అన్వేషించండి

Jagan CPRO Pudi Srihari Arrest: మాజీ సీఎం జగన్ సీపీఆర్వో, వైసీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అరెస్ట్.. ఏ కేసులో అంటే!

వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం జగన్ సీపీఆర్‌వో పూడి శ్రీహరిని సోషల్ మీడియా పోస్టింగ్‌ల కేసులో పోలీసులు బుధవారం తాడేపల్లిలో అరెస్ట్ చేశారు.

అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీపీఆర్‌వో పూడి శ్రీహరిని పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం ఉదయం తాడేపల్లిలోని ఆయన నివాసానికి చేరుకున్న పోలీసులు, అక్కడ సోదాలు నిర్వహించి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీహరి వినియోగిస్తున్న సెల్ ఫోన్, ల్యాప్‌టాప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన వైసీపీ మీడియా విభాగం బాధ్యతలను కూడా చూస్తున్నారు.

సోషల్ మీడియాలో ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత పోస్టింగ్‌లు పెట్టించారనే ఆరోపణలతో ఈ అరెస్ట్ జరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా చంద్రబాబు చేతిలో కత్తి పెట్టినట్లు ఉన్న ఒక యానిమేషన్ వీడియోను సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్ చేశారనే ఫిర్యాదుపై చిత్తూరులో కేసు నమోదైంది. ఈ కేసు విచారణలో భాగంగానే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. దాంతోపాటు మరికొన్ని కేసుల్లో విచారణలో భాగంగా శ్రీహరిని ప్రశ్నించనున్నారు.

మఫ్టీలో వచ్చి బలవంతంగా ఎత్తుకెళ్లారు.. వైసీపీ ఎమ్మెల్సీ

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీపీఆర్‌ఓ పూడి శ్రీహరిని పోలీసులు అరెస్ట్ చేసిన తీరుపై ఆ పార్టీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం జగన్‌ను కలిసి ఇంటికి తిరిగి వెళ్తుండగా, మఫ్టీలో వచ్చిన పోలీసులు శ్రీహరిని మార్గమధ్యలో అడ్డగించి బలవంతంగా ఎత్తుకెళ్లారని ఆయన ఆరోపించారు. ఏ కేసులో అదుపులోకి తీసుకుంటున్నారో, ఏ స్టేషన్‌కు తరలిస్తున్నారో కనీస సమాచారం ఇవ్వకుండా దౌర్జన్యంగా వ్యవహరించారని, ఆయన ఫోన్‌ను, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారని మండిపడ్డారు.

శ్రీహరిని తీసుకెళ్లిన కొద్దిసేపటికే మరికొంత మంది పోలీసులు ఆయన నివాసంపై దాడి చేసి సోదాలు నిర్వహించారని అప్పిరెడ్డి తెలిపారు. ఇంట్లో ఉన్న సహాయకుడిని బెదిరించి బయటకు పంపారని, పార్టీ ప్రజాప్రతినిధులు అక్కడికి వెళ్లినా లోనికి రానివ్వకుండా అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయని ఆయన విమర్శించారు.

సీనియర్ జర్నలిస్టు అయిన శ్రీహరిని ఇలా అక్రమంగా అరెస్టు చేయడం అత్యంత హేయమని, ఇది పూర్తిగా చట్టవిరుద్ధమని ఆయన పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో పోలీసులు చట్టాన్ని ఉల్లంఘించి వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ, పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం వెంటనే పూడి శ్రీహరిని బేషరతుగా విడిచిపెట్టాలని ఈ సందర్భంగా లేళ్ల అప్పిరెడ్డి డిమాండ్ చేశారు.

శ్రీహరి అరెస్టును ఖండించిన వైసీపీ

ఈ అరెస్టుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో, ఏ పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారో కనీస సమాచారం ఇవ్వకుండా పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారని వైసీపీ తన 'X' (గతంలో ట్విట్టర్) వేదికగా విమర్శించింది. రాష్ట్రంలో అక్రమ అరెస్టులు ఇంకెన్నాళ్లు కొనసాగుతాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పార్టీ, రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే శ్రీహరిని అరెస్ట్ చేశారని ఆరోపించింది.

మాజీ మంత్రి అంబటి ఆగ్రహం..

 కుప్పం పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయిన అక్రమ కేసుల్లో వైసీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని చిత్తూరు 2 టౌన్ సీఐ నెట్టి కాంతయ్య దౌర్జన్యంగా తీసుకెళ్లారని మాజీ మంత్రి అంబటి రాంబాబు.. పోలీసుల తీరును ఆయన తీవ్రంగా ఖండించారు.

 

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Vijayawada Gym Trainer Case: విజయవాడలో దారుణం - మత్తుమందు ఇచ్చి యువతిపై అత్యాచారం- జిమ్ ట్రైనర్ అబ్దుల్ ఖాదర్ ఘాతుకం!
విజయవాడలో దారుణం - మత్తుమందు ఇచ్చి యువతిపై అత్యాచారం- జిమ్ ట్రైనర్ అబ్దుల్ ఖాదర్ ఘాతుకం!
Breaking News: హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌పై హైకోర్టు ఆగ్రహం- నేరుగా హాజరుకావాలని ఆదేశం 
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌పై హైకోర్టు ఆగ్రహం- నేరుగా హాజరుకావాలని ఆదేశం 
Tirumala Sarva Darshan Re Entry Facility: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ - సర్వదర్శనం క్యూలైన్లలో రీ-ఎంట్రీ ఫెసిలిటీ.. ఇక గంటల తరబడి వేచి చూడక్కర్లేదు!
తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ - సర్వదర్శనం క్యూలైన్లలో రీ-ఎంట్రీ ఫెసిలిటీ.. ఇక గంటల తరబడి వేచి చూడక్కర్లేదు!
MCGS MSME Scheme: మ్యూచువల్ క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్.. పూచీకత్తు లేకుండా రూ.100 కోట్ల వరకు లోన్.. అర్హతలు, ఎలా అప్లై చేసుకోవాలంటే?
మ్యూచువల్ క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్.. పూచీకత్తు లేకుండా రూ.100 కోట్ల వరకు లోన్.

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lenin Collections : లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
Hyderabad CURE Housing Scheme: హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
Tirumala Sarva Darshan Re Entry Facility: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ - సర్వదర్శనం క్యూలైన్లలో రీ-ఎంట్రీ ఫెసిలిటీ.. ఇక గంటల తరబడి వేచి చూడక్కర్లేదు!
తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ - సర్వదర్శనం క్యూలైన్లలో రీ-ఎంట్రీ ఫెసిలిటీ.. ఇక గంటల తరబడి వేచి చూడక్కర్లేదు!
Double Murder Case : జ్యోతిష్యుడు చెప్పాడని పక్కింటి వాళ్లను చంపేశాడో ఉన్మాది - కోర్టు ఉరిశిక్ష వేసేసింది!
జ్యోతిష్యుడు చెప్పాడని పక్కింటి వాళ్లను చంపేశాడో ఉన్మాది - కోర్టు ఉరిశిక్ష వేసేసింది!
AP COVID Cases: ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
Irans Fattah Missiles: ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
PM Modi: స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
AP Local Body Elections Coalition Conflict: ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
Embed widget