అన్వేషించండి

Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి తుపాను ముప్పు, తెలంగాణలోనూ ఈ జిల్లాలకు రెయిన్ అలర్ట్

Heavy Rains: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఆవర్తనం ప్రభావంతో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు.

Rains Alert To AP And Telangana: తూర్పు మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉత్తర అండమాన్ మీదుగా ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లోపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనించి, ఈ నెల 22వ తేదీ ఉదయం నాటికి వాయుగుండంగా, ఈ నెల 23 నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది. అనంతరం, ఇది వాయువ్య దిశగా పయనించి ఈ నెల 24 ఉదయం నాటికి ఒడిశా - పశ్చిమబెంగాల్ తీరాలకు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతానికి చేరుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

దీంతో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 24 నాటికి మరో వాయుగుండం ఏర్పడనుంది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు వెల్లడించారు. ఈ నెల 24, 25 తేదీల్లో ఉత్తరాంధ్రలో విస్తృతంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. ఈ నెల 23, 24 తేదీల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈదురుగాలులు వీస్తాయని చెప్పారు. సముద్రం అలజడిగా ఉంటుందని.. ఈ నెల 24 వరకూ మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తిరిగి రావాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. విశాఖ జిల్లా కలెక్టరేట్, తహసీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. 

ఈ జిల్లాల్లో వర్షాలు

ఆవర్తనం ప్రభావంతో సోమవారం అల్లూరి సీతారామరాజు, పల్నాడు, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అటు, శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

తెలంగాణలోని ఈ జిల్లాల్లో

అటు, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడకక్కడ తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే 4 రోజులు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. సోమవారం.. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, మహబూబాబాద్, హన్మకొండ, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు పడే ఛాన్స్ ఉందని వివరించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అలాగే, ఈ నెల 25వ తేదీ వరకూ పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

Also Read: Free Gas Cylinder: దీపావళి నుంచి మరో కొత్త పథకం అమలు - ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Araku coffee: అరకు బ్రాండ్ నానో లాట్ కాఫీ కేజీ రూ.పదివేలు - అయినా నిమిషాల్లో స్టాక్ క్లియర్ - ఆనంద్ మహింద్రా ఆనందం !
అరకు బ్రాండ్ నానో లాట్ కాఫీ కేజీ రూ.పదివేలు - అయినా నిమిషాల్లో స్టాక్ క్లియర్ - ఆనంద్ మహింద్రా ఆనందం !
Tamil Nadu Elections 2026 : కరూర్ తొక్కిసలాట తర్వాత జరిగిన మొదటి ర్యాలీలో పాల్గొన్న విజయ్! DMK దుష్ట శక్తి అంటూ కామెంట్స్
కరూర్ తొక్కిసలాట తర్వాత జరిగిన మొదటి ర్యాలీలో పాల్గొన్న విజయ్! DMK దుష్ట శక్తి అంటూ కామెంట్స్
Business Reformer of the Year 2025: బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ చంద్రబాబు - అభినందించిన మంత్రులు, అధికారులు
బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ చంద్రబాబు - అభినందించిన మంత్రులు, అధికారులు
Pakistan begging : విదేశాలకు వెళ్లి మరీ అడుక్కుంటున్న పాకిస్తాన్ ప్రజలు - పరువు పోతోందని వాళ్లను ఏం చేశారంటే ?
విదేశాలకు వెళ్లి మరీ అడుక్కుంటున్న పాకిస్తాన్ ప్రజలు - పరువు పోతోందని వాళ్లను ఏం చేశారంటే ?

వీడియోలు

గిల్ విషయంలో బీసీసీఐ షాకిండ్ డెసిషన్..గాయం సాకుతో వేటు?
జాక్‌పాట్ కొట్టేసిన ఆర్సీబీ.. ఐపీఎల్‌ మినీ వేలంలో ఆర్సీబీ ఆ పాయింట్‌పైనే ఫోకస్ చేసిందా?
విధ్వంసం c/o SRH.. ఈసారి టైటిల్ ఆరెంజ్ ఆర్మీదే?
అక్కడే ఎందుకు?.. 4వ టీ20 మ్యాచ్ రద్దుపై ఫ్యాన్స్ సిరియస్
James Cameron Shoot Varanasi Mahesh Scenes | జేమ్స్ కేమరూన్ డైరెక్షన్ లో వారణాసి మహేశ్ బాబు | ABP

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Araku coffee: అరకు బ్రాండ్ నానో లాట్ కాఫీ కేజీ రూ.పదివేలు - అయినా నిమిషాల్లో స్టాక్ క్లియర్ - ఆనంద్ మహింద్రా ఆనందం !
అరకు బ్రాండ్ నానో లాట్ కాఫీ కేజీ రూ.పదివేలు - అయినా నిమిషాల్లో స్టాక్ క్లియర్ - ఆనంద్ మహింద్రా ఆనందం !
Tamil Nadu Elections 2026 : కరూర్ తొక్కిసలాట తర్వాత జరిగిన మొదటి ర్యాలీలో పాల్గొన్న విజయ్! DMK దుష్ట శక్తి అంటూ కామెంట్స్
కరూర్ తొక్కిసలాట తర్వాత జరిగిన మొదటి ర్యాలీలో పాల్గొన్న విజయ్! DMK దుష్ట శక్తి అంటూ కామెంట్స్
Business Reformer of the Year 2025: బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ చంద్రబాబు - అభినందించిన మంత్రులు, అధికారులు
బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ చంద్రబాబు - అభినందించిన మంత్రులు, అధికారులు
Pakistan begging : విదేశాలకు వెళ్లి మరీ అడుక్కుంటున్న పాకిస్తాన్ ప్రజలు - పరువు పోతోందని వాళ్లను ఏం చేశారంటే ?
విదేశాలకు వెళ్లి మరీ అడుక్కుంటున్న పాకిస్తాన్ ప్రజలు - పరువు పోతోందని వాళ్లను ఏం చేశారంటే ?
Upcoming Movies 2027: మహేష్ 'వారణాసి' to ప్రభాస్ 'స్పిరిట్', AA22xA6... నెక్స్ట్ ఇయర్ కాదు, 2027లో దుమ్ము రేపే సినిమాలు
మహేష్ 'వారణాసి' to ప్రభాస్ 'స్పిరిట్', AA22xA6... నెక్స్ట్ ఇయర్ కాదు, 2027లో దుమ్ము రేపే సినిమాలు
VB G Ram G Bill : లోక్‌సభలో వ్యతిరేకత మధ్య వీబీజీ రామ్ జీ బిల్లు ఆమోదం! ప్రతులు చించి నిరసన తెలిపిన ప్రతిపక్షం!
లోక్‌సభలో వ్యతిరేకత మధ్య వీబీజీ రామ్ జీ బిల్లు ఆమోదం! ప్రతులు చించి నిరసన తెలిపిన ప్రతిపక్షం!
Bengalore One Side Love: మహిళ వన్ సైడ్ లవ్ - తట్టుకోలేకపోయిన పోలీస్ - చివరికి ఏం జరిగింది?
మహిళ వన్ సైడ్ లవ్ - తట్టుకోలేకపోయిన పోలీస్ - చివరికి ఏం జరిగింది?
Avatar 3 : బాహుబలి, అఖండ, రుద్ర, సలార్‌లతో అవతార్ సెల్ఫీ దిగితే - ఇది మరో విజువల్ వండర్
బాహుబలి, అఖండ, రుద్ర, సలార్‌లతో అవతార్ సెల్ఫీ దిగితే - ఇది మరో విజువల్ వండర్
Embed widget