News
News
X

Manyam News: మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం, ఆవుల మందపై దాడి

Manyam News: పార్వతీపురం మన్యం జిల్లాలో మరోసారి ఏనుగులు బీభత్సం సృష్టించాయి. రెండు ఆవులు, ఓ లేగదూడను తొక్కి చంపాయి. అలాగే మిర్తివలసలోనూ ఆవుల మందపై దాడి చేశాయి. 

FOLLOW US: 
 
Manyam News: పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలంలో మంగళవారం ఏనుగుల మంద బీభత్సం సృష్టించింది. గంగులువాని చెరువు దగ్గర ఉన్న 2 ఆవులను, ఒక లేగ దూడను ఏనుగులు తొక్కి చంపాయి. మరోవైపు  మిర్తివలసలోనూ ఆవుల మందపై ఏనుగులు దాడి చేశాయి. దీంతో ఏనుగుల బీభత్సంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.  పంట పొలాలకు వెళ్లాలంటే  భయబాంత్రులకు గురవుతున్నామని రైతులు వాపోతున్నారు. గత నాలుగు ఏళ్లుగా మన్యం వాసులను తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల తరలింపులో అధికారులు, ప్రజా ప్రతినిధులు అలసత్వం వహిస్తున్నారని మండిపడ్డారు. ఏనుగుల దాడిలో వేల ఎకరాలు పంట నష్టం వాటిల్లిందని, మూగ జీవాలు కూడా ప్రాణాలు కోల్పోతున్నాయని ఇప్పటికైనా అధికారులు స్పందించి ఏనుగులను తరలించాలని కోరుతున్నారు.

మొన్నటికి మొన్న జిల్లాకు వచ్చిన ఏనుగులు..

పార్వతీపురం మన్యం జిల్లా  పార్వతీపురం నియోజకవర్గంలోని బలిజిపేట మండలం వెంగాపురం  గ్రామంలో నాలుగు ఏనుగులు బీభత్సం సృష్టించాయి. పంట పొలాలన్నీ నాశనం చేశాయి. విజయనగరం జిల్లా రాజాం మండలంలో ఉన్న ఈ ఏనుగురు అర్ధరాత్రి 25 కిలోమీట్లర మేర ప్రయాణం చేసి వెంగాపురం గ్రామ సమీపంలోని పంటపొలాలపై పడి పరుగులు పెట్టాయి. తొక్కి తొక్కి నాశనం చేశాయి. ఏనుగుల అరుపులతో విషయం గుర్తించిన గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చేతికి వచ్చిన పంటను నాశనం చేయడం చూసి కన్నీరుమున్నీరయ్యారు. అయితే అవే ఏనుగులు మరోసారి ఆవులు, లేగదూడపై దాడి చేయడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. 

నాలుగు నెలల క్రితం తిరుమల ఘాట్ రోడ్డులో..

News Reels

తిరుమల కొండపై ఏనుగుల సంచారం భక్తులను కలవరపెడుతుంది. కొన్ని రోజులుగా తిరుమల ఘాట్ రోడ్డులో ఏనుగులు సంచరిస్తుండడంతో భక్తులు భయాందోళనకు గురి అవుతున్నారు. ఆదివారం సాయంత్రం మొదటి ఘాట్ రోడ్డులోని ఎలిఫాంట్ ఆర్చ్ వద్ద 11 పెద్ద ఏనుగులు, మూడు చిన్న ఏనుగుల గుంపును చూసిన వాహనదారులు భయంతో వాహనాలను నిలిపివేసి అటవీ శాఖా అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ఏనుగుల గుంపును అటవీ ప్రాంతంలోనికి తరిమే ప్రయత్నం చేస్తున్నారు. భక్తులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీటీడీ అటవీ శాఖ అధికారులు తెలిపారు. 

ఒంటరి ఏనుగు హల్ చల్ 

తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఒంటరి ఏనుగు గురువారం కలకలం రేపింది. గురువారం సాయంత్రం మొదటి ఘాట్ రోడ్డుకు అనుకోని ఉన్న అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న ఒంటరి ఏనుగు ఒక్కసారిగా ఘాట్ రోడ్డు దాటుతూ భక్తులకు కనిపించింది. ఒంటరి ఏనుగు ఘీంకారాలకు ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురైయ్యారు. ఎలిఫెంట్ ఆర్చ్ కు సమీపంలో ఒంటరి ఏనుగు చూసిన వాహన చోదకులు వాహనాలు నిలిపివేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. విజిలెన్స్ సిబ్బంది వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారాన్ని అందించారు. వెంటనే అక్కడ చేరుకున్న అటవీ శాఖ అధికారులు భారీగా సైరన్ మోగించి ఒంటరి‌ ఏనుగును అటవీ ప్రాంతంలోకి పంపే ప్రయత్నం చేస్తున్నారు. తరచూ అదే‌ ప్రాంతంలో ఏనుగులు సంచరించడం గమనార్హం.

Published at : 25 Oct 2022 08:26 PM (IST) Tags: Elephant manyam district parvathipuram district elephant calf elephant trampled

సంబంధిత కథనాలు

Breaking News Live Telugu Updates: మహబూబ్‌నగర్‌ జిల్లాలో దారుణం- బాలికపై బాబాయ్ హత్యాచారం

Breaking News Live Telugu Updates: మహబూబ్‌నగర్‌ జిల్లాలో దారుణం- బాలికపై బాబాయ్ హత్యాచారం

Eluru District News: పైప్ లైన్ కోసం భూమిని తవ్వితే బంగారం పడింది

Eluru District News: పైప్ లైన్ కోసం భూమిని తవ్వితే బంగారం పడింది

AP Staff Nurse Posts: స్టాఫ్ నర్సు పోస్టులు 957కి పెరిగాయి, రివైజ్డ్ నోటిఫికేషన్ విడుదల చేసిన వైద్యారోగ్యశాఖ- దరఖాస్తు చేసుకోండిలా!

AP Staff Nurse Posts: స్టాఫ్ నర్సు పోస్టులు 957కి పెరిగాయి, రివైజ్డ్ నోటిఫికేషన్ విడుదల చేసిన వైద్యారోగ్యశాఖ- దరఖాస్తు చేసుకోండిలా!

రాష్ట్రపతి హోదాలో తొలిసారి ఏపీకి వస్తున్న ద్రౌపది ముర్ము- గ్రాండ్‌ వెల్‌కమ్‌కు ఏర్పాట్లు!

రాష్ట్రపతి హోదాలో తొలిసారి ఏపీకి వస్తున్న ద్రౌపది ముర్ము- గ్రాండ్‌ వెల్‌కమ్‌కు ఏర్పాట్లు!

పది రూపాయలు ఇచ్చి ఆ పని చేస్తున్నారు- బాలినేని కుమారుడిపై టీడీపీ సెటైర్లు

పది రూపాయలు ఇచ్చి ఆ పని చేస్తున్నారు- బాలినేని కుమారుడిపై టీడీపీ సెటైర్లు

టాప్ స్టోరీస్

Gujarat Elections: ప్రచార సభలో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్న ఒవైసీ - వైరల్ వీడియో

Gujarat Elections: ప్రచార సభలో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్న ఒవైసీ - వైరల్ వీడియో

Zero Cost Term Insurance: డబ్బు ఖర్చు లేకుండా బీమా- కట్టిన ప్రీమియాన్ని తిరిగిచ్చే 'జీరో కాస్ట్‌ టర్మ్‌ ఇన్సూరెన్స్‌'

Zero Cost Term Insurance: డబ్బు ఖర్చు లేకుండా బీమా- కట్టిన ప్రీమియాన్ని తిరిగిచ్చే 'జీరో కాస్ట్‌ టర్మ్‌ ఇన్సూరెన్స్‌'

RRR| SS Rajamouli wins Best Director|New York Film Critics Circleలో ఉత్తమ దర్శకుడు రాజమౌళి | | ABP

RRR| SS Rajamouli wins Best Director|New York Film Critics Circleలో ఉత్తమ దర్శకుడు రాజమౌళి | | ABP

Kids: శీతాకాలంలో పిల్లలకు చెవి ఇన్ఫెక్షన్లు - నొప్పి అని చెబితే నిర్లక్ష్యం వద్దు

Kids: శీతాకాలంలో పిల్లలకు చెవి ఇన్ఫెక్షన్లు - నొప్పి అని చెబితే నిర్లక్ష్యం వద్దు