అన్వేషించండి

Thota Trimurtulu : శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులకు 18 నెలల జైలు శిక్ష - 2 లక్షల జరిమానా

Andhra News : తోట త్రిమూర్తులకు 18 నెలల జైలు శిక్ష విధించింది కోర్టు. రెండు లక్షల జరిమానా కూడా విధించింది.

18 Months Jail For Thota trimurtulu :  వైసీపీ ఎమ్మెల్సీ, మండపేట అభ్యర్థి తోట త్రిమూర్తులకు కోర్టు పద్దెనిమిది నెలల జైలు శిక్ష , రెండు లక్షల జరిమానా విధించింది. దళితులకు శిరోముండనం కేసులో  27 ఏళ్లకుపైగా విచారణ సాగిన తర్వాత విశాఖ ఎస్సీ, ఎస్టీ కోర్టు నేరం చేసినట్లుగా నిర్ధారించి తీర్పు ఇచ్చింది.  ఐదుగురు దళితులను హింసించి ఇద్దరికి శిరోముండనం చేశారు. 1996 డిసెంబర్‌ 29న ప్రస్తుత కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ కేసులో వైసిపి ఎమ్మెల్సీ, మండపేట ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు నిందితుడిగా ఉన్నారు. 28 ఏళ్లపాటు ఈ కేసు విచారణ కొనసాగగా.. 148 సార్లు వాయిదా పడింది.  త్రిమూర్తులతో పాటు నిందితులుగా ఉన్న మరో 9 మందిని కూడా శిక్, విధించారు. 

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో  ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఇద్దరు దళితులకు శిరోముండనం చేయించారు. ఐదుగుర్ని హింసించారు.  అప్పట్లో ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో తోట త్రిమూర్తులు మూడు నెలలు జైలులో ఉండి వచ్చారు. అప్పటి నుంచీ కేసు కోర్టుల్లో నలుగుతూనే ఉంది. గత ఏడేళ్లుగా   విశాఖపట్నంలోని ప్రత్యేక కోర్టులో విచారణ సాగుతోంది. తుది తీర్పు 2018లోనే రావాల్సి ఉంది.  కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని శిరోముండనం కేసులో తుది తీర్పు ఇచ్చే సమయంలో బాధితులైన కోటి చినరాజు, దడాల వెంకటరత్నంలను కోర్టు ఆదేశించింది. అప్పట్లోగా ఎమ్మెల్యేగా ఉన్న  తోట త్రిమూర్తులు బాధితులు ఎస్సీలు కాదని ఫిర్యాదులు ఇప్పించి వారికి పత్రాలు అందకుండా చేశారన్న ఆరోపణలు వచ్చాయి. చివరికి హైకోర్టు వారికి కుల ధృవీకరణ పత్రాలు సమర్పించాలని ఆదేశించింది. అన్ని విచారణలు పూర్తవడంతో.. తోట త్రిమూర్తులు తప్పు చేశాడని నిర్ధారించి కోర్టు శిక్ష విధించింది.                                    

ప్రధాన సాక్షి కోటి రాజు  కొద్ది రోజుల కిందట మృతిచెందారు. ఆయన అనారోగ్యంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రధాన బాధితుడు కోటి చినరాజుకు ఆయన సోదరుడు. బాధితులు ఐదుగురిలో ఇద్దరు మరణించారు. గత ఏడాది బాధితుడు పువ్వల వెంకటరమణ మృతిచెందారు. 15 మంది సాక్షుల్లో ఇద్దరు చనిపోయారు. శిరోముండనం కేసు నమోదై ఇప్పటికీ 28 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత వారికి న్యాయం లభించింది.                                       

తోట త్రిమూర్తులు రకరకాల పార్టీలు మారారు. ప్రస్తుతం ఆయన వైఎస్ఆర్‌సీపీలో ఉన్నారు. ఎమ్మెల్సీ పదవితో పాటు మండపేట నుంచి వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేశారు. తర్వాత టీడీపీలో చేరారు. టీడీపీ నుంచి 2014లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీలో చేరారు. ఎమ్మెల్సీ పదవి పొందారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

One Nation One Election JPC: జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
This Week OTT Movies: ఈ వారం ఓటీటీల్లోకి ఎన్ని సినిమాలు, సిరీస్‌లు వస్తున్నాయో తెలుసా... సినీ ప్రియులకు పండగే
ఈ వారం ఓటీటీల్లోకి ఎన్ని సినిమాలు, సిరీస్‌లు వస్తున్నాయో తెలుసా... సినీ ప్రియులకు పండగే
Maruti Suzuki Ertiga: బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP DesamAmitshah vs Rahul Gandhi Ambedkar Controversy | పార్లమెంటును కుదిపేసిన 'అంబేడ్కర్ కు అవమానం' | ABPఆటోలో అసెంబ్లీకి, కేటీఆర్ సహా బీఆఎర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనరేవంత్ ఎక్కడికెళ్లినా సెక్యూరిటీని పెట్టుకో, లేకుంటే కొడతారు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
One Nation One Election JPC: జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
This Week OTT Movies: ఈ వారం ఓటీటీల్లోకి ఎన్ని సినిమాలు, సిరీస్‌లు వస్తున్నాయో తెలుసా... సినీ ప్రియులకు పండగే
ఈ వారం ఓటీటీల్లోకి ఎన్ని సినిమాలు, సిరీస్‌లు వస్తున్నాయో తెలుసా... సినీ ప్రియులకు పండగే
Maruti Suzuki Ertiga: బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Ashwin Retirement:
"స్పిన్ గోట్" అల్విదా, టీమిండియా బ్యాక్ బోన్ అశ్విన్
Nandamuri Mokshagna: మోక్షు సినిమా ఆగిపోలేదు... అంతా సర్దుకున్నట్టే - ఇదిగో అప్డేట్ వచ్చింది... కాకపోతే!
మోక్షు సినిమా ఆగిపోలేదు... అంతా సర్దుకున్నట్టే - ఇదిగో అప్డేట్ వచ్చింది... కాకపోతే!
Lagacharla Incident: లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
Prasad Behara Arrest: నటికి వేధింపులు, ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్, 14 రోజులు రిమాండ్
నటికి వేధింపులు, ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్, 14 రోజులు రిమాండ్
Embed widget