Chandrababu Delhi Tour: నేడు ఢిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు, బీజేపీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం
Andhra Pradesh News | ఏపీ సీఎం చంద్రబాబు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. రాత్రి ఢిల్లీలో బీజేపీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.

AP CM Chandrababu Delhi Tour | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు ప్రచారం చేయనున్నారు. ఎన్డీఏ భాగస్వామి అయిన బీజేపీ అభ్యర్థుల తరఫున ఢిల్లీలో నేటి రాత్రి చంద్రబాబు ప్రచారంలో పాల్గొంటారు. ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు సీఎం చంద్రబాబు హైదరాబాద్ లోని తన నివాసం నుంచి బయలుదేరనున్నారు. బేగంపేట విమానాశ్రయం చేరుకుని మధ్యాహ్నం 2.55కు ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరతారు. సాయంత్రం 5.10కు చంద్రబాబు ఢిల్లీ విమానాశ్రయం చేరుకుంటారు.
అనంతరం 5.50 గంటలకు 1 జన్‌పథ్ నివాసానికి చేరుకోనున్నారు. అక్కడ కాసేపు విశ్రాంతి అనంతరం ఎన్నికల ర్యాలీలో పాల్గొనున్నారు. ఆదివారం రాత్రి 7 గంటలకు ఢిల్లీలోని సహద్రలో ఏపీ సీఎం చంద్రబాబు బీజేపీ అభ్యర్థి తరఫున ఎన్నికల ప్రచారం చేస్తారని అధికారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎన్డీయే కూటమిలో బిహార్ నుంచి నితీష్ కుమార్, ఏపీలో చంద్రబాబు కీలక భాగస్వామిగా ఉన్నారని తెలిసిందే.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

