Ganesh Chaturthi 2021: గుంటూరులో చెత్త తరలించే ట్రాక్టర్ లో గణేష్ విగ్రహాలు... పారిశుద్ధ్య సిబ్బంది అత్యుత్సాహం... ఘటనపై దర్యాప్తునకు ఆదేశించిన కమిషనర్
వినాయక విగ్రహాలు చెత్త తరలించే ట్రాక్టర్లో తీసుకెళ్లడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటనపై గుంటూరు నగర కమిషనర్ దర్యాప్తునకు ఆదేశించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.
గుంటూరులో మున్సిపల్ సిబ్బంది అత్యుత్సాహం చిక్కుల్ని తెచ్చిపెట్టింది. వినాయక విగ్రహాలను చెత్తను తరలించే వాహనాల్లో తరలించడం వివాదాస్పదం అయ్యింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా అవ్వడంతో పారిశుద్ధ్య సిబ్బందిపై కమిషనర్ అనురాధ ఆగ్రహం వ్యక్తంచేశారు. శానిటరీ సూపర్ వైజర్‌ను విధుల నుంచి తప్పించారు. అత్యుత్సాహంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా వినాయక విగ్రహాలను చెత్త తరలించే ట్రాక్టర్లో తీసుకెళ్లడంపై కమిషనర్ అనురాధ మండిపడ్డారు. ఈ ఘటనపై విచారించాలని డిప్యూటీ కమిషనర్‌ను ఆదేశించారు.
Shocking & Disgusting!#Ganesh Ji’s idols are being forcefully removed & carried along with garbage in trucks by officials in Guntur,AP.
— Sunil Deodhar (@Sunil_Deodhar) September 6, 2021
See how officials behave & insult Hindu Gods when an Anti-Hindu CM tries to proselytise the State.
Everyone Should Strongly Condemn & Protest! pic.twitter.com/q3I2gObwS7
Also Read: చవితి వేడుకలకు అనుమతించాలని బీజేపీ నిరసన... ఉద్రిక్తంగా మారిన ఆందోళన... సోము వీర్రాజు అరెస్టు
సర్వత్రా విమర్శలు
గుంటూరు నగరంలోని ఫీవర్ ఆస్పత్రి సమీపంలో రోడ్డు పక్కన కొందరు వినాయక విగ్రహాలను విక్రయిస్తున్నారు. విగ్రహాలు అమ్మేందుకు అనుమతి లేదని గుంటూరు నగరపాలక సంస్థ సిబ్బంది విగ్రహాలను బలవంతంగా వాహనాల్లో తరలించారు. ఆ విగ్రహాలను చెత్త ట్రాక్టర్లలో ఎక్కించి తీసుకెళ్లారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటనపై నగరపాలక కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. గణపతి విగ్రహాలను చెత్త ట్రాక్టర్లలో ఎక్కించి తరలించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Another shameful anti Hindu act by @YSRCParty govt.
— S.Vishnu Vardhan Reddy (@SVishnuReddy) September 7, 2021
In guntur, state officials used garbage truck to move ganesha idol. This is unacceptable, govt must take strict action against the responsible officials & CM must apologize to Hindus.@blsanthosh pic.twitter.com/7LEf119Jp9
Also Read: ఫలించిన దిల్లీ పర్యటనలు... ఏపీకి రూ.పది వేల కోట్ల రుణం... ఆర్బీఐకి కేంద్ర ఆర్థికశాఖ లేఖ