X

AP Ration Ragada : ఏపీలో కోటి మందికి రేషన్ కట్ చేస్తున్నారా..? నిజమేంటి..?

నెలాఖరులోపు రేషన్ తీసుకునే వారందరూ ఈ-కేవైసీ చేయించుకోకపోతే సరుకులు నిలిపివేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఈ-కేవైసీ చేయించుకోవడానికి పేదలు పోటీ పడుతున్నారు.

FOLLOW US: 

ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డు ఉన్న పేద ప్రజలంతా ఆధార్ సెంటర్ల వద్దకు క్యూ కట్టారు. రేషన్ కార్డులో ఉన్న కుటుంబసభ్యులందరూ ఈ-కేవైసీ చేయించుకోకపోతే వారికి వచ్చే నెల నుంచి రేషన్ ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కారణంగా పనులు మానుకుని పేదలంతా ఆధార్ సెంటర్ల ముందు బారులు తీరుతున్నారు. అక్కడక్కడా తొక్కిసలాట జరుగుతోంది. 

వంద శాతం లబ్దిదారుల ఈ-కేవైసీ పూర్తి చేయాలని ఏపీ లక్ష్యం..! 

కేంద్ర ప్రభుత్వం ఎక్కడైనా రేషన్ తీసుకునే విధంగా సంస్కరణలు తీసుకు వచ్చింది. ఈ సంస్కరణలు అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ అంగీకరించింది. అలా అమలు చేసినందుకు అదనపు రుణం కూడా ఏపీ ప్రభుత్వానికి మంజూరు చేసింది. ఈ సంస్కరణలు పూర్తి స్థాయిలో అమలు చేయాలంటే తమ రాష్ట్రంలో ఉన్న లబ్దిదారులందరి ఈ - కేవైసీని పూర్తి చేయాల్సి ఉంది. అలా పూర్తి చేస్తేనే మాన్యువల్ పద్దతి నుంచి ఈ పోస్ యంత్రాల ద్వారా రేషన్ ఇవ్వడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ ప్రక్రియ పూర్తిచేయాలని కేంద్రం అన్ని రాష్ట్రాలపై ఒత్తిడి తెస్తోంది. కేంద్రం ఈ - కేవైసీకి పూర్తి స్థాయిలో ఒత్తిడి తేవడానికి కారణం పక్కదారి పడుతున్న రేషన్‌ను కాపాడుకోవడమే. అనర్హులు, చనిపోయినవారు, వలస వెళ్లినవారు ఇలా అనేక మంది ఈ-కేవైసీ చేయించుకోలేరు. దాని వల్ల వారిని అర్హుల జాబితా నుంచి తొలగించవచ్చు.

వాలంటీర్లు సహకరించడం లేదని ఆధార్ కేంద్రాలకు లబ్దిదారుల పరుగు..! 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  కేంద్ర సంస్కరణలను వేగంగా అమలు చేసే విధానంలో భాగంగా వచ్చే నెలలోపు ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించుకుంది. ఈ-కేవైసీ ఈ నెలాఖరులోగా పూర్తి చేయకపోతే రేషన్ పంపిణీ నిలిపివేయాలని నిర్ణయించుకుంది. ఏపీలో దాదాపుగా కోటి యాభై లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. వీటి ద్వారా  4 కోట్ల 31 లక్షల మందికి రేషన్ పంపిణీ చేస్తున్నారు. వీరిలో దాదాపుగా కోటి మంది ఇప్పటికీ ఈ కేవైసీ చేయించుకోలేదు. ప్రభుత్వం వాలంటీర్లకు బాధ్యతలు అప్పగించింది. కానీ వాలంటీర్లు ఇదో అదనపు పనిగా భావించి పెద్దగా పట్టించుకోవడంలేదు. దీంతో ఎక్కువ మంది ఆధార్ కేంద్రాలకు వెళ్తున్నారు. దీంతో గందరగోళం ఏర్పడుతోంది. నిజానికి ఈ - కేవైసీ చేయించుకోవడానికి ఆధార్ కేంద్రానికి వెళ్లాల్సిన పనిలేదు. 

వాలంటీర్లు చేస్తారు కంగారు వద్దన్న ప్రభుత్వం ! 

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ -కేవైసీ నమోదు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. ఏపీలో ఇంకా పది శాతం మందికిపైగా ఈ-కేవైసీ నమోదు చేసుకోవాల్సి ఉందని... రేషన్ కార్డులను తొలగిస్తామని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని పౌర సరఫరాల శాఖ ఎక్స్ ఆఫీసియో సెక్రటరీ కోన శశిధర్ స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ఈ-కేవైసీ చేయించుకోవాలని అలా చేయించుకుంటే ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చన్నారు. అసలు ఆధార్ కార్డు లేని వాళ్లు మాత్రమే .. ఆధార్ నమోదు చేయించుకోవాలని మిగతా వారికి వాలంటీర్ ఈ-కేవైసీ చేస్తారని శశిధర్ స్పష్టం చేశారు.

Tags: cm jagan ap govt ration cards Andhra Aadhar e-KYC kona sasidhar

సంబంధిత కథనాలు

Ganja Smuggling: అమెజాన్ లో  కరివేపాకు పేరుతో గంజాయి స్మగ్లింగ్ కేసు.. ఏడుగురు అరెస్టు

Ganja Smuggling: అమెజాన్ లో  కరివేపాకు పేరుతో గంజాయి స్మగ్లింగ్ కేసు.. ఏడుగురు అరెస్టు

TDP: టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ.. సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై చంద్రబాబు దిశానిర్దేశం

TDP: టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ.. సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై చంద్రబాబు దిశానిర్దేశం

Visakha Crime: విశాఖ జిల్లాలో విషాదం... పసికందును నీళ్ల డ్రమ్ములో పడేసిన తల్లి...

Visakha Crime: విశాఖ జిల్లాలో విషాదం... పసికందును నీళ్ల డ్రమ్ములో పడేసిన తల్లి...

Breaking News: పలాస రైల్వేస్టేషన్ లో 108 ను ఢీకొట్టిన ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్

Breaking News: పలాస రైల్వేస్టేషన్ లో 108 ను ఢీకొట్టిన ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్

AP TS Corona Updates: ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు... కొత్తగా 248 కేసులు... తెలంగాణలో 160 కేసులు

AP TS Corona Updates: ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు... కొత్తగా 248 కేసులు... తెలంగాణలో 160 కేసులు
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Balakrishna Speech: సినిమాకు ప్రభుత్వాలు సహకరించాలి.. అఖండ వేదికపై బాలయ్య స్పీచ్.. మరో సినిమాపై హింట్.. దర్శకుడు ఎవరంటే?

Balakrishna Speech: సినిమాకు ప్రభుత్వాలు సహకరించాలి.. అఖండ వేదికపై బాలయ్య స్పీచ్.. మరో సినిమాపై హింట్.. దర్శకుడు ఎవరంటే?

Sirivennela: సిరివెన్నెలకి అస్వస్థత.. కిమ్స్ లో ట్రీట్మెంట్.. స్పందించిన కుటుంబసభ్యులు

Sirivennela: సిరివెన్నెలకి అస్వస్థత.. కిమ్స్ లో ట్రీట్మెంట్.. స్పందించిన కుటుంబసభ్యులు

Nothing Ear 1: ఈ సూపర్ ఇయర్‌బడ్స్ ధర భారీ తగ్గింపు.. ఏకంగా రూ.వేయికి పైగా.. ఇప్పుడు ఎంతంటే?

Nothing Ear 1: ఈ సూపర్ ఇయర్‌బడ్స్ ధర భారీ తగ్గింపు.. ఏకంగా రూ.వేయికి పైగా.. ఇప్పుడు ఎంతంటే?

Akhanda Trailer 2: థియేటర్లలో మాస్ జాతర ఖాయం.. తల తెంచుకుని వెళ్లిపోవడమే.. రెండో ట్రైలర్ వచ్చేసింది!

Akhanda Trailer 2: థియేటర్లలో మాస్ జాతర ఖాయం.. తల తెంచుకుని వెళ్లిపోవడమే.. రెండో ట్రైలర్ వచ్చేసింది!