By: ABP Desam | Updated at : 23 Feb 2022 07:17 AM (IST)
ఏపీ, తెలంగాణ వెదర్ అప్డేట్స్ (Representational Image)
AP Weather Updates: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చలి ప్రభావం దాదాపుగా తగ్గిపోయింది. పొడి గాలులు వీచడంతో కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోతున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. రాత్రులు చల్లగా ఉంటున్నప్పటికీ మధ్యాహ్నం మాత్రం వేడి, ఉక్కుపోత అధికంగా ఉంటున్నాయి. చాలా ప్రాంతాలల్లో 20 డిగ్రీలకు పైగా కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కావడం వాతావరణంలో మార్పులను సూచిస్తుంది.
ఏపీలో నేడు సైతం నైరుతి, దక్షిణ దిశల నుంచి వేగంగా గాలులు వీస్తున్నాయి. దాంతో ఏపీలో మరో మూడు రోజులపాటు వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వాతావరణం పొడిగా ఉంటుందని, కనిష్ట ఉష్ణోగ్రతలు పెరగడంతో ఉక్కపోతగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వేడి గాలులు వీస్తాయి. వర్ష సూచన లేకపోవడంతో రాత్రి పూట కనిష్ట ఉష్ణోగ్రలు భారీగా పెరుగుతున్నాయి. వేటకు వెళ్లడానికి మత్స్యకారులకు ఏ ఇబ్బంది లేదు. అత్యల్పంగా జంగమేశ్వరపురంలో 18.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. బాపట్లలో 20.7 డిగ్రీలు, నందిగామలో 21.4 డిగ్రీలు, కళింగపట్నంలో 20.6 డిగ్రీలు, అమరావతిలో 21.8 డిగ్రీలు, విశాఖపట్నంలో 23.8 డిగ్రీల, నెల్లూరులో 24.5 డిగ్రీలు, ఒంగోలులో 24.5 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో వాతావరణం పొడిగా ఉంటుంది. గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో వేడిగా ఉంటుంది. ఈ ప్రాంతాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగానే పెరిగాయి. ఆరోగ్యవరం, అనంతపురం లాంటి ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 20కి చేరువలో ఉన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఆరోగ్యవరంలో కనిష్ట ఉష్ణోగ్రత 19.5 డిగ్రీలు నమోదైంది. అనంతపురంలో 18.9 డిగ్రీలు, నంద్యాలలో 22.4 డిగ్రీలు, తిరుపతిలో 20.5 డిగ్రీలు, కర్నూలులో 22.1 డిగ్రీలు, కడపలో 24.2 డిగ్రీల మేర రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
తెలంగాణ మొదలైన వేడి..
తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగున్నాయి. కొన్ని చోట్ల మాత్రమే వాతావరణం పొడిగా ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉదయం వేళ చలి గాలులతో ఇబ్బందులు తప్పవన్నారు. అత్యల్పంగా ఆదిలాబాద్ ఏజెన్సీలో 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా ఇతర జిల్లాల్లో కనీసం 15 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భద్రాచలంలో 20 డిగ్రీలు, నిజామాబాద్‌లో 17.9 డిగ్రీలు, రంగారెడ్డిలో 17 డిగ్రీలు, మెదక్‌లో 18.3 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రామగుండంలోనూ 14.6 డిగ్రీల మేర రెండో కనిష్ట ఉష్ణోగ్రత ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Also Read: CBI Vs AP Police : వివేకా కేసు విచారిస్తున్న సీబీఐ ఎస్పీపై పోలీస్ కేసు ! తర్వాత ఏంటి ?
Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో చల్లబడిన వాతావరణం, రాగల మూడు రోజుల్లో మోస్తరు వర్షాలు
Breaking News Live Updates : పిడుగురాళ్ల రైల్వే క్వార్టర్స్ లో హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య
Gold Silver Price Today 21th May 2022 : బంగారం, వెండి ధరలు పైపైకి, ప్రధాన నగరాల్లో ఇవాళ్టి రేట్స్ ఇలా
Secretariat Employee Suicide: విశాఖలో సచివాలయ ఉద్యోగి ఆత్మహత్య - లక్ష్యం IAS, చేసేది వేరే జాబ్ అని జీవితంపై విరక్తితో !
AP Courier Offices: బెజవాడ డ్రగ్స్ ఎఫెక్ట్ - ఏపీలో కొరియర్ ఆఫీస్లపై పోలీసుల నిఘా
Horoscope Today 21st May 2022: ఈ రాశి ఉద్యోగులు టెన్షన్లో ఉంటారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!
Disha Accused Encounter Case: దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసులో పోలీసులు చెప్పింది నిజం కాకపోతే, అసలు జరిగింది ఏంటి ?
Today Panchang 21st May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, శనిబాధలు తొలగించే స్త్రోత్రం