News
News
X

Dharmana : రాజధాని లేక పోవడానికి చంద్రబాబే కారణం - మేధావులు స్పందించాలని పిలుపునిచ్చిన మంత్రి ధర్మాన !

ఏపీకి రాజధాని లేకపోవడానికి చంద్రబాబే కారణం అని ధర్మాన ఆరోపించారు. విశాఖ పాలనా రాజధానిగా ఎందుకు వద్దని ప్రశ్నించారు.

FOLLOW US: 

Dharmana :  ప‌రిపాల‌న వికేంద్రీక‌ర‌ణ అన్నదే త‌మ నినాదం అని రెవెన్యూ శాఖామాత్యులు ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు మ‌రోమారు స్ప‌ష్టం చేశారు. రాజ‌మండ్రిలో 3 రాజ‌ధానుల విష‌య‌మై రౌండ్ టేబుల్ స‌మావేశం నిర్వ‌హించారు. ఇప్పుడున్న అమ‌రావ‌తి నిర్మాణానికి ప‌దిల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు అవ‌స‌రం అవుతాయ‌ని తేలింద‌ని, అంత మొత్తంలో  ఓ రాజ‌ధాని నిర్మాణానికి ప్ర‌భుత్వం సిద్ధంగా లేద‌ని ధర్మాన స్పష్టం చేశారు.  ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కే ఉన్న ప‌ళాన ప‌ది వేల కోట్ల రూపాయ‌లు కూడా ఖ‌ర్చు చేయ‌లేని స్థితిలో ఒక్క ఆంధ్ర ప్ర‌దేశ్ అనే కాదు అన్ని రాష్ట్రాలూ ఉన్నాయ‌న్నారు. 

చంద్రబాబు స్వలాభం కోసమే అమరావతి ! 

చంద్రబాబు కేవ‌లం త‌న ప్ర‌యోజ‌నాల కోస‌మే రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను ఫ‌ణంగా పెడుతున్నార‌ని ఆరోపించారు. అమ‌రావ‌తి కేంద్రంగా రాజ‌ధాని నిర్మాణానాకి నాలుగు నుంచి ఐదు ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు అవ‌సరం అవుతాయ‌ని, అంత మొత్తం ఒక్క ప్రాంతం అభివృద్ధికే వెచ్చిస్తే మిగిలిన ప్రాంతాలు ఏం కావాలి అని ప్ర‌శ్నించారు. తాము మ‌రోసారి మోస‌పోయేందుకు సిద్ధంగా లేమ‌ని, మ‌ళ్లీ మ‌రో 70,80 ఏళ్ల పాటు వెనుక‌బాటును భ‌రించేందుకు సిద్ధంగా లేమ‌ని, అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ అన్న పాల‌సీని స్ప‌ష్టంగా చెప్పామ‌ని, దీనినే ఆచ‌రిస్తూ  ప్ర‌జాభిప్రాయం స్వీక‌రించేందుకు జ‌న సమూహాల ముందుకు వెళ్తామ‌న్నారు.  

విశాఖ కేంద్రంగా పరిపాలనా రాజధానిపై మేధావులు స్పందించాలి !

News Reels

 విశాఖ కేంద్రంగా ప‌రిపాల‌న రాజ‌ధాని ఎందుకు అన్న విష‌య‌మై, విశాల ప్ర‌యోజ‌నాల కోసం ప్ర‌భుత్వం చేస్తున్న ప్ర‌తిపాద‌న‌లను మేధావులు అర్థం చేసుకోవాలని ధర్మాన పిలుపునిచ్చారు.  ఎవ్వ‌రికీ అడుగు పెట్ట‌డానికి వీలులేకుండా మేం ఇక్క‌డ విదేశీ పౌరులుగా ఉండాలా అని ప్ర‌శ్నించారు. క్యాపిట‌ల్ కోసం 55 వేల ఎక‌రాలు ఎందుకు.? అని ప్ర‌శ్నించారు. కేవ‌లం చంద్ర‌బాబు నిర్ణ‌యాల కార‌ణంగా ఎనిమిదేళ్లు రాష్ట్రానికి రాజ‌ధాని లేకుండా చేశార‌న్ని ప్ర‌శ్నించారు. స‌హేతుక‌త లేని నిర్ణ‌యాలు వ‌ద్దే వ‌ద్దని అన్నారు.  పరిపాలన రాజధాని వద్దని..మీరు పాదయాత్ర చేస్తుంటే ..మేం నోరు మూసుకుని కూర్చోవాలా..? అని ప్రశ్నించారు. 

శివరామకృష్ణన్ కమిటీని కాదని అమరావతి నిర్ణయం !

శివరామకృష్ణన్ కమిటీని తుంగలో తొక్కి...అమరావతిని తెర మీదకు తెచ్చారు. సీఎం హోదాలో చంద్రబాబు మాయ చేశారు. అబద్దాలాడారు.  అమరావతిలో క్యాపిటల్ వద్దని ప్రభుత్వం చెప్పట్లేదు..అమరావతిలో శాసన రాజధాని ఉంటుంది. అందులో సందేహమే లేదు. 29 గ్రామాల ప్రజలు చంద్రబాబు మాయలో పడొద్దు. పాల‌కుల కృషితో సృష్టికి నోచుకున్న సంపద అన్న‌ది అందరికీ చెందాలి. ఒక రాష్ట్ర జనాభా సొమ్ము అంతా తీసుకుని వెళ్ళి 29 గ్రామాలని అభివృద్ది చేయడానికి పెట్టాలా? లేదా అభివృద్ధి చెందిన విశాఖను పరిపాలనా రాజధాని చేసుకుని ఇంకొంచెం సదుపాయాలు పెంచి,అక్కడ నుండి వచ్చే రెవెన్యుని రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల ప్రజల అభివృద్ధికీ ఉపయోగించాలా ?  ఏది ఈ రాష్ట్రానికి మంచిదో ఆలోచించాలన్నారు. 

ప్రజలు వాస్తవిక దృక్పథంతో ఆలోచించాలి ! 

రాష్ట్ర ప్రజలు రాజధాని రైతు ఉద్యమం పేరుతో న‌డుస్తున్న సెంటిమెంట్ రాజకీయాలకు అతీతంగా వాస్తవిక దృక్పథంతో ఆలోచించాలి. హైదరాబాద్‌లో 75 ఏళ్లు పెట్టుబడి పెట్టి..మనమంతా అభివృద్ది చేశాం. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఆనాడే పెట్టుబడులు పెట్టి  ఉంటే..విభజన జరిగేది కాదు. తెలంగాణ ఉద్యమం వచ్చిన తరువాత..మనం తప్పు చేశామని గ్రహించాం..మళ్లీ అమరావతిలో పెట్టుబడులు పెడితే..హైదరాబాద్‌లో చేసిన తప్పే చేసినట్లు అవుతుంది. పెట్టుబడులు కేంద్రీకృతం కాకూడదనేది..ప్రపంచమే చెబుతోందని ధర్మాన స్పష్టం చేశారు. 

Published at : 03 Oct 2022 05:48 PM (IST) Tags: amaravati capital Three Capitals Mantri Dharmana Prasada Rao

సంబంధిత కథనాలు

Petrol-Diesel Price, 28 November 2022: ఈ ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గుముఖం- మిగతా చోట్లో స్థిరంగా ధరలు

Petrol-Diesel Price, 28 November 2022: ఈ ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గుముఖం- మిగతా చోట్లో స్థిరంగా ధరలు

Weather Latest Update: ‘ఆ ఫేక్ తుపానును నమ్మొద్దు’ -ఏపీకి స్వల్ప వర్ష సూచన! తెలంగాణలో 4 జిల్లాలకి చలి అలర్ట్

Weather Latest Update: ‘ఆ ఫేక్ తుపానును నమ్మొద్దు’ -ఏపీకి స్వల్ప వర్ష సూచన! తెలంగాణలో 4 జిల్లాలకి చలి అలర్ట్

Gold Silver Rate Today: బంగారం కొనాలనుకుంటున్నారా? నేడు ఎంత ధర పెరిగిందో తెలుసా!

Gold Silver Rate Today: బంగారం కొనాలనుకుంటున్నారా? నేడు ఎంత ధర పెరిగిందో తెలుసా!

ఏపీ కొత్త సీఎస్‌గా జవహర్ రెడ్డి- త్వరలో సీఎంఓ లోకి శ్రీలక్ష్మీ

ఏపీ కొత్త సీఎస్‌గా జవహర్ రెడ్డి- త్వరలో  సీఎంఓ లోకి శ్రీలక్ష్మీ

Building For Pigeons: పావురాల కోసం రెండంతస్తుల భవనం - మ్యూజిక్ సిస్టమ్, మరెన్నో ప్రత్యేకతలు

Building For Pigeons: పావురాల కోసం రెండంతస్తుల భవనం - మ్యూజిక్ సిస్టమ్, మరెన్నో ప్రత్యేకతలు

టాప్ స్టోరీస్

KCR Review Meeting: రొటీన్‌గా కాదు, గొప్పగా పనిచేయండి - విప్లవాత్మక మార్పులు తీసుకొద్దాం: సీఎం కేసీఆర్

KCR Review Meeting: రొటీన్‌గా కాదు, గొప్పగా పనిచేయండి - విప్లవాత్మక మార్పులు తీసుకొద్దాం:  సీఎం కేసీఆర్

Bandi Sanjay : పాలన చేతగాక పోతే ఇంట్లో కూర్చోండి, భైంసా ఏమైనా నిషేధిత ప్రాంతమా? - బండి సంజయ్

Bandi Sanjay :  పాలన చేతగాక పోతే ఇంట్లో కూర్చోండి, భైంసా ఏమైనా నిషేధిత ప్రాంతమా? - బండి సంజయ్

Mla Prakash Reddy : నా తమ్ముడు మాట్లాడిన భాష తప్పు, భావం కరెక్టే - ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి

Mla Prakash Reddy : నా తమ్ముడు మాట్లాడిన భాష తప్పు, భావం కరెక్టే - ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి

Mahesh Babu: నాన్నగారు నాకు చాలా ఇచ్చారు - అందులో గొప్పది మీ అభిమానం: సూపర్ స్టార్ మహేష్ బాబు!

Mahesh Babu: నాన్నగారు నాకు చాలా ఇచ్చారు - అందులో గొప్పది మీ అభిమానం: సూపర్ స్టార్ మహేష్ బాబు!