగంగా తుగ్గలిలో గ్రామ సభ నిర్వహించారు.

Jagan asked people to be with Him  for good   :  ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు జరుగుతున్న మంచి కొనసాగాలంటే మీ బిడ్డకు అండగా ఉంటాలని వైసీపీ అధినేత జగన్ ప్రజల్ని కోరారు. మేమంతా సిద్ధం సీఎం జగన్‌ బస్సు యాత్ర శనివారం ఉదయం తుగ్గలికి చేరుకుంది. అక్కడి ప్రజలతో సీఎం జగన్‌ ముఖాముఖి నిర్వహించారు.  గతంలో లంచాల పాలన ఉండేదని.. గత 58 నెలలుగా వివక్ష లేకుండా పాలన కొనసాగుతోందన్నారు. 

ఐదేళ్లలో అభివృద్ధి చేశామన్న  జగన్                                                                                   

ఈ 58 నెలల పాలనలో గ్రామాల్లో అభివృద్ధి జరిగిందన్నారు.  తుగ్గలి, రాతన పరిధిలో 10 వేల జనాభా ఉంది.  ఈ రెండు గ్రామాల సచివాలయాల పరిధిలో అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి నగదు జమ చేశామని స్పష్టం చేశారు.   గతంలో ఏ పథకం కావాలన్నా లంచాలు అడిగే పాలన చూశారు. కానీ, వైఎస్సార్‌సీపీ పాలనలో కులం, మతం, ప్రాంతం చూడకుండా సాయం చేశామని గుర్తు చేశారు. 

బటన్ నొక్కి అందరి ఖాతాల్లోకి డబ్బులు జమ                                               

బటన్‌ నొక్కడం ద్వారా.. నేరుగా తుగ్గలి, రతన గ్రామాల్లో 95 శాతం ఇళ్లకు లబ్ధి చేకూరిందన్నారు.  తుగ్గలిలో గ్రామంలో అనేక కార్యక్రమాలు చేపట్టామని..  జగన్నన్న విద్యాదీవెన ద్వారా రెండు గ్రామాలకు రూ.2 కోట్లకు పైగా నిధులు అందించామన్నారు.  ఒక్క తుగ్గలి పరిధిలో వివిధ పథకాల రూపంలో రూ. 29 కోట్ల 65 లక్షల నిధులు మంజూరు చేశామని తెలిపారు.  రాతన గ్రామానికి పథకాల రూపంలో రూ. 26 కోట్లు 59 లక్షలు అందజేశామని సీఎం జగన్‌ చెప్పారు.  వైసీపీ ఓటు వేయని వారికి కూడా సంక్షేమ పథకాలు అందించామన్నారు. 

మంచి కొనసాగాలంటే మీ బిడ్డకు అండగా ఉండాలని విజ్ఞప్తి                                        

గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం చేసి చూపిస్తున్నామని.. జగన్ తెలిపారు.  గత ప్రభుత్వం హయాంలో జన్మభూమి కమిటీలదే రాజ్యమని ఆరోపించారు.  వలంటీర్ల ద్వారా ప్రతీ పథకం ఇంటి వద్దకే అందేలా చూస్తున్నామని..  ప్రతి ఇంటి తలుపు తట్టి సంక్షేమం అందించామన్నారు.  గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా గమనించాలని ప్రజల్ని కోరారు.   రైతు భరోసా, ఆర్బీకేల ద్వారా రైతన్నలకు అండగా ఉన్నామని..  విద్యావిధానంలో మార్పు తీసుకొచ్చాం ..ఆరోగ్యశ్రీ పరిధి విస్తరించామని ప్రజలకు చెప్పారు.  నాడు-నేడుతో బడుల రూపురేఖలు మారాయి.. ప్రతీరంగంలో.. ప్రతీ దశలోనూ మార్పు కనిపిస్తోందన్నారు.  మంచి కొనసాగాలంటే మీ బిడ్డకు తోడుగా ఉండాలని కోరారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Adilabad Crime News: బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
2025 Apple Launching Products: 2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడుశ్రీతేజ్‌ హెల్త్‌‌ బులెటిన్ రిలీజ్, బిగ్ గుడ్ న్యూస్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Adilabad Crime News: బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
2025 Apple Launching Products: 2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Credit Card Safety Tips: మీ క్రెడిట్ కార్డు డిటైల్స్ సేఫ్‌గా ఉంచాలనుకుంటున్నారా? - ఆన్‌లైన్ షాపింగ్‌లో ఇలా అస్సలు చేయకూడదు!
మీ క్రెడిట్ కార్డు డిటైల్స్ సేఫ్‌గా ఉంచాలనుకుంటున్నారా? - ఆన్‌లైన్ షాపింగ్‌లో ఇలా అస్సలు చేయకూడదు!
Aus VS Ind Series: ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
Fuel Filling Tips: బైక్ లేదా పెట్రోల్‌ను ట్యాంక్ ఫుల్ చేస్తున్నారా? - అయితే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే!
బైక్ లేదా పెట్రోల్‌ను ట్యాంక్ ఫుల్ చేస్తున్నారా? - అయితే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే!
Embed widget