![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Discoms on Power Supply: నిరంతరాయంగా విద్యుత్ సరఫరా, పవర్ కట్స్ పై ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థల వివరణ ఇలా
Discoms on Power Supply: రాష్ట్రంలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరుగుతుందని, రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రకటించాయి.
![Discoms on Power Supply: నిరంతరాయంగా విద్యుత్ సరఫరా, పవర్ కట్స్ పై ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థల వివరణ ఇలా Discoms on power supply in Andhra Pradesh DNN Discoms on Power Supply: నిరంతరాయంగా విద్యుత్ సరఫరా, పవర్ కట్స్ పై ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థల వివరణ ఇలా](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/04/1aa2c3e02bf1f6c724a6d3397afb91ba1693835060493480_original.jpeg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Discoms on Power Supply:
రాష్ట్రంలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరుగుతుందని, రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రకటించాయి. సెప్టెంబర్ 15వ తేదీ వరకు స్వల్పకాలిక మార్కెట్ నుంచి రోజుకి దాదాపు 40 మిలియన్ యూనిట్లు ప్రతి యూనిట్ కు రూ 9.10 వెచ్చించి కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొన్నాయి.
పంపిణి సంస్థల వివరణ ఎంటేంటే...
రాష్ట్రంలో అన్నిరంగాలకు ఎలాంటి కోతలు, పరిమితులు లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసినట్లు విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రకటించాయి. ఈనెల ఒకటో తేదీన డిమాండు సరఫరా మధ్య స్వల్ప అంతరం ఏర్పడిన సమయంలో పారిశ్రామిక రంగానికి స్వల్పంగా విద్యుత్ సరఫరా తగ్గించి గృహ, వ్యవసాయ వినియోగదారులకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు డిస్కంలు స్పష్టం చేశాయి. రాష్ట్రంలో ఆదివారం మొత్తం 206.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా జరిగిందని, రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ సరఫరాలో ఏ విధమైన అంతరాయాలు కానీ లోడ్ షెడ్డింగ్ కానీ లేదని స్పష్టం చేశారు.
సెప్టెంబర్ 1వ తేదీన రాష్ట్రంలో నెలకొన్న గ్రిడ్ డిమాండ్ – సరఫరా పరిస్థితులను బట్టి పారిశ్రామిక రంగానికి కొద్దిమేర విద్యుత్ సరఫరా తగ్గించి, ప్రాధాన్యతా రంగాలైన గృహ, వ్యవసాయ రంగాలను ప్రాధాన్యం ఇచ్చి అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా చేసినట్లు పేర్కొన్నాయి. వ్యవసాయ, గృహ వినియోగ రంగాలను పాధాన్యతా రంగాలుగా పరిగణించి అంతరాయాలు లేని విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ సంస్థలు భావించినట్లుగా తెలిపారు. ఇందులో భాగంగానే డిమాండు ఎక్కువగా ఉన్నప్పుడు పరిశ్రమలకు కొంత మేరకు సరఫరా తగ్గించి వ్యవసాయ, గృహ వినియోగదారులకు పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరా చేస్తామని విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ కు డిస్కింలు తమ అభ్యర్ధన పంపాయి. విద్యుత్ పంపిణీ సంస్థల అభ్యర్ధన మేరకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి సెప్టెంబర్ 2న ఈనెల 5 వ తేదీ నుంచి రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి స్వల్పంగా విద్యుత్ వాడకంలో పరిమితులు విధించవచ్చని ఆదేశాలు ఇచ్చారు.
పరిశ్రమలకు పరిమితుల తొలగింపు
మారిన వాతావరణ పరిస్థితులు, రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న అల్పపీడన పరిస్థితులతో పడుతున్న వర్షాల దృష్ట్యా గ్రిడ్ డిమాండ్ కొంత మేర తగ్గిందని వెల్లడించాయి. గత రెండు రోజులుగా ఎటువంటి విద్యుత్ కొరత లేదని, విద్యుత్ సౌధ లో సోమవారం ట్రాన్స్‌కో సీఎండీ, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి కె. విజయానంద్ ట్రాన్స్‌కో, జెన్‌కో, ఏపీపీసీసీ అధికారులతో రాబోయే రెండు వారాలపాటు విద్యుత్ డిమాండు, సరఫరా పరిస్థితిపై కూలంకుషంగా సమీక్షించారు. ప్రస్తుతం లోడ్ కొద్దిమేర తగ్గి సరఫరా పరిస్థితి మెరుగుపడటంతో పారిశ్రామిక వినియోగదారులకు అధికారిక లోడ్ షెడ్డింగ్ విధించే అవసరం ఉందని, పేర్కొన్నాయి. దీంతో విద్యుత్ పంపిణీ సంస్థలు పారిశ్రామిక రంగానికి విద్యుత్ వాడకంపై పరిమితి నిబంధనల అమలును రద్దు చేసుకున్నట్లుగా తెలిపారు. వినియోగదారులందరూ ఈ విషయాన్ని గ్రహించాలని, రాష్ట్రంలో ఏవిధమైన లోడ్ షెడ్డింగ్ కానీ, విద్యుత్ వాడకంలో పరిమితులు కానీ లేవని స్ఫష్టం చేశాయి. మెరుగుపడిన సరఫరా పరిస్థితి వల్ల కమిషన్ ఇచ్చిన పారిశ్రామిక విద్యుత్ వాడకంలో పరిమితి – నియంత్రణ ఉత్తర్వులను అమలు చేయడం లేదన్నారు. ఈ విషయం కమిషన్ కు నివేదించాలని పంపిణీ సంస్థలు నిర్ణయం తీసుకున్నాట్లుగా తెలిపారు.
సెప్టెంబర్ నెల 15 వ తేదీ వరకు స్వల్పకాలిక మార్కెట్ నుండి రోజుకి దాదాపు 40 మిలియన్ యూనిట్లు ప్రతి యూనిట్ కు రూ 9.10 వెచ్చించి వినియోగదారుల సౌకర్యార్ధం కొనుగోలు చేస్తున్నట్లుగా డిస్కింలు వెల్లడించాయి. సరఫరా పరిస్థితి అదుపు తప్పకుండా నిరంతరాయం అధికారులందరూ అప్రమత్తంగా ఉన్నారని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా గృహ, వ్యవసాయ, వాణిజ్య – పారిశ్రామిక రంగాలకు సరఫరా అంతరాయం లేకుండా చేయడానికి అన్ని రకాలుగా కృషి చేస్తున్నట్లు ప్రకటించాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)