Guntur Hospital: ఆ ఆస్పత్రిలో ఐదేళ్లుగా ఎలుకలపై యుద్ధం - కోట్లు ఖర్చయ్యాయి కానీ ఇప్పటికీ ...
గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఎలుకల్ని పారద్రోలడానికి ఐదేళ్లుగా వేట సాగిస్తున్నారు. ఇప్పటికీ అది కంటిన్యూ అవుతోంది.
Guntur Hospital: సాధారణంగా ఆస్పత్రిలో సిబ్బందిగా ఎవరుంటారు ? ముందుగా డాక్టర్లు.. తర్వాత నర్సులు.. సపోర్టింగ్ స్టాఫ్.. అటెండర్లు, ఆయాలు..ఇలా చాలా మంది ఉంటారు. కానీ ఎలుకల్ని పట్టడానికి ప్రత్యేకంగా ఉద్యోగులుంటారా ?. ఇదేందయ్యా.. ఎప్పుడూ వినలేదే అనుకుటారేమో.. ఉంటారు. ఇది నిజం. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్నారు.. అదే సాక్ష్యం. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఎటు చూసినా ఎలుకలు కనిపిస్తూ ఉంటాయి. అవే ఎలుకలు పేషెంట్ల ప్రాణాలకు ముప్పుగా మారటంతో అదికారులు వాటిని పట్టుకునేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారు...
గతంలో ఎలుకలు కొరకడంతో ఆస్పత్రిలో పేషంట్ల మృతి
గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఎలుకలు వ్యవహరం అంటే ఆషామాషీ కాదు.గతంలో జరిగిన సంఘటనలతో అధికారులు అప్రమత్తం అయ్యి,ఎలుకలను పట్టుకునేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారు.దీంతో వారు ఎప్పటికప్పుడు ఎలుకలను పట్టుకుంటున్నారు. గతంలో ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న చిన్నారులను ఎలుకలు కొరికేయటంతో వారు అపస్మారక స్దితిలోకి వెళ్లారు.అందులో ఒకరు చనిపోవటంతో ఘటన అందరిని కలచి వేసింది.ఈ వ్యవహరం పై తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారాన్ని రాజేశాయి.దీంతో అప్పటి నుండి గుంటూరు ఆసుపత్రిలో ఎలుకలు అంటేనే అందరికి భయంపట్టుకుంటుంది.
ఎలుకలు లేకుండా చేయడానికి ఐదేళ్ల కిందట ప్రత్యేకంగా నిధులు విడుదల చేసిన ప్రభుత్వం
అప్పటి గుంటూరు జిల్లా కలెక్టర్ ఈ వ్యవహరం పై సీరియస్ గా వ్యవహరించారు.పెద్ద ఎత్తున జిల్లా యంత్రాంగాన్ని ప్రభుత్వాసుపత్రి లో విధులు నిర్వర్తించేలా ఆదేశాలు ఇచ్చారు.పెద్ద ఎత్తున పారిశుధ్య కార్మికులు ఇరవై నాలుగు గంటల పాటు నెల రోజులకు పైగా పని చేసి, ఆసుపత్రిలో చెత్తా చెదారాన్ని తొలగించారు. ఎలుకలు వచ్చే మార్గాలను పూర్తిగా గుర్తించి వాటిని తరిమికొట్టేందుకు అవసరం అయిన అన్ని చర్యలు తీసుకున్నారు.ఇందు కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కూడా విడుదల చేసింది. నష్టనివారణా చర్యల్లో భాగంగా ఇప్పటికి గుంటూరు ఆసుపత్రిలో ఎలుకలను నివారించేందుకు ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపడుతూనే ఉంది.. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టీం లు ఇప్పటికి అలర్ట్ గా ఉంటూ ఎలుకలను పట్టుకోవటమే పనిగా విధులు నిర్వర్తిస్తున్నారు. నేటికి పదుల సంఖ్యలో ఎలుకలు గుంటూరు ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బోన్ లలో చిక్కుకుంటున్నాయి.
ఆస్పత్రికి వచ్చే వారు ఆహారపదార్థాలు ఎలా పడితే అలా పడేయడంతోనే సమస్య
ఆసుపత్రికి పెద్ద ఎత్తున రోగులు,వారి బందువులు వస్తుంటారు.అలా వచ్చిన వారు తినుబండారాలను కూడ తీసుకురావటం పరిపాటి..అయితే వాటిని ఎక్కడపడితే అక్కడ పడేయటంతో అవి ఎలుకలకు ఆహరంగా మారుతున్నాయి.ఒకే చోట ఆహరం పుష్కలంగా లభిస్తుండటంతో ఎలుకలు కూడ వందల సంఖ్యలో ఆసుపత్రిలో తిష్టవేశాయని అదికారులు భావిస్తున్నారు.5సంవత్సరాలుగా ఎలుకలు పై ప్రభుత్వ యంత్రాంగం నేటికి యుద్దం చేస్తూనేఉంది.
ఆ ఎమ్మెల్యేకు సొంత పార్టీ నేతలే విలన్లుగా మారారా, అధిష్టానం ఎలా స్పందిస్తుందో !