అన్వేషించండి

Prattipati Pullarao : సంబంధం లేని కేసుతో తప్పుడు ప్రచారం - కుమారుడి అరెస్ట్ వార్తలపై ప్రత్తిపాటి పుల్లారావు స్పందన

Pullarao : తన కుమారుడు అరెస్టు పేరుతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. ఎపీఎస్‌డీఆర్ఐ పేరుతో తనకు టీడీపీ సీటు ప్రకటించిన రోజునే కేసు పెట్టారన్నారు.

Prattipati Pullarao : ఓటమి భయం నిలువెల్లా కమ్మేసిన ముఖ్యమంత్రి జగన్ రోజురోజుకీ మరింత దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని  మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు.  రాజకీయ క్షేత్రంలో నేరుగా ఎదుర్కోలేక తనకు అలవాటైన తప్పుడు కేసులతో ప్రత్యర్థులపై వేధింపులకు పాల్పడుతున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

సంబంధం లేని కంపెనీ పేరుతో ప్రత్తిపాటి శరత్‌పై కేసులు                

కంపెనీలో డైరెక్టర్‌గా గానీ, కనీసం షేర్ హోల్డర్ కూడా లేని తమ అబ్బాయిపై కక్షతో జీఎస్టీ ఎగవేతల ఉల్లంఘనల కేసులు పెట్టడమే అందుకు తార్కాణమని నిప్పులు చెరిగారు. కంపెనీలో లేని, కంపెనీలతో సంబంధం లేని వ్యక్తికి  జీఎస్టీ ఎగవేతలకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. గతంలోనూ ఇలానే బురదజల్లాలని చూశారని, ఇప్పుడు మరోసారి అదే పన్నాగం పన్నినట్లు కనిపిస్తోందని మండిపడ్డారు ప్రత్తిపాటి. తమకు సంబంధం లేని కంపెనీ పేరుతో దుష్ప్రచారానికి ఒడిగట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీఎస్‌డీఆర్‌ఐ ద్వారా తప్పుడు కేసులు బనాయించారని, వాటికి భయపడేది లేదన్నారు ప్రత్తిపాటి. 

స్టేట్‌మెంట్ పేరుతో పిలిచి అదుపులోకి  !                    

ఈ రోజు స్టేట్‌మెంట్ కోసం అని పిలిచి అదుపులోకి తీసుకున్నారని, వెంటనే అధికారపక్షం అనుకూల మీడియా ద్వారా తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తున్నారని మండిపడ్డారు. ప్రత్తిపాటి కుటుంబానికి ఉన్న విశ్వసనీయతను దెబ్బ తీయడానికే ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నారన్నారు. అయితే అక్రమ కేసులకు భయపడేది లేదని... చట్టపరంగానే దీటుగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్ ఎన్ని  ప్రయత్నాలు చేసినా తమకు బురద అంటించలేరని.. అధికార పక్షం, వారికి తొత్తులుగా మారిన అధికారగణం మరోసారి న్యాయస్థానాల్లో నవ్వులపాలు కాక తప్పదన్నారు ప్రత్తిపాటి. మాకు బురద అంటించాలని చూస్తే అది మీకు అంటుకుంటుంది జాగ్రత్త అని హెచ్చరించారు.   చిలకలూరిపేటలో వైకాపా, మంత్రి రజనీ వైఫల్యాలే వారి ఓటమికి బాటలు పరిచాయన్నారు. అదే సమయంలో నిరంతరం ప్రజల మధ్య ఉంటూ పార్టీని బలోపేతం చేసుకుని ఎన్నికలకి ముందే గెలుపుఖాయమే బలమైన స్థాయికి చేరుకున్నాం అని ఆ ప్రజాదరణ చూసి ఓర్వలేకే ఈ కేసుల రాజకీయానికి తెగబడ్డారన్నారు. 

చిలుకలూరిపేటలో అభ్యర్థి లేకనే ఇలాంటి కుట్రలు !               

చిలకలూరిపేటలో ప్రత్తిపాటికి పోటీగా నిలపడానికి కూడా అభ్యర్థులు దొరక్క వెదుక్కుంటోన్న వైకాపా నుంచి ఇంతకంటే ఏం ఆశించ లేమని చురకలు వేశారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎంతోమందిని ముఖ్యమంత్రులు అనేక సవాళ్లను ఎదుర్కొన్నా... జగన్‌ లాంటి సీఎంను, ఇలాంటి దివాళాకోరుతనాన్ని మాత్రం ఎప్పుడు చూడలేదన్నారు. ఇలాంటి కుట్రపూరిత, కక్షపూరిత రాజకీయాలు, దాడులు, అరెస్టుల్ని మాత్రం ఎక్కడా చూడ లేదు. తమ కుమారుడికి కనీసం ముందస్తు నోటీసులు కూడా లేకుండా అదుపులోకి తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ తరఫున తనకు చిలకూరిపేట నియోజకవర్గం నుంచి సీటు ఖరారు చేసిన రోజు సాయంత్రమే ఏపీఎస్‌డీఆర్ఐ కేసు నమోదు చేసిందని తెలిపారు.

 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
China Corruption mayor: చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
Vaammo Vaayyo Song Lyrics : ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్

వీడియోలు

పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
China Corruption mayor: చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
Vaammo Vaayyo Song Lyrics : ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
Venezuela : వెనిజులా రాజధాని కారకాస్‌పై క్షిపణి దాడి! పలు చోట్ల విధ్వంసం!
వెనిజులా రాజధాని కారకాస్‌పై క్షిపణి దాడి! పలు చోట్ల విధ్వంసం!
Maoist Latest News: ఆపరేషన్ కగార్ తరువాత దేశంలో అతిపెద్ద లొంగుబాటు! డీజీపీ వద్దకు మావోయిస్టు కీలకనేత బరిసెదేవా దళం!
ఆపరేషన్ కగార్ తరువాత దేశంలో అతిపెద్ద లొంగుబాటు! డీజీపీ వద్దకు మావోయిస్టు కీలకనేత బరిసెదేవా దళం!
Hyundai Creta నుంచి Tata Sierra వరకు - కొత్త Seltos ముందు బలంగా నిలబడే కారు ఏది?
కొత్త Kia Seltos - ధర, స్పెసిఫికేషన్లలో ఇతర కార్ల కంటే బెటర్‌గా ఉందా?
Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
Embed widget