Weather Updates: దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీ, తెలంగాణలో వాతావరణం ఇలా
Telangana Weather Updates: బంగాళాఖాతంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకున్నాయి. దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. మరో రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది.
AP Weather Updates: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఓ వైపు పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా, మరోవైపు రాత్రివేళ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. బంగాళాఖాతంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకున్నాయి. దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఏపీ వెదర్ మ్యాన్ రిపోర్ట్ చేశారు. ఈ అల్ప పీడనం ఉత్తర వాయవ్య దిశగా ఉత్తర తమిళనాడు వైపుగా వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏ క్షణంలోనైనా ఏపీ తీరం వైపు గాలులు వీచే అవకాశం ఉందని సైతం హెచ్చరించారు. ఏపీలో త్వరలో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
మత్స్యకారులకు హెచ్చరిక
అల్పపీడనం, ఆగ్రేయ గాలుల ప్రభావం ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం (AP Weather Today) తెలిపింది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వేడి గాలులు వీచడంతో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. వేడి కారణంగా ఈ ప్రాంతాల్లో ఉక్కపోత సైతం అధికం అవుతుంది. మత్స్యాకారులకు సైతం వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. తీరం వెంట దక్షిణ దిశ నుంచి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. జంగమేశ్వరపురం, బాపట్లలో, నందిగామలో, అమరావతిలో, తునిలో, విశాఖపట్నంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
రాయలసీమలో ఉక్కపోత..
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో పగటి పూట అధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా, ఇక్కడ సైతం రాత్రిపూట చలి మళ్లీ పెరిగింది. గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరితో పాటు రాయలసీమ జిల్లాల్లో ఒక్కసారిగా వేడి పెరుగుతుంది. రెండు రోజులు వేడి కారణంగా ఒక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడతారు. మార్చి 4 నుంచి మార్చి 6 తేదీలలో చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అలర్ట్ చేసింది. ఆరోగ్యవరంలో, అనంతపురంలో, కర్నూలులో , నంద్యాలలో, తిరుపతిలో ఉదయం ఎండ ఎక్కువగా ఉంటుంది. రాత్రిపూట చలి సైతం ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది.
View this post on Instagram
తెలంగాణ వెదర్ అప్‌డేట్..
తెలంగాణలో ఓ వైపు పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా, రాత్రిపూట చలి ప్రభావం తగ్గడం లేదు. కనిష్ట ఉష్ణోగ్రత 20 నమోదు కాగా, పగటి పూట గరిష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీలు నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆగ్నేయ దిశ నుంచి గంటలకు 8 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. మార్చి 4 నుంచి రెండు మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని
— IMD_Metcentrehyd (@metcentrehyd) March 1, 2022
Also Read: Gold-Silver Price: శుభవార్త! నేడు దిగొచ్చిన బంగారం ధర, పెరిగిన వెండి - నేటి ధరలు ఇవీ
Also Read: Ukraine Russia War: అమ్మా యుద్ధం చాలా కష్టంగా ఉంది, చనిపోవాలని ఉంది: రష్యా సైనికుడి చివరి సందేశం