Buddha Venkanna: పరిటాల హత్య కేసు నిందితులు ఇలానే చనిపోయారు, గంగాధర రెడ్డి మృతిపై CBI దర్యాప్తు చెయ్యాలి !
పరిటాల హత్య కేసు నిందితులు కూడా ఇలానే చనిపోయారు, కనుక గంగాధర రెడ్డి మృతి పై తప్పనిసరిగా సీబీఐ దర్యాప్తు చెయ్యాలని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న డిమాండ్ చేశారు.
గతంలో పరిటాల హత్య కేసు నిందితులు కూడా ఇలానే చనిపోయారు, కనుక గంగాధర రెడ్డి మృతి పై తప్పనిసరిగా సీబీఐ దర్యాప్తు చెయ్యాలని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సింపతీ కోసం అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ దర్యాప్తు కావాలని డిమాండ్ చేశారని, కానీ అధికారంలోకి రాగానే సైలెంట్ అయిపోయారని బుద్దా వెంకన్న అన్నారు. గతంలో పరిటాల రవిని హత్య చేయించింది, ఆ తరువాత వివేకానందరెడ్డిని చంపించింది ఒకరేనని సంచలన వ్యాఖ్యలు చేశారు.
సొంత బాబాయ్ గొడ్డలి దెబ్బతో చనిపోయి ఉంటే.. తన తోటి ఖైదీ విజయసాయి రెడ్డిని పంపించి అది గుండెపోటు మరణం అని చెప్పించాడని మాజీ ఎమ్మెల్సీ ఆరోపించారు. తరువాత మాజీ ఎంపీ వివేకా కుటుంబ సభ్యులు కేసుపై ఒత్తిడి తీసుకురావడంతో హత్య అని ఒప్పుకున్నారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో సింపతీ కోసం జగన్ సీబీఐ దర్యాప్తు కావాలన్నారు. కానీ అధికారంలోకి రాగానే సైలెంట్ అయిపోయారని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ కు వివేకా కుమారై ఎంతో.. సోదరుడు అవినాష్ రెడ్డి కూడా అంతే అని.. మరి ఆమెకు అన్యాయం చేస్తూ, అవినాష్ రెడ్డిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని బుద్ధా వెంకన్న ఆరోపించారు.
అనుమానాస్పద మరణాలు
వివేకా హత్య కేసులో సాక్షులు ఒకొక్కరు అనుమానాస్పద రీతిలో చనిపోతున్నారని, 40-45 ఏళ్ల వ్యక్తి రాత్రికి రాత్రే చనిపోవడం ఏంటని ప్రశ్నించారు. గంగాధర రెడ్డి మృతిపై సీబీఐ దర్యాప్తు చెయ్యాలి. గతంలో పరిటాల హత్య కేసు నిందితులు కూడా ఇలానే చనిపోయారు. అప్పట్లోనే పరిటాల హత్యలో వైఎస్ జగన్ పాత్ర ఉందని మేము ఆరోపించాం, కానీ వివేకా హత్య వల్ల ఎవరికి లాభమో అందరికీ తెలుసునన్నారు. వివేకానంద రెడ్డి కుమార్తె సునీతకు తన తండ్రి హత్య కేసులో దర్యాప్తునకు సహకరించమని అడిగినా సీఎం జగన్ ఏమాత్రం సహకరించలేదన్నారు. సునీతా రెడ్డికి, ఆమె భర్తకు ప్రభుత్వం రక్షణ కల్పించకపోవడం పలు అనుమానాలు వ్యక్తం చేశారు.
వివేకా ఫ్యామిలీ జాగ్రత్తగా ఉండాలి
మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి.. వైఎస్ వివేకా కుటుంబీకులకు ఏదైనా జరగొచ్చునని టీడీపీ నేత అన్నారు. అలా ఎవరికైనా హాని చేసి వాటిని టీడీపీ మీదకు నెట్టొచ్చు అని అనుమానాం వ్యక్తం చేశారు. అందుకే వెంటనే సునీత రెడ్డికి, ఆమె భర్తకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వివేకా హత్య కేసులో విచారణ వేగవంతం చెయ్యకపోతే మరిన్ని హత్యలు జరగొచ్చు అంటూ సంచలన వ్యాఖ్యలుచేశారు. ఇవన్నీ అనుమానాస్పద మరణాలుగా కనిపిస్తున్నా... పరిటాలను హత్య చేయించిన వాళ్లు.. వివేకాను హత్య చేయించింది ఒకరేనని ఆరోపించారు. వివేకా హత్య కేసులో అసలు దోషులను బయట పెట్టడంతో పాటు సునీతా రెడ్డి కుటుంబీకులకు రక్షణ కల్పించాలని సీబీఐకి విన్నవించు కుంటున్నామని చెప్పారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌కి z కేటగిరీ ప్రొటెక్షన్ ఇవ్వాలని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు.