Corona Cases In AP: రాష్ట్రంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా 567 మందికి కొవిడ్19 పాజిటివ్
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొవిడ్19 నిబంధనలు పాటించని కారణంగా కరోనా వ్యాప్తి పెరుగుతున్నట్లు అధికారులు భావిస్తున్నారు.
ఏపీలో కరోనా కేసులు తగ్గినట్టే కనిపించినా మళ్లీ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 567 మంది కరోనా బారిన పడ్డారు. అదే సమయంలో మరో 7 మంది కొవిడ్19 మహమ్మారితో పోరాడుతూ చనిపోయారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం 20,61,959 పాజిటివ్ కేసులకు గాను.. 20,42,818 మంది డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకూ 14,364 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 4,777 అని ఏపీ వైద్య శాఖ తాజా బులెటిన్ విడుదల చేసింది.
#COVIDUpdates: 27/10/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) October 27, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,61,959 పాజిటివ్ కేసు లకు గాను
*20,42,818 మంది డిశ్చార్జ్ కాగా
*14,364 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 4,777#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/eU46dLwblh
గడిచిన 24 గంటల్లో దాదాపు 39 వేల పైగా శాంపిల్స్‌కు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 567 మందికి పాజిటివ్ గా నిర్ధారించారు. రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 20,61,959కు చేరుకుంది. ఏపీలో నిన్న ఒక్కరోజులో నమోదైన కరోనా కేసుల కంటే రికవరీ కేసులు తక్కువగా ఉన్నాయి. అయినా రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు మెరుగ్గా ఉందని ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ తాజా బులెటిన్‌లో తెలిపింది.
Also Read: ఇన్‌స్టా, ఫేస్‌బుక్ ఖాతాలు తొలగించాక... ఏకంగా 31 కిలోలు తగ్గిందట ఈ అమ్మడు
#COVIDUpdates: As on 27th October, 2021 10:00AM
— ArogyaAndhra (@ArogyaAndhra) October 27, 2021
COVID Positives: 20,61,959
Discharged: 20,42,818
Deceased: 14,364
Active Cases: 4,777#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/jgKAwvy632
ఏపీలో మొత్తం 2,93,65,385 (2 కోట్ల 93 లక్షల 65 వేల 385) శాంపిల్స్ కు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా... నిన్న ఒక్కరోజులో 39,545 శాంపిల్స్ పరీక్షలు చేశారు. చిత్తూరులో ముగ్గురు, గుంటూరులో ఇద్దరు, కృష్ణా, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు కరోనాతో చనిపోయారు. నిన్న ఒక్కరోజులో 437 మంది కొవిడ్ బారి నుంచి కోలుకుని ఆరోగ్యంగా డిశ్ఛార్జ్ అయ్యారు.
Also Read: రోజూ తాగుతున్నారా? బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ
ఏపీలో నిన్న అత్యధికంగా తూర్పు గోదావరిలో 161 మంది కరోనా బారిన పడ్డారు. చిత్తూరులో 94, కృష్ణాలో 84, గుంటూరులో 47 మందికి కరోనాగా నిర్ధారించారు. కర్నూలులో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. శ్రీకాకుళంలో 6, అనంతపురంలో 8, విజయనగరంలో 13 మంది కొవిడ్ బారిన పడ్డారు.