అన్వేషించండి

CM Jagan : కడప జిల్లాకు సీఎం జగన్ - మూడు రోజుల పాటు పర్యటన !

CM Jagan Kadapa Tour : కడప జిల్లాలో సీఎం జగన్ మూడు రోజుల పాటు పర్యటిస్తారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొంటారు.

CM Jagan Kadapa Tour :  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన సొంత జిల్లా పర్యటన దాదాపు ఖరారైంది. మూడు రోజులపాటు సొంత జిల్లాలో  సీఎం వైఎస్ జగన్ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.  సీఎంవో జగన్ పర్యటన వివరాలను వెల్లడించింది. ఈ నెల 23, 24, 25 తేదీల్లో సీఎం వైఎస్‌ జగన్‌ వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ది పనుల ప్రారంభోత్సవం, శంకుస్ధాపనలు, క్రిస్మస్‌ వేడుకల్లో సీఎం వైఎస్ జగన్ పాల్గొంటారు.

శనివారం ఉదయం కడపకు పయనం                                 

ఈ నెల23న ఉదయం 9.15 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి కడప చేరుకుంటారు. అక్కడి నుంచి గోపవరం చేరుకుని సెంచురీ ప్లై పరిశ్రమలోని ఎండీఎఫ్, హెచ్‌పీఎల్‌ ప్లాంట్‌లను ప్రారంభించి, చైర్మన్, ఉద్యోగులతో మాట్లాడతారు. ఆ తర్వాత కడప రిమ్స్‌ వద్ద డాక్టర్‌ వైఎస్ఆర్ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభిస్తారు. దాంతోపాటు డాక్టర్‌ వైఎస్ఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ను ప్రారంభింస్తారు. అనంతరం అదే రిమ్స్‌ ప్రాంగణంలో డాక్టర్‌ వైఎస్ఆర్ క్యాన్సర్‌ కేర్‌ బ్లాక్‌ ప్రారంభోత్సవం చేస్తారు. అనంతరం ఎల్‌వీ ప్రసాద్‌ కంటి ఆసుపత్రిని సైతం సీఎం వైఎస్ జగన్ ప్రారంభిస్తారు.         

వైఎస్ జగన్ చికెన్ ఎందుకు మానేశారో తెలుసా? ఎన్నో ఇంట్రస్టింగ్ విషయాలు

ఫ్లడ్ లైట్లను ప్రారంభించనున్న సీఎం జగన్                    

 వైఎస్‌ రాజారెడ్డి క్రికెట్‌ స్టేడియంలో కొత్తగా ఏర్పాటుచేసిన ఫ్లడ్‌లైట్లను ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఆధునికీకరించిన కలెక్టరేట్‌ భవనాన్ని, నవీకరించిన అంబేద్కర్‌ సర్కిల్, వై జంక్షన్, కోటిరెడ్డి సర్కిల్, సెవెన్‌ రోడ్స్‌ సర్కిల్‌ ప్రారంభిస్తారు. మరికొన్ని అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్ధాపనలు చేసిన అనంతరం ఇడుపులపాయ చేరుకుని వైఎస్ఆర్ ఎస్టేట్‌లోని గెస్ట్‌హౌస్‌లో సీఎం వైఎస్ జగన్ రాత్రికి బస చేయనున్నారు. మరుసటి రోజు ఉదయం ఇడుపులపాయ గెస్ట్‌హౌస్‌ నుంచి బయలుదేరి వైఎస్ఆర్ ఘాట్‌ వద్దకు చేరుకుని నివాళులర్పిస్తారు. ఆ తర్వాత ఇడుపులపాయ ప్రేయర్‌ హాల్‌లో జరిగే ప్రార్ధనల్లో పాల్గొంటారు, అనంతరం మధ్యాహ్నం సింహాద్రిపురం చేరుకుని పలు ప్రారంభోత్సవాలు చేస్తారు. ఆ తర్వాత ఇడుపులపాయ చేరుకుని ఎకో పార్క్‌లో పులివెందుల మండల ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు. 

వ్యతిరేకత ప్రభుత్వం మీదనా ? ఎమ్మెల్యేల మీదనా ? - మార్పు వెనుక సీఎం జగన్ వ్యూహం ఏమిటి ?

క్రిస్మస్ రోజు ప్రత్యేక ప్రార్థనల తర్వాత తాడేపల్లి పయనం                                                  

24వతేదీన రాత్రికి అక్కడి గెస్ట్‌హౌస్‌లో బస చేస్తారు. ఈ నెల 25న ఉదయం ఇడుపులపాయ గెస్ట్‌హౌస్‌ నుంచి బయలుదేరి పులివెందుల చేరుకుంటారు. అక్కడ సీఎస్‌ఐ చర్చిలో జరిగే క్రిస్మస్‌ ప్రార్ధనల్లో పాల్గొంటారు. అనంతరం బయలుదేరి మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు.

టాప్ హెడ్ లైన్స్

Karumuri Remand: ఏపీ మాజీ మంత్రి కారుమూరి రిమాండ్ రిపోర్ట్‌లో ఈడీ కీలక విషయాలు, 2 వారాల రిమాండ్
ఏపీ మాజీ మంత్రి కారుమూరి రిమాండ్ రిపోర్ట్‌లో ఈడీ కీలక విషయాలు, 2 వారాల రిమాండ్
Investment Fraud: తిరుపతి డీఎస్పీ పేరుతో కోట్లలో వసూళ్లు చేసిన గ్యాంగ్.. నిందితుడి అరెస్ట్
తిరుపతి డీఎస్పీ పేరుతో కోట్లలో వసూళ్లు చేసిన గ్యాంగ్.. నిందితుడి అరెస్ట్
AP Special TET 2026 Notification: ఏపీలో టీచర్లకు గుడ్ న్యూస్.. స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల- ముఖ్యమైన తేదీలివే
ఏపీలో టీచర్లకు గుడ్ న్యూస్.. స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల- ముఖ్యమైన తేదీలివే
AE Nookaraju Family Suicide Case: సౌజన్య, సాధిక్ రిలేషన్‌లో ఉన్నారు.. మతం మారాలని ఒత్తిడి చేశాడు: కాకినాడ ఎస్పీ
సౌజన్య, సాధిక్ రిలేషన్‌లో ఉన్నారు.. మతం మారాలని ఒత్తిడి చేశాడు: కాకినాడ ఎస్పీ

వీడియోలు

IND vs SL 2nd Test Day 1 | కోహ్లీ రికార్డ్‌ను బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్
Yashasvi Jaiswal Fight With Asitha Fernando | అసిథ ఫెర్నాండోతో జైస్వాల్ గొడవ
Serial Actor Charishma Shreekhar Profile | అమ్మోరు' సీరియల్ నటి సక్సెస్ స్టోరీ ఇదే
Anasuya Bharadwaj Emotional Comments | సమాజంపై అనసూయ ఎమోషనల్ వీడియో
Gundenininda Gudigantalu Serial August 24 | రోహిణి, మనోజ్ రూమ్‌కి తాళం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India Out Of Hockey World Cup: అర్జెంటీనా చేతిలో భారత్‌ ప‌రాజ‌యం.. వరల్డ్ కప్ సెమీస్ రేసు నుంచి ఔట్, వ‌రుస‌గా మూడో ఓటమితో ఇంటికి!
అర్జెంటీనా చేతిలో భారత్‌ ప‌రాజ‌యం.. వరల్డ్ కప్ సెమీస్ రేసు నుంచి ఔట్, వ‌రుస‌గా మూడో ఓటమితో ఇంటికి!
Karumuri Remand: ఏపీ మాజీ మంత్రి కారుమూరి రిమాండ్ రిపోర్ట్‌లో ఈడీ కీలక విషయాలు, 2 వారాల రిమాండ్
ఏపీ మాజీ మంత్రి కారుమూరి రిమాండ్ రిపోర్ట్‌లో ఈడీ కీలక విషయాలు, 2 వారాల రిమాండ్
Hanamkonda Crime News: కారు డిక్కీలో మహిళ డెడ్‌బాడీ కేసును ఛేదించిన కాజీపేట పోలీసులు.. పరువు కోసం దారుణం!
కారు డిక్కీలో మహిళ డెడ్‌బాడీ కేసును ఛేదించిన కాజీపేట పోలీసులు.. పరువు కోసం దారుణం!
AP Special TET 2026 Notification: ఏపీలో టీచర్లకు గుడ్ న్యూస్.. స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల- ముఖ్యమైన తేదీలివే
ఏపీలో టీచర్లకు గుడ్ న్యూస్.. స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల- ముఖ్యమైన తేదీలివే
Telangana Assembly Session: సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ఛాన్స్ కోసం చూస్తున్న విపక్షాలు!
సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ఛాన్స్ కోసం చూస్తున్న విపక్షాలు!
Dhruv Jurel Mentality: మాంబా మెంటాలిటీతో జురెల్ సూపర్ సెంచరీ.. జై జవాన్, జై కిసాన్ టాటుకు అర్థం చెప్పిన ధ్రువ్!
మాంబా మెంటాలిటీతో జురెల్ సూపర్ సెంచరీ.. జై జవాన్, జై కిసాన్ టాటుకు అర్థం చెప్పిన ధ్రువ్!
Investment Fraud: తిరుపతి డీఎస్పీ పేరుతో కోట్లలో వసూళ్లు చేసిన గ్యాంగ్.. నిందితుడి అరెస్ట్
తిరుపతి డీఎస్పీ పేరుతో కోట్లలో వసూళ్లు చేసిన గ్యాంగ్.. నిందితుడి అరెస్ట్
Grey Hair : జుట్టు చిన్న వయసులోనే తెల్లబడిపోతుందా? కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
జుట్టు చిన్న వయసులోనే తెల్లబడిపోతుందా? కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
Embed widget