అన్వేషించండి

AP Budget : వచ్చే ఏడాది ఏపీలో ఎన్నికల బడ్దెట్ - కసరత్తు ప్రారంభించిన ఆర్థిక మంత్రి బుగ్గన !

ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వచ్చే ఏడాది బడ్జెట్‌పై కసరత్తు ప్రారంభించారు. ఈ సారి ఎన్నికల బడ్జెట్ తేనున్నారు.


AP Budget : 2023-24 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ రూపకల్పనపై కసరత్తు ప్రారంభించింది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ. దీనికి సంబంధించి వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆర్థిక శాఖ అధికారులు భేటీ కానున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలతో పాటు.. రాష్ట్ర రెవెన్యూస్‌ ఏ విధంగా పెంచాలనే దానిపై ఈ సారి బడ్జెట్‌ కసరత్తులో ఫోకస్‌ పెట్టనున్నారు. ఇప్పటికే నిధుల సమీకరణకు నానా తంటాలు పడుతోన్న అధికారులకు..ఇప్పుడు బడ్జెట్‌కసరత్తు అంటే కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ఓవైపు సంక్షేమం.. మరోవైపు అభివృద్ధికి నిధులు కేటాయించక తప్పని సరి పరిస్థితి. అలాగని అభివృద్ధి విషయంలో కీలక  శాఖలను పక్కన పెట్టలేని స్థితి. దీంతో బడ్జెట్‌ రూపకల్పన  కత్తి మీద సాములా మారిందనే చర్చ జరుగుతోంది.

గతం కంటే మరో రూ. 20 వేల కోట్ల అదనపు లెక్కలతో బడ్జెట్ 

2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ 2,56,256 కోట్తో  బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది ఏపీ ప్రభుత్వం. ఈసారి అంతకు మించి బడ్జెట్‌ లెక్కలు ఉండాలని మంత్రి బుగ్గన అధికారులకు సూచనలు చేసినట్టు సమాచారం. ఈ క్రమంలో 2023-24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ 2.65 లక్షల కోట్ల నుంచి2.75 లక్షల కోట్ల రూపాయల మధ్య  ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు భేటీ అవుతున్నారు. దీంట్లో భాగంగా.. ఆయా శాఖలకు ఈ ఏడాది బడ్జెట్‌ ఏ మేరకు అవసరం అవుతుందనే అంచనాలు వేసుకోవాల్సిందిగా ఆర్థిక శాఖ అధికారులు సూచించనున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని శాఖలకు సంబంధించిన ఉన్నత అధికారులు అంచనాలు రూపొందించుకోవాలని సూచిస్తున్నారు. 

ఈ సారి సంక్షేమంతో పాటు అభివృద్ధి పనులకూ నిధులు

ప్రభుత్వ ప్రాధాన్యతలతో పాటు.. అవసరమైన మేరకే.. నిధులను కోరాల్సిందిగా సూచిస్తున్నారు.  గత ఏడాది తరహాలోనే సంక్షేమానికి పెద్ద పీట వేయాలని ప్రభుత్వం స్పష్టంగా భావిస్తుంది. అంతే కాదు వచ్చేది అంతా ఎన్నికల సమయమే కాబట్టి.. సంక్షేమానికి ఒకింత ఎక్కువే ఇవ్వాలి కాని, లోటు ఉండొద్దని ఇప్పటికే ఆర్ధిక శాఖ అధికారులకు ప్రభుత్వ పెద్దలు సూచించారు. ఇక అభివృద్ధి విషయంలోనూ ఈసారి ఎక్కువగా ఫోకస్‌ పెట్టక తప్పని సరి పరిస్థితి ఏర్పడింది.అత్యంత ప్రాదాన్యత కలిగిన రోడ్ల విషయంలో ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో రోడ్లకు భారీగానే నిధుల కేటాయింపు జరపాల్సి ఉంటుంది. అలాగే గృహ నిర్మాణంలోనూ ఇటీవల కాలంలో ప్రభుత్వం పై విమర్శలు వచ్చాయి. ఇళ్ల నిర్మాణం విషయంలో కూడ టార్గెట్‌ను రీచ్‌ కాలేకపోతుందని.. కేవలం పది శాతం ఇళ్లను మాత్రమే కట్టారని ప్రతిపక్షాలు ఆరోపణలతో హల్ చల్ చేస్తున్నాయి. దీంతో త్వరితగతిన ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు అవసరమైన నిధులను కేటాయించకుంటే.. ఎన్నికల నాటికి ఇళ్ల నిర్మాణం హామీని అమలు చేయలేకపోయామనే విమర్శలు ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టే ప్రమాదం లేకపోలేదు.  గృహ నిర్మాణ శాఖకు భారీగానే నిధులు కేటాయించాల్సి ఉంది. ఇదే తరహాలో ఇరిగేషన్‌కు కూడా నిధుల ఎక్కువే కావాల్సి ఉంటుంది.ఒ వైపు సంక్షేమానికి.. మరోవైపు అభివృద్ధికి అదిక నిధుల కేటాయింపులే చేయాల్సిందేనన్న విషయం స్ఫష్టం అవుతుంది.

ఆదాయ ఆర్జనపైనా ప్రత్యేకంగా దృష్టి 

ఆదాయార్జన శాఖలపై ప్రధానంగా ఫోకస్‌ పెట్టాల్సి ఉంటుందని అదికార వర్గాలు అంటున్నాయి. ఈ క్రమంలో ఎక్సైజ్‌, వాణిజ్య పన్నుల శాఖ, మైనింగ్‌, రెవెన్యూ వంటి వాటి నుంచి మరింత ఆదాయాన్ని సమకూర్చుకునే దిశగా  ప్రణాళికలను తప్పని సరిగా రెడీ చేసుకోవాలి.అంతే కాదు  రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగానే కేంద్ర పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వాలని ఆర్థిక శాఖ అధికారులు భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలుగా లేని కేంద్ర పథకాలకు మ్యాచింగ్‌ గ్రాంట్లు కేటాయించడం వల్ల రాష్ట్రానికి ఒరిగేదేం ఉండదనే అభిప్రాయం కూడ లేకపోలేదు. ఈ క్రమంలో విద్య, వైద్యం వంటి రంగాలను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతాంశాలుగా తీసుకుంటున్నందున ఈ రంగాలకు సంబంధించి కేంద్రం నుంచి ఎంత మేరకు నిధులను రాబట్టగలమనే అంచనాలను కూడా సిద్దం చేస్తున్నారు ఆయా శాఖలకు చెందిన అధికారులు.ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. అత్యంత ప్రాధాన్యంగా ఏయే అంశాలనైతే ప్రభుత్వం భావిస్తుందో.. వాటికి పెద్ద పీట వేసే దిశగా కెబినెట్‌ కూర్పు ఉండబోతోంది.

 

టాప్ హెడ్ లైన్స్

Banakacherla Project: పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం షాక్ - పర్యావరణ అనుమతుల ప్రతిపాదన వెనక్కి!
పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం షాక్ - పర్యావరణ అనుమతుల ప్రతిపాదన వెనక్కి!
Chiranjeevi AP Brand Ambassador Rumors: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా చిరంజీవి? క్లారిటీ ఇచ్చిన మెగాస్టార్ టీమ్!
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా చిరంజీవి? క్లారిటీ ఇచ్చిన మెగాస్టార్ టీమ్!
Pawan Kalyan : మంగళగిరిలోనే ఉన్న మంత్రివర్గ సమావేశానికి హాజరుకాని పవన్ కల్యాణ్‌- కూటమిలో ఏం జరుగుతోంది?
మంగళగిరిలోనే ఉన్న మంత్రివర్గ సమావేశానికి హాజరుకాని పవన్ కల్యాణ్‌- కూటమిలో ఏం జరుగుతోంది?
YSRCP Protest In Vijayawada: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
YSRCP Protest In Vijayawada: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Tarun Tejpal Judgement: అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
Embed widget