News
News
వీడియోలు ఆటలు
X

RGV Nijam Channel: నిజం ఛానల్ తో వస్తున్న రామ్ గోపాల్ వర్మ, వివేకా హత్య కేసుతో సంచలనాలకు రెడీ!

RGV Nijam Channel: రామ్ గోపాల్ వర్మ మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు. నిజం అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించబోతున్నట్లు తెలిపాడు. ఏప్రిల్ 25న తొలి ఎపిసోడ్ టెలీకాస్ట్ చేస్తానని వెల్లడించాడు.

FOLLOW US: 
Share:

RGV Nijam Channel: వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు. నిజం అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించబోతున్నట్లు తెలిపాడు. ఏప్రిల్ 25న తొలి ఎపిసోడ్ టెలీకాస్ట్ చేస్తానని వెల్లడించాడు. తాను ప్రారంభించబోయే " నిజం" ఛానల్ ముఖ్య ఉద్దేశం అబద్ధాల బట్టలూడదీయడానికి.. ఆ బట్టలూడదీసి విసిరి పారెస్తేనే , నిజం యొక్క పూర్తి నగ్న స్వరూపం బయటపడుతుంది’ అని ట్వీట్ చేశాడు రామ్ గోపాల్ వర్మ.

‘నిజం” చానల్ 1st ఎపిసోడ్ “వివేకా హత్య వెనక నిజం లో అబద్దముందా.. అనే అంశం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో వర్మ కొత్త ఛానల్ హాట్ టాపిక్ గా మారింది. వివేకా మర్డర్ వెనక నిజం లోని అబద్ధాలు,ఆ అబద్ధాలు చెప్పే వాళ్ళ వెనక ఉన్న నిజాలు,ఆ నిజాల వెనక వేరే వాళ్ళు ప్రభోధిస్తున్న అబద్ధపు నిజాలు, ఇంకా వాళ్ళ పైవాళ్లు అందరి నెత్తి మీద రుద్దుతున్న నిజమైన అబద్ధాలు ,వాటన్నింటి వెనుక నిజాలన్నింటినీ తవ్వి తీయడమే "నిజం" ఛానల్ ముఖ్య ఉద్దేశం. అని వర్మ ట్వీట్ చేశాడు. ఈ కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఏప్రిల్ 25 వరకు ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని తెలంగాణ హైకోర్టు ఉత్వర్వులు ఇచ్చింది. మరోవైపు వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిల సీబీఐ కస్టడీ ముగియడంతో జ్యుడీషియల్ రిమాండ్ విధించింది కోర్టు.

నిజాన్ని చేధించడానికి ఒకే ఒక్క సాధనం లాజికల్ థింకింగ్ .. అనాలిసిస్ ద్వారా , టెక్నాలజీ ద్వారా , సర్కమ్ స్టాన్సేస్ ద్వారా అన్నింటికన్నా ముఖ్యంగా మోటివ్ మీద కాన్సంట్రేట్ చేయడం ద్వారా నిజాన్ని అబద్ధం నుంచి కాపాడవచ్చు అని వర్మ ఓ ప్రకటన విడుదల చేశాడు.

రామ్ గోపాల్ వర్మ ప్రకటన వివరాలివే..
వివేకా హత్య వెనక నిజం లో , అబద్దముందా ? అనే ఎపిసోడ్ తో నా “నిజం” ఛానల్ ప్రారంభం 
“నేను ప్రారంభించబోయే " నిజం" ఛానల్ ముఖ్య ఉద్దేశం అబద్ధాల బట్టలూడదీయడానికి.. ఆ బట్టలూడదీసి విసిరి పారెస్తేనే , నిజం యొక్క పూర్తి నగ్న స్వరూపం బయటపడుతుంది.

అబద్ధం బతికేదే నిజాన్ని చంపటం కోసం ప్రయత్నించటానికి .. నిజాన్ని ఎవ్వరూ చంపలేరు. కానీ నిజం అప్పుడప్పుడూ చచ్చిపోయినట్టు నటిస్తుంది. .. దానికి మోసపోయి ,చచ్చింది అని అబద్ధాలు చెప్పే వాళ్ళు సంబరం తో డాన్స్ లాడు తూండగా ఏదో ఒక రోజు వెనక నుంచి ముందు పోటు పొడుస్తుంది.

నిజాన్ని చేధించడానికి ఒకే ఒక్క సాధనం లాజికల్ థింకింగ్ .. అనాలిసిస్ ద్వారా , టెక్నాలజీ ద్వారా , సర్కమ్ స్టాన్సేస్ ద్వారా అన్నింటికన్నా ముఖ్యంగా మోటివ్ మీద కాన్సంట్రేట్ చేయడం ద్వారా నిజాన్ని అబద్ధం నుంచి కాపాడవచ్చు.

“నిజం”ఛానల్ లో కేవలం పొలిటికల్ కాంట్రవర్సీస్ మాత్రమే కాకుండా కొన్ని కరెంట్ సిట్యుయేషన్స్, సైన్స్, హిస్టరీ, ఆర్టిీషియల్ ఇంటెలిజెన్స్, సెక్స్ , ఫిలాసఫీ, పోలీస్, క్రైం, న్యాయ స్థానాలు ఇంకా ఎన్నెన్నో టాపిక్స్ ఉంటాయి. వాటి గురించి ప్రతి ఎపిసోడ్ లో ,నేనే కాకుండా రకరకాల ఎక్స్పర్ట్స్, థింకర్స్ , రీసెర్చర్స్ వేరే వేరే టాపిక్స్ ని అనలైజ్ చేస్తారు.

కొన్ని సార్లు నేను వాళ్ళతో , కొన్ని సార్లు స్వప్న గారు వాళ్ళతో, కొన్ని సార్లు వాళ్ళే వాళ్ళతో , కొన్ని సార్లు వేరే వాళ్ళు ఎవరెవరితోనో , అలా నిజాన్ని గౌరవించే ప్రతి ఒక్కరికీ ఈ నిజం ఛానల్ గొడుగు కింద వాళ్లకే కేటాయించిన ఒక ప్రత్యేక చోటుంటుంది. " నిజం " ఛానల్ లోని మొదటి ఎపిసోడ్ " వివేకా హత్య వెనక నిజంలో అబద్ధముందా ? “

వివేకా మర్డర్ వెనక నిజం లోని అబద్ధాలు , ఆ అబద్ధాలు చెప్పే వాళ్ళ వెనక ఉన్న నిజాలు, ఆ నిజాల వెనక వేరే వాళ్ళు ప్రభోధిస్తున్న అబద్ధపు నిజాలు, ఇంకా వాళ్ళ పైవాళ్లు బలవంతంగా అందరి నెత్తి మీద రుద్దుతున్న నిజమైన అబద్ధాలు ,వాటన్నింటి వెనుక అసలు నిజాలన్నింటినీ కూడా తవ్వి తీయడమే "నిజం" ఛానల్ ముఖ్య ఉద్దేశం.

వివేకా హత్య వెనక నిజం లో అబద్దముందా ?అనే ఎపిసోడ్ రిలీజ్ 25 న సాయంత్రం 4 గంటలకు.

ఇట్లు " నిజం "గా

రామ్ గోపాల్ వర్మ

Published at : 24 Apr 2023 05:56 PM (IST) Tags: Ram Gopal Varma RGV Viveka Murder Case RGV Nijam Channel Nijam Channel Nijam Youtube Channel

సంబంధిత కథనాలు

AP Cabinet Meeting :  ఏడో తేదీన ఏపీ కేబినట్ భేటీ - ముందస్తు నిర్ణయాలుంటాయా ?

AP Cabinet Meeting : ఏడో తేదీన ఏపీ కేబినట్ భేటీ - ముందస్తు నిర్ణయాలుంటాయా ?

4 Years Of YSRCP: వైఎస్ జగన్ పాలనకు నాలుగేళ్లు పూర్తి- భారీగా బైక్ ర్యాలీలు, కార్యక్రమాలకు నేతలు శ్రీకారం

4 Years Of YSRCP: వైఎస్ జగన్ పాలనకు నాలుగేళ్లు పూర్తి- భారీగా బైక్ ర్యాలీలు, కార్యక్రమాలకు నేతలు శ్రీకారం

Bonda Uma: టీడీపీ సంక్షేమ మేనిఫెస్టోతో తాడేపల్లి పునాదులు కదులుతున్నాయి- బొండా ఉమా

Bonda Uma: టీడీపీ సంక్షేమ మేనిఫెస్టోతో తాడేపల్లి పునాదులు కదులుతున్నాయి- బొండా ఉమా

Anakapalli Lovers: లాడ్జిలో రూం తీసుకొని లవర్స్ ఆత్మహత్యాయత్నం, యువతి మృతి, కొనఊపిరితో యువకుడు!

Anakapalli Lovers: లాడ్జిలో రూం తీసుకొని లవర్స్ ఆత్మహత్యాయత్నం, యువతి మృతి, కొనఊపిరితో యువకుడు!

Guntur News: రెండేళ్ల కన్నకూతుర్ని బడకేసి కొట్టిన తండ్రి! స్పాట్‌లోనే చిన్నారి మృతి

Guntur News: రెండేళ్ల కన్నకూతుర్ని బడకేసి కొట్టిన తండ్రి! స్పాట్‌లోనే చిన్నారి మృతి

టాప్ స్టోరీస్

CSK Vs GT: ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా - లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో జీటీపై చెన్నై విక్టరీ!

CSK Vs GT: ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా - లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో జీటీపై చెన్నై విక్టరీ!

MS Dhoni: ఆ విషయంలో తను, నేను సేమ్ టు సేమ్ - రాయుడు గురించి ధోని ఏమన్నాడంటే?

MS Dhoni: ఆ విషయంలో తను, నేను సేమ్ టు సేమ్ - రాయుడు గురించి ధోని ఏమన్నాడంటే?

Mahendra Singh Dhoni Retirement: రిటైర్మెంట్ ప్రకటించడానికి బెస్ట్ టైం ఇదే... కానీ - మహేంద్ర సింగ్ ధోని ఏమన్నాడంటే?

Mahendra Singh Dhoni Retirement: రిటైర్మెంట్ ప్రకటించడానికి బెస్ట్ టైం ఇదే... కానీ - మహేంద్ర సింగ్ ధోని ఏమన్నాడంటే?

'యూత్‌ ను ఎంకరేజ్‌ చేయాలే, ధమ్‌ ధమ్‌ చేయొద్దు' - జక్కన్న ట్వీట్ వైరల్!

'యూత్‌ ను ఎంకరేజ్‌ చేయాలే, ధమ్‌ ధమ్‌ చేయొద్దు'  - జక్కన్న ట్వీట్ వైరల్!