అన్వేషించండి

Andhra News : మరింత ముదిరిన పేర్ని నాని, ఏలూరు కలెక్టర్ మధ్య వివాదం - తాడేపల్లికి చేరిన పంచాయతీ !

పేర్ని నాని, ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మధ్య వివాదం తాడేపల్లికి చేరింది. సీఎస్‌కు పేర్ని నాని.. సీఎంవోలో ప్రసన్న వెంకటేష్ ఫిర్యాదు చేశారు.


Andhra  News :  ఆంధ్రప్రదేశ్  మాజీ మంత్రి పేర్ని నాని వర్సెస్ ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ వ్యవహారం తాడేపల్లికి చేరింది.  ఇవాళ సెక్రెటరియేట్లో సీఎస్ జవహర్ రెడ్డి ని పేర్ని నాని కలిశారు. ఉమ్మడి కృష్ణా జిల్లా జెడ్పీ సమావేశానికి ప్రసన్న వెంకటేశ్ రాకపోవడంపై పేర్ని నాని ఫిర్యాదు చేశారు.  జిల్లాల విభజన అనంతరం ఉమ్మడి జిల్లా ప్రాతిపదికనే జరుగుతోన్న జెడ్పీ సమావేశాలకు పలువురు కలెక్టర్లు హాజరు కావడం లేదని పేర్ని నాని చెప్పారు. ప్రసన్న వెంకటేశ్ తీరుకి వ్యతిరేకంగా సీఎం జగన్ ఇంటి వద్ద ధర్నా చేస్తానని మరోసారి ప్రకటించారు. 

పేర్ని  నాని  తీరుపై సీఎంవోలో ఫిర్యాదు చేసిన ఏలూరు కలెక్టర్ ప్రసన్న  వెంకటేష్                   

అదే సమయంలో  ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్.. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసుకు వెళ్లారు. పేర్ని నానితో వివాదం గురించి చెప్పారు. తాను ఏలూరు కలెక్టర్ గా ఉన్నందున ఉమ్మడి కృష్ణా జిల్లా జెడ్పీ సమావేశాలుకు వెళ్లాల్సిన అవసరం లేదని వివరణ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. అదే సమయంలో పేర్ని  నాని సీఎస్ ను కలిసి కలెక్టర్ పై ఫిర్యాదు చేయడంతో.. కలెక్టర్ వర్సెస్ మాజీ మంత్రి మధ్య బయటకు తెలియని ఏదో వివాదం ఉందన్న  అభిప్రాయం వినిపిస్తోంది.           

మరోసారి సీఎం ఇంటి ముందు ధర్నా చేస్తానని  పేర్ని నాని హెచ్చరిక       

బుధవారం జడ్పీ మీటింగ్‌లో ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ పై పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.   ప్రజాస్వామ్య వ్యవస్థలను గౌరవించని వారిని ఉపేక్షించకూడదని చెప్పారు. ఉమ్మడి కృష్ణాలో సమావేశాలకు రాకుండా సన్న వెంకటేశ్ రాకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పారు. వారి తీరుపై తాను జెడ్పీటీసీ సభ్యులతో వెళ్లి సీఎం ఆఫీసు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయాల వద్ద నిరసనకు దిగుతానని హెచ్చరించారు. ఇవాళ కూడా సీఎం క్యాంప్ ఆఫీసు ముందు ధర్నా చేస్తానని ప్రకటించడం వివాదం అవుతోంది.           

ఇరువురి మధ్య అంతకు మించిన వేరే వివాదం ఉందా ?              

పేర్ని నాని ఈ వివాదంలోకి  ముఖ్యమంత్రి జగన్ ను తీసుకు రావడం .. వైఎస్ఆర్సీపీలో చర్చనీయాంశమవుతోంది. కరెక్టర్లు జడ్పీ మీటింగ్‌కు వెళ్లాలా వద్దా అన్నది అధికారుల స్థాయిలో నిబంధనలను బట్టి నిర్ణయం తీసుకుంటారని.. ఇలాంటి అంశాన్ని సీఎంకు ముడి పెట్టేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారన్న చర్చ వైసీపీలో జరుగుతోంది.  ఇటీవలి కాలంలో పేర్ని నాని రాజకీయంగా వివాదాస్పదంగా ప్రవర్తిస్తున్నారు. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని చెబుతున్నారు. అదే సమయంలో ఇలాంటి వివాదాలు రేపుతూండటానికి కారణం ఏమిటని వైసీపీ వర్గాలు ఆరా తీస్తున్నాయి.                                

టాప్ హెడ్ లైన్స్

AP Aqua Farmers: ఆక్వా రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. విద్యుత్ ఛార్జీలు భారీగా తగ్గిస్తూ జీవో జారీ
AP Aqua Farmers: ఆక్వా రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. విద్యుత్ ఛార్జీలు భారీగా తగ్గిస్తూ జీవో జారీ
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
Kiran Abbavaram: అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
Embed widget