అన్వేషించండి

Jagan : అసెంబ్లీకి రానట్టే- ప్రమాణ స్వీకారానికి ముందే తేల్చేసిన జగన్

Andhra News : అసెంబ్లీకి హాజరవకూడదని జగన్ నిర్ణయించుకున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. చచ్చేదాకా కొట్టాలంటున్నారని అలాంటి వారి మధ్య మనమేం చేయలేమని వ్యాఖ్యనించారు.

Ysrcp News : అసెంబ్లీకి హాజరయ్యే విషయంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలకు కొన్ని  సంకేతాలు ఇచ్చారు. అసెంబ్లీలో ఏమీ చేయలేమని ప్రజలతో కలిసి పోరాటాలు చేయడమే మంచిదన్న అభిప్రాయాన్ని పార్టీ కార్యవర్గ సమావేశంలో వ్యాఖ్యానించారు. జగన్‌ ఓడిపోయాడు.. చనిపోలేదు అని ఒకరు అంటున్నారని..   చచ్చేదాకా కొట్టాలి అని ఇంకొకరు అంటున్నారని మండిపడ్డారు.  ఇలాంటి కౌరవులు ఉండే సభకు మనం వెళ్లాల్సి ఉంటుందని... ఇలాంటి వ్యక్తుల మధ్య అసెంబ్లీలో మనం ఏదో చేయగలుగుతామనే నమ్మకం లేదని జగన్ స్పష్టం చేశారు. 

ప్రజలతో కలిసి పోరాటాలు చేయాలనే ఆలోచన                          

పాపాలు పండే కొద్దీ ప్రజలతో కలిసి, ప్రజలతో నిలబడి చేసే కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఊపందుకుంటున్నాయి. శిశుపాలుడి పాపాలు పండినట్టుగా ఇప్పటికే చంద్రబాబు పాపాలు పండుతూనే ఉన్నాయన్నారు.  ప్రజల మధ్యకి గౌరవంగా వెళ్లగలుగుతామని..   కాలం గడుస్తున్న కొద్దీ మన పట్ట అభిమానం వ్యక్తమవుతుందని చెప్పుకొచ్చారు.  మళ్లీ మనం రికార్డు మెజార్టీలో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.  మోసపోతున్నవారికి మనం అండగా నిలవాలి. మనకార్యకర్తలకు మనం తోడుగా ఉండాలి. ఎప్పుడూ చూడని విధంగా కార్యకర్తలమీద, సానుభూతి పరులమీద దాడులు చేస్తున్నారు. కొన్ని చోట్ల అవమానాలు, ఆస్తుల నష్టాలు చేస్తున్నారు. వీళ్లందరికీ కూడా భరోసా ఇవ్వాలని పార్టీ నేతల్ని కోరారు. 

పవన్ భార్యల గురించి ఎందుకు? రోజా గురించి నాకు బాగా తెలుసు - సీనియర్ నటుడు సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రతిపక్ష హోదా కూడా రాకపోవడంతో ప్రోటోకాల్ లభించే చాన్స్ లేదు !                 
 
అసెంబ్లీలో వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాకపోవడంతో అసెంబ్లీకి వెళ్లే విషయంలో జగన్ ఆలోచిస్తున్నారు. గత అసెంబ్లీలో వైసీపీ సభ్యులు టీడీపీ సభ్యుల్ని తీవ్రంగా అవమానించిన ఘటనలు చోటు చేసుకున్నాయి. కొన్ని  సార్లు దాడుల ఘటనలు కూడా జరిగాయి. పార్టీ అధినేత చంద్రబాబును అవమానించంతో ఇది కౌరవ సభ అని ఆరోపించి.. మళ్లీ సీఎంగానే సభలో అడుగుపెడతానని సవాల్ చేసి వెళ్లారు. ఇప్పుడు సీఎంగానే ఆయన సభలో అడుగుపెట్టనున్నారు. అయితే జగన్ కు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. 

గత సభలో టీడీపీ సభ్యులకు ఘోర అవమానాలు                          

టీడీపీ సభ్యులు పదకొండు మంది మాత్రమే ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలను పట్టించుకోరని జగన్ ను అవమానించే అవకాశాలు ఎక్కువగా  ఉంటాయని భావిస్తున్నారు. అందుకే జగన్ అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజల్లోనే ఉండి పోరాడాలని అనుకుంటున్నారు. ఓ ఏడాది తర్వాత ప్రజల్లోకి వెళ్తే సరిపోతుందని అనుకుంటున్నారు. అందుకే  అసెంబ్లీలో ఈ సారి వైసీపీ ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం ఉండే అవకాశం తక్కువగా ఉందని  భావిస్తున్నారు.                

టాప్ హెడ్ లైన్స్

ఇంద్రకీలాద్రిపై దసరా కళా ప్రదర్శనలు: దరఖాస్తులకు మరో 5 రోజులే సమయం ఉంది..ఇలా అప్లై చేసుకోండి!
ఇంద్రకీలాద్రిపై దసరా కళా ప్రదర్శనలు: దరఖాస్తులకు మరో 5 రోజులే సమయం ఉంది..ఇలా అప్లై చేసుకోండి!
Machilipatnam To Kurnool Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
AP Sachivalayam Sports Quota Scam: డీఎస్సీ ఆరోపణలపై కౌంటర్ ఎటాక్ - ఏపీ సచివాలయ ఉద్యోగాల్లో క్రీడా కోటా అక్రమాలపై త్వరలోనే శ్వేతపత్రం ?
డీఎస్సీ ఆరోపణలపై కౌంటర్ ఎటాక్ - ఏపీ సచివాలయ ఉద్యోగాల్లో క్రీడా కోటా అక్రమాలపై త్వరలోనే శ్వేతపత్రం ?
YSRCP Leaders Joining Janasena: జనసేనలోకి వైఎస్సార్‌సీపీ నేతల క్యూ - పవన్‌కు దక్కుతున్న పొలిటికల్ మూమెంటం.. కానీ కూటమి పరిమితులే అసలు చిక్కు?
జనసేనలోకి వైఎస్సార్‌సీపీ నేతల క్యూ - పవన్‌కు దక్కుతున్న పొలిటికల్ మూమెంటం.. కానీ కూటమి పరిమితులే అసలు చిక్కు?

వీడియోలు

Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్
Sunil Gavaskar about Selection Committee | చీఫ్ సెలెక్టర్ పదవిపై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh Visits Tirumala: సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
Machilipatnam To Kurnool Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
YSRCP Leaders Joining Janasena: జనసేనలోకి వైఎస్సార్‌సీపీ నేతల క్యూ - పవన్‌కు దక్కుతున్న పొలిటికల్ మూమెంటం.. కానీ కూటమి పరిమితులే అసలు చిక్కు?
జనసేనలోకి వైఎస్సార్‌సీపీ నేతల క్యూ - పవన్‌కు దక్కుతున్న పొలిటికల్ మూమెంటం.. కానీ కూటమి పరిమితులే అసలు చిక్కు?
TGPSC Exams Schedule: టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్, నవంబర్ నెలల్లో పరీక్షలు
టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్, నవంబర్ నెలల్లో పరీక్షలు
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: రోహిత్ ముఖం మీద త్రిగుణ్ ఉమ్మేశాడా! నామినేషన్స్‌లో గోల గోల!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: రోహిత్ ముఖం మీద త్రిగుణ్ ఉమ్మేశాడా! నామినేషన్స్‌లో గోల గోల!
రూ.9.19 లక్షల ధరలో రెండు మంచి సెడాన్లు.. బూట్ స్పేస్, మైలేజీ, ఫీచర్లలో రెండిటి మధ్య తేడాలు
టాటా ఏరిస్ CNG vs మారుతి డిజైర్ CNG.. ధర దాదాపు సేమ్‌, ఏ కారులో ఎక్కువ ఫీచర్లు?
Bahadurpuga farmers: బహదూర్‌గూడ రైతుల కథ ప్యారడైజ్ సినిమా లాంటిది - బీఆర్ఎన్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
బహదూర్‌గూడ రైతుల కథ ప్యారడైజ్ సినిమా లాంటిది - బీఆర్ఎన్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
Tragedy in Medchal Malkajgiri: రైలు ఢీకొని 100 గొర్రెలు మృత్యువాత.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఘటన
రైలు ఢీకొని 100 గొర్రెలు మృత్యువాత.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఘటన
Embed widget