jagan Tweet : టీడీపీ దాడులతో భయానక వాతావరణం - పోలీసు వ్యవస్థ నిస్తేజం - జగన్ ఆరోపణలు
Jagan : ఓడిపోయిన తర్వాత వైసీపీ అధినేత జగన్ మొదటి ట్వీట్ చేశారు. తమ పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని జోక్యం చేసుకోవాలని గవర్నర్ ను కోరారు.
CM Jagan On TDP : వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు వైసీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని రాష్ట్రంలో భయానక వాతావరణం ఉందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు కాక ముందే దాడులు చేస్తున్నారని.. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లాంటి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారపార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయింది. వెరసి ఐదేళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు.
ఆంధ్రప్రదేస్ గవర్నర్ వెంటనే జోక్యం చేసుకుని టీడీపీ కార్యకర్తల అరాచకాలను అడ్డుకోవాలని, ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవాలని కోరారు. టీడీపీ దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకూ, సోషల్ మీడియా సైనికులకు తోడుగా ఉంటామని హామీ ఇచ్చారు.
రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటుకాకముందే టీడీపీ ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లాంటి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. వైయస్సార్సీపీకి చెందిన నాయకులు,…
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 6, 2024
ఎన్నికల అనంతరం పలు చోట్ల ఘర్షణలు జరుగుతున్నాయని వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తోంది.అయితే అవన్నీ పాత కక్షల కారణంగా జరుగుతున్నాయని.. టీడీపీ అంటోంది. దెందులూరులో ఓ వైసీపీ కార్యకర్త బెట్టింగ్ కాసి ఓడిపోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడని..దానికి కారణం మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరేనని టీడీపీ నేతలు అంటున్నారు. అయితే ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా అది రాజకీయ దాడులతో ప్రమేయం ఉన్నట్లుగా ప్రచారం చేస్తున్నారని టీడీపీ నేతలు అంటున్నారు.
వైసీపీ కార్యకర్త చేత బెట్టింగ్ వేయించింది, అబ్బయ్య చౌదరి. బెట్టింగ్ ఓడిపోయాక అబ్బయ్య చౌదరి రివర్స్ అవ్వటం, డబ్బులు కోసం బెట్టింగ్ మాఫియా ఒత్తిడి చేయటంతో, ఆ ఒత్తిడిలో వైసీపీ కార్యకర్త ఆత్మహత్య చేసుకుంటే, ఎదురు టిడిపి మీద తోస్తారా ?
— Telugu Desam Party (@JaiTDP) June 6, 2024
ఈ శవ రాజకీయాన్ని ప్రజలు ఛీ కొట్టారు. ప్రజా… pic.twitter.com/Mqun4AQgQP
గవర్నర్ ను కలిసేందుకు వైసీపీ నేతలు అపాయింట్ మెంట్ తీసుకున్నారు. సాయంత్రం వారు గవర్నర్ ను కలిసి దాడులపై ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.
రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న టీడీపీ గుండాలు..
— YSR Congress Party (@YSRCParty) June 6, 2024
ఉరవకొండలో వైయస్ఆర్ సీపీ కార్యకర్తపై విచక్షణారహితంగా కర్రలతో దాడులు చేస్తూ సామాన్య ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్న @JaiTDP గూండాలు.#TDPGoons pic.twitter.com/75xeL3Pmu0
ఎన్నికల ఫలితాల అనంతరం ఘర్షణలు జరిగే అవకాశం ఉండటంతో పెద్ద ఎత్తున కేంద్ర బలగాల్ని ఇప్పటికే మోహరించారు. సమస్యాత్మక ప్రాంతాలన్నింటిలోనూ ప్రత్యేక బలగాలు ఉన్నాయి.