By: ABP Desam | Updated at : 25 Mar 2023 10:36 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
రాజమండ్రి బ్రిడ్జి
Rajahmundry Bridge : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి - కొవ్వూరు రోడ్డు కమ్ రైల్ బ్రిడ్జిపై హ్యాండ్ రైల్, ఫుట్ పాత్ ల మరమ్మత్తులు చేపట్టారు. దీంతో ఈ నెల 26న ఆదివారం బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేస్తున్నట్లు ఆర్ అండ్ బి సూపరింటెండెంట్ ఇంజినీర్ ఎస్ బీవీ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రోడ్ కం రైల్ వంతెన హ్యాండ్ రైలింగ్, పుట్ పాత్ పనులను చేపట్టేందుకు ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సాయత్రం 6 గంటల వరకు వాహనాల రాకపోకలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఆర్ అండ్ బి, రైల్వే అధికారుల అభ్యర్థన మేరకు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్లు ఎస్ బీవీ రెడ్డి తెలియచేశారు. కావున మార్చి 26 ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రోడ్డు కమ్ రైల్ బ్రిడ్జి పై ఏ విధమైన వాహనాలు అనుమతించరని ప్రజలకు తెలియజేస్తున్నట్లు వెల్లడించారు. ఈ విషయంపై పోలీసులకు, ట్రాఫిక్ పోలీసులకి ప్రజలు సహకరించాలని కోరారు.
గతంలో వారంపాటు మరమ్మత్తులు
ఉమ్మడి తూర్పుగోదావరి జిలాల్లోని ప్రధాన రహదారి గోదావరి నదిపై కొలువుదీరిన రాజమండ్రి రోడ్ కం రైల్వే బ్రిడ్జి అత్యవసర మరమత్తులు కోసం గత ఏడాది అక్టోబర్ లో వారం రోజుల పాటు తాత్కాలికంగా మూసివేశారు. రోడ్ కం రైల్వే బ్రిడ్జికు సంబంధించి రిపేర్ పనులను ఆర్‌అండ్‌బీ, రైల్వే శాఖల ఆధ్వర్యంలో పనులు నిర్వహించారు. వంతెనపై రోడ్డు మార్గం, రెయిలింగ్ , ఫుట్ పాత్ పూర్తిగా దెబ్బ తిన్నాయని వాటిని మరమ్మత్తు చేసేందుకు అప్పట్లో వాహనరాకపోకలు నిలిపివేశారు. ద్విచక్ర వాహనాలు, మోటార్ బైక్స్, కార్లు, ఆర్టీసీ బస్సులు ధవళేశ్వరం బ్యారేజ్ మీదుగా మళ్లించారు. లారీలు, భారీవాహనాలు, ప్రైవేట్ బస్సులు, కమర్షియల్ వాహనాల సహా ఇతర వాహనాలను కొవ్వూరు – రాజమండ్రి 4వ వంతెన మీదుగా మళ్లించారు.
1970లో నిర్మాణం
తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలను వేరుచేసే గోదావరి నదిపై రాజమండ్రి-కొవ్వూరు మధ్య భారీ వంతెనలు కనిపిస్తాయి. ఈ వంతెనలు ఉభయ గోదావరి జిల్లాల మధ్య రాకపోకలకు చాలా కీలకం. ఈ వంతెనల్లో ముఖ్యమైన వాటిల్లో రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి ఒకటి. ఆసియా ఖండంలోనే అతిపెద్ద రోడ్ కమ్ రైల్వే వంతెనల్లో ఇది మూడో స్థానంలో ఉంది. 1970లో ఈ వంతెన నిర్మాణం ప్రారంభం కాగా... 1974 ఆగష్టు 16న అప్పటి భారత రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ ఆహమ్మద్ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ వంతెన పొడవు మొత్తం 4.1 కిలోమీటర్లుగా ఉంది. ఇందులో 2.8 కిమీ రైలు భాగం, 4.1 కిమీ రహదారి పొడవు ఉంటుంది. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్‌లోని గ్రాఫ్టన్ బ్రిడ్జ్ మాదిరిగానే ఈ వంతెన సింగిల్ ట్రాక్ రైలు డెక్‌పై రోడ్డు డెక్‌ను కలిగి ఉంది. ఇది రాజమండ్రి గుర్తింపు పొందిన చిహ్నాలలో ఒకటి. ఈ వంతెనను ఇండియన్ రైల్వే, దక్షిణ మధ్య రైల్వే నిర్మించాయి. 1970లో ఈ బ్రిడ్జిని బ్రైత్‌వైట్, బర్న్ & జెస్సోప్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ, భారత్ హేవీ ఉద్యోగ్ నిగమ్ లిమిటెడ్‌కు చెందిన గ్రూప్ కంపెనీలు నిర్మించాయి.
Top 10 Headlines Today: తెలుగు రాష్ట్రాల్లో జై బాలయ్య మేనియా- మహబూబ్‌నగర్ టూర్‌లో కేటీఆర్
Top 10 Headlines Today: తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి ఎందుకీ గడ్డుకాలం, తొలిరోజు పైచేయి సాధించిన ఆస్ట్రేలియ జట్టు
Mini Jamili Elections : మినీ జమిలీ ఎన్నికలకు కేంద్రం ప్లాన్ - తెలుగు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ మారబోతోందా ?
Weather Latest Update: 48 గంటల్లో కేరళలోకి రుతుపవనాలు, తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉందంటే?
BJP Dilemma : ఏపీ, తెలంగాణలో బీజేపీకి బ్రేకులేస్తోంది హైకమాండేనా ? - ఎందుకీ గందరగోళం ?
తెలంగాణ రాజకీయాల్లో ‘ధరణి’ దుమారం- తగ్గేదేలే అంటున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు!
NBK 108 Is Bhagavanth Kesari : అఫీషియల్‌గా బాలకృష్ణ సినిమా టైటిల్ చెప్పేశారోచ్ - ఇగ మాస్ ఊచకోత షురూ
Kriti Sanon Tirumala Controversy : శేష వస్త్రంతో తిరుమలలో ముద్దులు, కౌగిలింతలా? - చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుల ఆగ్రహం
Dude Telugu Movie : ఫుట్‌బాల్ నేపథ్యంలో ప్రేమకథ - ఇది తేజ్ సినిమా!