By: ABP Desam | Updated at : 21 Oct 2021 07:15 PM (IST)
ఏపీలో కరోనా కేసులు (File Photo)
Coronavirus Cases AP: ఏపీలో నిన్నటితో పోల్చితే కరోనా పాజిటివ్ కేసులు తగ్గాయి. గడిచిన 24 గంటల్లో దాదాపు 41 వేల పైగా శాంపిల్స్‌కు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 493 మందికి పాజిటివ్ గా నిర్ధారించారు. రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 20,59,408కు చేరుకుంది. తాజాగా కోవిడ్19తో పోరాడుతూ ఏడుగురు వ్యక్తులు చనిపోయారు. ఏపీలో ఇప్పటివరకూ 14,327 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.
#COVIDUpdates: 21/10/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) October 21, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,59,408 పాజిటివ్ కేసు లకు గాను
*20,39,581 మంది డిశ్చార్జ్ కాగా
*14,327 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 5,500#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/DmHCz1zIxP
అదొక్కటే ఊరట..
ఏపీలో నిన్న ఒక్కరోజులో నమోదైన కరోనా కేసుల కంటే రికవరీ కేసులు అధికంగా ఉన్నాయి. ఏపీలో ఇప్పటివరకూ మొత్తం 20 లక్షల 59 వేల 408 మంది కరోనా బారిన పడగా, అందులో 20,39,581 మంది కొవిడ్19 నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు మెరుగ్గా ఉందని ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ తాజా బులెటిన్‌లో తెలిపింది. బుధవారం నాడు 552 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్ఛార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5,500 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. ఏపీలో మొత్తం 2,91,42,162 (2 కోట్ల 91 లక్షల 42 వేల 162) శాంపిల్స్ కు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా... నిన్న ఒక్కరోజులో 41,820 శాంపిల్స్ పరీక్షలు చేశారు.
Also Read: రోజుకు ఓ నాలుగు వాల్నట్స్ తిన్నా చాలు... జ్ఞాపకశక్తి పెరుగుతుంది
Staff working in Tyaluru PHC, Guntur district accoladed all the frontline #healthworkers in #India for the achievement of #100CroreVaccination doses administered so far.#LargestVaccinationDrive #COVID19Pandemic pic.twitter.com/rn9v9T4K8u
— ArogyaAndhra (@ArogyaAndhra) October 21, 2021
కరోనాపై యుద్ధంలో భారత్ భేష్..
కరోనాపై పోరాటంలో భారత్ సాధించిన అరుదైన ఘనతపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. 100 కోట్ల టీకా డోసులను పంపిణీ చేసి భారత్ నవచరిత్ర లిఖించిందన్నారు మోదీ. భారత్ సాధించిన అరుదైన మైలురాయిగా గుర్తుగా కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఎర్రకోట వద్ద ఓ గీతాన్ని విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆశించిన స్థాయిలో కరోనా వ్యాక్సిన్లు పంపిణీ జరిగిందని, కరోనాపై పోరులో భారత్ దాదాపుగా విజయాన్ని సాధించిందన్నారు.
Also read: బిస్కెట్లు, కేకులు అధికంగా తింటే... ఆ క్యాన్సర్ వచ్చే అవకాశం, తేల్చిన కొత్త అధ్యయనం
Also read: కొరియన్ అమ్మాయిలు సన్నగా, మెరుపుతీగల్లా ఎలా ఉంటారు?
Lokesh Rayalaseema Declaration : రాయలసీమ అభివృద్ధికి టీడీపీ డిక్లరేషన్ - అవన్నీ చేస్తే రత్నాల సీమే !
Lady VRO: చేతిలో పిల్లాడు ఉన్నా అక్రమ మైనింగ్‌ను అడ్డుకుని మహిళా వీఆర్వో సాహసం
Guntur: అరిష్టం పోగొట్టుకోడానికి గురూజీ దగ్గరికి మహిళ, శిష్యుల పాడు పని! పోలీసులకు ఫిర్యాదు
Nellore: మూగ యువతిపై ముగ్గురు అత్యాచారయత్నం! తెలివిగా స్పందించి తప్పించుకున్న బాధితురాలు
Udayagiri Treasure Mystery: చారిత్రక కోట ఉదయ'గిరి' గుప్తనిధుల కోసం ప్రాణాలు బలి!
Dimple Hayathi Case: అరెస్ట్ చేయవద్దని నటి డింపుల్ హయతి పిటిషన్, హైకోర్టు ఏం చెప్పిందంటే!
YS Viveka Case : వివేకా లెటర్‌కు నిన్ హైడ్రిన్ టెస్టుకు ఓకే - కోర్టు అనుమతి
10,000 టికెట్లు ఫ్రీ, ‘ఆదిపురుష్’ నిర్మాత కీలక నిర్ణయం - కేవలం వాళ్లకు మాత్రమే!
IND Vs AUS Final: రవిచంద్రన్ అశ్విన్‌కు దక్కని చోటు - భారత్‌కు ప్రమాదంగా మారుతుందా?