jagan Vizag Tour : విశాఖ వెళ్లి హర్యానా సీఎంతో భేటీ కానున్న జగన్ ! ఎజెండా ఏమిటంటే ?
హర్యానా సీఎంతో సమావేశం అయ్యేందుకు విశాఖ వెళ్లనున్నారు సీఎం జగన్. నేచురోపతి ట్రీట్‌మెంట్ కోసం హర్యానా సీఎం విశాఖ వచ్చారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ( CM JAGAN ) మంగళవారం విశాఖ పర్యటనకు వెళ్లనున్నారు. విశాఖలోని పెమ వెల్‌నెస్ రిసార్ట్‌లో హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్‌తో ( Haryana CM Khattar ) సమావేశం కానున్నారు. ఆ ఒక్క కార్యక్రమం కోసమే విశాఖ వెళ్తున్నారు. మంగళవారం ఉదయం ఉదయం 10గంటల 25 నిమిషాలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరి 11గంటల 05 నిమిషాలకు విశాఖకు చేరుకుంటారు. అక్కడినుంచి 11గంటల 50 నిమిషాలకు రుషికొండ పెమ వెల్‌నెస్ రిసార్ట్‌కు వెళ్తారు. అక్కడ హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్‌తో భేటీ అవుతారు. సమావేశం అనంతరం మధ్యాహ్నం 1:25 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి 2:30 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి చేరుకోనున్నారు.
సింహాచలం స్వామివారి ఉంగరం పోయిందట, దొంగిలించారని మంత్రినే నిలదీసిన పూజారి - చివరికి ట్విస్ట్
హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రస్తుతం విశాఖలో ఉన్నారు. పెమ వెల్‌నెస్ రిసార్ట్ లో నేచురోపతి ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. ఇరవయ్యో తేదీ వరకూ ఆయనకు ట్రీట్ మెంట్ ఉంటుంది. విశాఖకు ( Vizag ) వచ్చిన రోజున ఆయన స్వరూపానంద ఆశ్రమానికి వెళ్లారు. ప్రత్యేక పూజలు చేశారు. సింహాచలం ఆలయాన్ని కూడా సందర్శించారు. ఆ తర్వాత నేచురోపతి ట్రీట్‌మెంట్‌కు వెళ్లారు. సాధారణంగా ఎవరైనా ముఖ్యమంత్రి ఏదైనా రాష్ట్రానికి వ్యక్తిగత పని మీద వెళ్లినా ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రిని ( CM ) ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలవడం ఆనవాయితీ. అయితే ప్రస్తుతం మనోహర్ లాల్ ఖట్టర్ నేచురోపతి ట్రీట్ మెంట్ మధ్యలో ఉన్నారు. ఆయన విశాఖ నుంచి అమరావతి వెళ్లడం సాధ్యం కాదు. అందుకే సీఎం జగన్ తానే వెళ్లి సీఎం ఖట్టర్‌ను కలవాలని అనుకున్నట్లుగా తెలుస్తోంది.
కొత్త మంత్రులూ! ఇవేం పనులు, ప్రారంభంలోనే వివాదం - నూతన అమాత్యుల తీరుపై విమర్శలు!
ఇది మర్యాదపూర్వక భేటీనేనని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సీఎం టూర్ ప్రోగ్రాం కూడా నేరుగా ఎయిర్ పోర్టు నుంచి రిసార్టుకు.. మళ్లీ రిసార్టు నుంచి ఎయిర్ పోర్టుకు మాత్రమే ఉంది. మధ్యలో ఎక్కడా ఆగడం..బస చేయడం లాంటివేమీ లేవు. ఏపీ, హర్యానా మధ్య ప్రత్యేకంగా చర్చించాల్సిన విషయాలు కూడా ఉండవని అంటున్నారు. మనోహర్ లాల్ ఖట్టర్ బీజేపీ పాలిత రాష్ట్రం హర్యానా సీఎం. రాష్ట్రానికి వ్యక్తిగతపని మీద వచ్చిన ఓ ముఖ్యమంత్రి జగన్ మర్యాద పూర్వకంగా కలుస్తున్నారని అంతకు మించిన విశేషం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.