AP New Ministers: కొత్త మంత్రులూ! ఇవేం పనులు, ప్రారంభంలోనే వివాదం - నూతన అమాత్యుల తీరుపై విమర్శలు!

AP New Ministers Rallies: ఏపీలో కొత్త మంత్రి వర్గం ఏర్పాటయ్యాక వాళ్లలో చాలామంది నేతలు సంబరాలతో చేపట్టిన ఊరేగింపులు, ర్యాలీలు ప్రజలకు ఇబ్బందికరంగా మారాయి.

FOLLOW US: 

అలా పదవి వచ్చిందో లేదో మంత్రులు వారి అనుచరులు చేస్తున్న అతికి పగ్గాలు లేకుండా పోతున్నాయనే ఆరోపణలు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా ఏపీలో కొత్త మంత్రి వర్గం ఏర్పాటయ్యాక వాళ్లలో చాలామంది చేపట్టిన ఊరేగింపులు ప్రజలకు ఇబ్బందికరంగా మారాయి. కేవలం మంత్రి పదవి దక్కడంతోనే ఈ మంత్రుల అనుచగరణాలు.. వారి చుట్టూ ఉండే అధికారుల ఓవర్ యాక్షన్ కోటలు దాటుతుంది. ఇంతా చేస్తే ఇప్పటికే ఈ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు దాటిపోయింది. ఇంకా మిగిలింది సరిగ్గా చెప్పాలంటే ఏడాదిన్నరే పదవీకాలం ఉంది. తరువాత అంతా ఎన్నికల హడావుడి మొదలైపోతుంది. ఈ మాత్రం దానికి ఎందుకింత హడావుడి చేస్తున్నారనే విమర్శలు అన్ని వైపుల నుండీ వెల్లువెత్తుతున్నాయి. 

పసిపాప ఉసురు తీసిన మంత్రిగారి ర్యాలీ ఆంక్షలు?
తొలిసారి మంత్రి అయిన ఉషశ్రీ చరణ్ ఊరేగింపు ఓ పసిబిడ్డ ప్రాణాల్ని తీసిందన్న ఆరోపణలు సంచలనం సృష్టించాయి. సత్యసాయి జిల్లాకు చెందిన ఉషశ్రీ చరణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి కళ్యాణదుర్గం వచ్చారు. దీంతో ఆమెకు పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. నియోజక వర్గంలో మంత్రిగారి విజయోత్సవ ర్యాలీ సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అదే సమయంలో శెట్టూరు మండలం చెర్లోపల్లి గ్రామానికి చెందిన గణేష్ - ఈరక్క దంపతులు తమ చిన్న కుమార్తెకు ఆరోగ్యం బాగాలేక 108కు ఫోన్ చేశారు. అది రాకపోవడంతో బైక్ పై ఎక్కించుకుని ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు. ఆ క్రమంలో తమకు దారి ఇవ్వలేదని అందువల్ల పాప మృతి చెందిందని పసిపాప తల్లిదండ్రులు ఆరోపించారు. 

ఊరేగింపు తరువాత చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయిందని వైద్యులు చెప్పారనీ వారు ఆరోపించారు. మంత్రి ఊరేగింపు కారణంగానే తమ కుమార్తె ప్రాణాలు కోల్పోయిందంటూ పాప తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పోలీసులు మాత్రం పాప మృతికి తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం పాప తల్లిదండ్రులు ఊళ్ళో బయలుదేరి బైక్ పై 20 కిమీ దూరాన్ని 38 నిముషాల్లోనే ప్రయాణించి హాస్పిటల్ చేరుకున్నారని.. ఈ సంఘటనకు పోలీసులకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.

జోగి రమేష్ ఊరేగింపులో గుండెపోటుతో సర్పంచ్ మృతి 
గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జోగి రమేష్ కృష్ణా జిల్లాలో ఊరేగింపు చేపట్టారు. ఈ ఊరేగింపులో గూడూరు మండలం కోకనారాయణ పేట సర్పంచ్ బండి రమేష్ పాల్గొన్నారు. అంతా సరదాగా ఉన్న టైంలో బండి రమేష్‌ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. ఆయన అంతిమ యాత్రలో పాల్గొన్న మంత్రి జోగిరమేష్ స్వయంగా ఆయన పాడె మోశారు. అయితే అసలు ఆ ఊరేగింపే లేకుంటే బండి రమేష్ బతికుండేవారు కదా అనే వాదనలు వినబడుతున్నాయి.

నెల్లూరులో మంత్రి కేసు తాలూకూ ఫైల్స్ మాయం
ఇటీవల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై అభియోగాలు నమోదైన కేసుకు సంబంధించిన విచారణ జరుగుతున్న కోర్టులో దొంగలు పడడం.. ఆ కేసు తాలూకు ఫైల్స్ మాయం అయ్యాయన్న ఆరోపణలు రావడం సంచలనంగా మారింది. కీలక కేసులో ఆధారాల చోరీతో జిల్లా ఉన్నతాధికారులే రంగంలోకి దిగి.. ఇద్దరు అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై హైకోర్టు జోక్యం చేసుకుంది. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఏ-1గా ఉన్న ఫోర్జరీ కేసులో ఆధారాలు దొంగిలించడంపై సమగ్ర విచారణ జరపాలంటూ పోలీసుల్ని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోరారు. ఇక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ కోర్టులో జరిగిన చోరీపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

జర్నలిస్టులు సీఎం జగన్ ను ఆరాధించాలన్న సమాచారశాఖ మంత్రి చెల్లుబోయిన వేణు
జర్నలిస్టులు సీఎం జగన్ ను ఆరాధించాలి తప్ప ఆరాలు తీయకూడదని వ్యాఖ్యానించి విమర్శల పాలయ్యారు సమాచార శాఖా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ. ప్రాస కోసం ప్రయత్నించినా దీనివల్ల జర్నలిస్టు సంఘాలకూ ఇటు ప్రజల్లోనూ ఈ వ్యాఖ్యలతో చులకన అయ్యారు. తాను సీఎంను ఆరాధించడం వల్లనే మంత్రి పదవి వచ్చిందన్న మాటలు కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్ అయ్యాయి.

భక్తులకు ఇబ్బందులు తెచ్చిన దేవాదాయ శాఖ మంత్రి
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్య నారాయణ ఆర్భాటం శ్రీ కాళహస్తిలో భక్తులకు ఇబ్బందులు తెచ్చింది. కొత్తగా మంత్రి అయిన కొట్టు సత్యనారాయణ దేవుడి దర్శనం కోసం శ్రీకాళహస్తికి వచ్చారు. ఆయన దర్శనం కోసం దాదాపు రెండు గంటల సేపు భక్తులను దర్శనం చేసుకోకుండా నిలిపి వేశారు. మండు టెండలో కనీసం మంచి నీళ్లు కూడా లేకుండా భక్తులను నిలిపివేయడంతో వాళ్ళు మంత్రిపై తమ ఆగ్రహాన్ని చూపారు. మంత్రి గో బ్యాక్ అంటూ పెద్దగా నినాదాలు చేశారు. మంత్రి గారి దర్శనం కోసం భక్తులను ఇబ్బంది పెట్టడం సరికాదని ఈ సంఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు విమర్శలు గుప్పించారు.

మంత్రి పినిపే ఊరేగింపులో నోట్ల కట్టల వెదజల్లిన అనుచరులు
ఇక రవాణాశాఖా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రి పినిపే విశ్వరూప్ ఊరేగింపులోనూ ఆయన అనుచరుల ఓవర్ యాక్షన్ హద్దులు దాటింది. ఆయనకు ఘన స్వాగతం పలుకుతూ ర్యాలీ చేపట్టారు ఆయన అనుచరులు, కార్యకర్తలు. ఈ ర్యాలీలో  మార్కెట్ కమిటీ ఛైర్మన్‌ కొండలరావు తన ఉత్సాహాన్ని ఆపుకోలేకపోయారు. ర్యాలీలో నోట్లు వెదచల్లుతూ హడావుడి చేశారు. ఇదంతా మంత్రిగారిపై అభిమానంతోనే చేశానంటూ ఆయన చెప్పుకుంటున్నా.. ఏపీలో కొత్త కల్చర్‌ తెచ్చారంటూ సోషల్‌ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

Published at : 18 Apr 2022 12:29 PM (IST) Tags: ap new ministers list AP Ministers success Rallies usha sri charan chelluboina Venugopala Krishna pinipe viswarup

సంబంధిత కథనాలు

Tirumala News : తిరుమలకు పోటెత్తిన  భక్తులు, శ్రీవారి దర్శనానికి 48 గంటలు పట్టే అవకాశం!

Tirumala News : తిరుమలకు పోటెత్తిన భక్తులు, శ్రీవారి దర్శనానికి 48 గంటలు పట్టే అవకాశం!

Ysrcp Bus Yatra : సామాజిక న్యాయమే సీఎం జగన్ ఫిలాసఫీ, నరసరావుపేట సభలో మంత్రులు

Ysrcp Bus Yatra : సామాజిక న్యాయమే సీఎం జగన్ ఫిలాసఫీ, నరసరావుపేట సభలో మంత్రులు

TDP Mahanadu 2022 : టీడీపీ మహానాడుకు భారీ స్పందన, అటు చంద్రబాబు ఇటు బాలయ్య ప్రసంగాలతో దద్దరిల్లిన స్టేజ్

TDP Mahanadu 2022 :  టీడీపీ మహానాడుకు భారీ స్పందన, అటు చంద్రబాబు ఇటు బాలయ్య ప్రసంగాలతో దద్దరిల్లిన స్టేజ్

Mahanadu 2022 : జిల్లా విభజనను పునః సమీక్షిస్తా, బుల్లెట్లా దూసుకెళ్తా- మహానాడులో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Mahanadu 2022 :  జిల్లా విభజనను పునః సమీక్షిస్తా, బుల్లెట్లా దూసుకెళ్తా- మహానాడులో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Mahanadu Chandrababu : నేను వస్తా.. దోచినదంతా కక్కిస్తా - మహానాడులో చంద్రబాబు హెచ్చరిక !

Mahanadu Chandrababu :  నేను వస్తా.. దోచినదంతా  కక్కిస్తా - మహానాడులో చంద్రబాబు హెచ్చరిక !

టాప్ స్టోరీస్

Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?

Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?

Dhaakad box office collection: కంగనా సినిమాకి దారుణమైన కలెక్షన్స్ - 20 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి!

Dhaakad box office collection: కంగనా సినిమాకి దారుణమైన కలెక్షన్స్ - 20 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి!

3 Years of YSR Congress Party Rule : జగన్ మూడేళ్ల పాలనలో టాప్ టెన్ హైలెట్స్ ఇవే !

3 Years of YSR Congress Party Rule :   జగన్ మూడేళ్ల పాలనలో టాప్ టెన్ హైలెట్స్ ఇవే !

TSRTC Water Bottle : టీఎస్ఆర్టీసీ వాటర్ బాటిల్స్ కు పేరు, డిజైన్ సూచించండి, ప్రైజ్ మనీ గెలుచుకోండి

TSRTC Water Bottle : టీఎస్ఆర్టీసీ వాటర్ బాటిల్స్ కు పేరు, డిజైన్ సూచించండి, ప్రైజ్ మనీ గెలుచుకోండి