Happy New Year 2023: ఎన్టీఆర్ ట్రస్ట్ క్యాలెండర్, డైరీ లాంఛ్ చేసిన భువనేశ్వరి - ఆధునిక పద్ధతిలో మరిన్ని సేవలు
NTR Trust 2023 calendar and Dairies: ఎన్.టి.ఆర్. ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి నూతన సంవత్సర క్యాలెండర్, 2023 డిజిటల్ క్యాలెండర్ తో పాటుగా, డైరీ కూడా రిలీజ్ చేశారు.
NTR Trust 2023 calendar and Dairies: ఎన్.టి.ఆర్. ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. 2023 డిజిటల్ క్యాలెండర్ తో పాటుగా, డైరీ కూడా భువనేశ్వరి రిలీజ్ చేశారు.
2023లో ఎన్.టి.ఆర్. ట్రస్ట్...
డిజిటల్ క్యాలెండర్ ద్వారా ఆధునిక పద్ధతిలో ట్రస్ట్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు నారా భువనేశ్వరి వెల్లడించారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సీఈఓ. కె. రాజేంద్ర కుమార్ IPS (Retd), ప్రెసిడెంట్, హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్. ఎం. సాంబశివరావు , సీఓఓ ఏ. గోపి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సలహాదారు డి. రామకృష్ణ, డీన్, ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ Dr. ఎంవీ రామారావు మరియు డైరెక్టర్, NS. ప్రసాద్, పాల్గొన్నారు. ఈ డిజిటల్ క్యాలెండర్ యాప్‌ను అందరూ తమ మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్, లేదా యాపిల్ స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చునని భువనేశ్వరి స్పష్టం చేశారు. యాప్ ద్వారా రక్తం కావాల్సిన వారు డైరెక్ట్ గా ఎంక్వైరీ చేసుకోవచ్చని, రోజువారి దిన ఫలాలను కూడా ఇదే యాప్ ద్వారా తెలుసుకోవచ్చని ఆమె వివరించారు. ఎన్.టి.ఆర్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ఈ యాప్ ద్వారా తెలుసుకునేందుకు వీలుగా అప్ డేట్స్‌ను అందుబాటులో ఉంచుతామని చెప్పారు. ఎన్.టి.ఆర్ ట్రస్ట్‌కు డొనేషన్ ఇవ్వాలనుకున్న వారు ఒక క్లిక్ తో విరాళాలను అందజేయవచ్చునని తెలిపారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు...
ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలని నిర్ణయించారు. అందుబాటులోకి వస్తున్న సాంకేతిక పరిజ్క్షానాన్ని సద్వినియోగం చేసుకుంటూ అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి ట్రస్ట్ సేవలను అందించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే నూతన డిజిటల్ క్యాలెండర్ ను అందుబాటులోకి తీసుకువచ్చి, యాప్ ద్వారా సేవా, సామాజిక కార్యకలాపాలల్లో ముందు వరుసలో ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నామని ట్రస్ట్ నిర్వాహకులు చెప్పారు.
1997 నుంచి సేవలు...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1997లో ఎన్టీఆర్ ట్రస్ట్ పేరిట సాంఘిక సేవా కార్యక్రమాల నిర్వాహణ కోసం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్టీఆర్ ట్రస్ట్ ను స్దాపించారు. తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు పేరును ట్రస్ట్ కు పెట్టారు. అంతేకాదు ట్రస్ట్ కోసం ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించారు. నారా లోకేష్ 2004 నుండిచిట్రస్ట్ కు ట్రస్టీగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మేనేజింగ్ ట్రస్టిగా కొనసాగుతున్నారు. ట్రస్ట్ కు సంబంధించిన కార్యకలాపాలను భువనేశ్వరి పరిశీలిస్తున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ప్రజలకు వైద్యం అందించేందుకు విశేషంగా సేవలను అందిస్తున్నారు. ప్రధానంగా మహిళలు, పిల్లలు ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధ చూపుతూ ట్రస్ట్ కార్యకలాపాలను కొనసాగిస్తోంది. అదే విధంగా విద్య అవకాశాలను అందరికీ అందించే ఉద్దేశంతో ట్రస్ట్ కార్యకలాపాలను విస్తరిస్తోంది. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ప్రత్యేక పాఠశాలను నిర్వహిస్తూ పేద కుటుంబాలకు చెందిన ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి ఏటా విద్యార్థులకు స్కాలర్ షిప్ లతో పాటుగా, ప్రతిభ ఉన్న విద్యార్థులను ఎంత వరకు అయినా చదివించేందుకు అవసరం అయిన అన్ని సదుపాయాలను కల్పించటంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ముందుంటుందని మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి వెల్లడించారు.