By: ABP Desam | Updated at : 14 Aug 2023 04:29 PM (IST)
ఏపీ ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు
AP Volunteers Delhi High Court : ఢిల్లీ హైకోర్టులో ఏపీ వలంటీర్ల కేసు విచారణ జరిగింది. వలంటీర్లకు పేపర్ కొనుగోలు కోసం నెలకు రూ.200 ఇస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను ఉషోదయ పబ్లికేషన్స్ సవాలు చేసింది. 200 రూపాయలతో సాక్షి పత్రిక మాత్రమే కొంటున్నారని ఆరోపించింది. ఈ కేసులో ప్రభుత్వానికి అనుకూలంగా ఏపీ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. దీంతో ఉషోదయ పబ్లికేషన్స్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అనంతరం కేసును ఢిల్లీ హైకోర్టుకు సుప్రీంకోర్టు బదిలీ చేసింది. దీంతో సోమవారం వలంటీర్లపై కేసును ఢిల్లీ హైకోర్టు విచారించింది. వలంటీర్లకు రెండు వందలు ఇచ్చే విధానంపై పూర్తి వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు ధర్మాసనం వాయిదా వేసింది.
గతంలో వలంటీర్లకు నెల నెలా రూ.200 మంజూరు చేసి.. సాక్షి దినపత్రిక కొనుగోలు చేయించడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టు లో ఉషోదయా సంస్థ పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సీజేఐ పలు కీలక వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. న్యాయ, పరిపాలన ప్రయోజనాల దృష్ట్యా విచారణను ఏపీ హైకోర్టు నుంచి ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేస్తున్నామని చంద్రచూడ్ తెలిపారు. ఢిల్లీ హైకోర్టు కు విచారణను బదిలీ చేయడం వల్ల ఏపీ హైకోర్టుపై నమ్మకం పోతుందని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. అలాంటి అభిప్రాయానికి తావు ఇవ్వకుండా ఉత్తర్వులు ఇస్తామమని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఇది 2 పేపర్ల మధ్య వ్యవహారంగా కనిపించడంలేదని, రెండు పార్టీల మధ్య వ్యవహారంగా కనిపిస్తోందని సుప్రీం ధర్మాసనం కేసును బదిలీ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్లోవ్యాఖ్యానించింది.
ప్రజాధనం వలంటీర్లకు బదిలీ చేసి సాక్షి పత్రికను కొనుగోలు చేయించడాన్ని గతంలో ఉషోదయా సంస్థ హైకోర్టులో సవాల్ చేసింది. ఇదే అంశంపై గతంలో దాఖలైన పిల్కు ట్యాగ్ చేయాలని, ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ను ఏపీ ప్రభుత్వం ఆశ్రయించింది. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం పిటిషన్పై ఉషోదయా సంస్థ సుప్రీంకోర్టు మెట్లెక్కింది. సాక్షి దినపత్రిక సర్క్యులేషన్ పెంచుకునేందుకు వైసీపీ సర్కారు ప్రజాధనం ఖర్చు చేస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. విస్తృత సర్క్యులేషన్ ఉండి, ప్రభుత్వ పథకాల సమాచారం ఇచ్చే సాక్షి న్యూస్ పేపర్ కొనాలని వలంటీర్లకు డబ్బులు మంజూరు చేస్తూ జీవో జారీ చేశారు. రాష్ట్రంలో రెండు లక్షల 60 వేల మంది వలంటీర్లు ఉన్నారు. పేపర్ కొనేందుకు ఒక్కో వలంటీరుకు రూ. 200 మంజూరు చేశారు.
అడిషనల్ ఫైనాన్షియల్ సపోర్ట్ పేరుతో వలంటీర్ల పేస్లిప్‌లో రూ. 5 వేలకు అదనంగా ఈ రూ.200 అలాట్ చేశారు. ఏజెంట్ ఇచ్చిన పేపరు బిల్లును యాప్‌లో అప్లోడ్ చేయాలని వలంటీర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఏజెంట్లు వలంటీర్ల ఇళ్లకు దినపత్రికను చేరవేస్తున్నారు.
RK Roja: ఆటో డ్రైవర్ అవతారంలో మంత్రి రోజా, లోకేశ్‌పై తీవ్ర వ్యాఖ్యలు - ముందస్తు బెయిల్ ఎందుకు?
KA Paul: తెలంగాణలో కాంగ్రెస్ పగటి కలలు - 2న సికింద్రాబాద్‌లో బహిరంగ సభ: కేఏ పాల్
Pawan Kalyan: 1 నుంచి పవన్ వారాహి యాత్ర, సీఎం జగన్ ప్రభుత్వమే టార్గెట్!
Tirumala Navaratri Brahmotsavam 2023: తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాలు, ఎప్పటి నుంచి అంటే?
Chandrababu Naidu Arrest : చంద్రబాబు కేసుల్లో కక్ష సాధింపు లేదు - కోర్టే రిమాండ్ విధించింది - సజ్జల కీలక వ్యాఖ్యలు
ODI World Cup 2023: అక్షర్ పటేల్ సంచలన పోస్టులు, కావాలనే తప్పించారా! అతడి బాధ వర్ణనాతీతం
Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?
Chandrayaan 3: రేపటి నుంచి చంద్రుడిపై రాత్రి సమయం, ఇక భారత్‌కు నిరాశేనా?
CM Jagan: ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ ప్రారంభించిన సీఎం - దీంతో ప్రయోజనాలు ఇవే
/body>