అన్వేషించండి

YSR Sanchara Pasu Arogya Seva : మూగజీవాలకు అంబులెన్స్‌లు, వైఎస్సార్‌ సంచార పశు ఆరోగ్య సేవలు ప్రారంభించి సీఎం జగన్

YSR Sanchara Pasu Arogya Seva : డా. వైఎస్సార్‌ సంచార పశు ఆరోగ్య సేవలో భాగంగా 165 పశువుల అంబులెన్స్‌ లను ఏపీ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. సీఎం జగన్ జెండా ఊపి వీటిని ప్రారంభించారు.

YSR Sanchara Pasu Arogya Seva : మూగజీవాలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవలను సీఎం జగన్ గురువారం ప్రారంభించారు. పశుపోషకుల ఇంటవద్ద మూగజీవాలకు వైద్యం అందించేలా వాహనాలను రూపొందించారు. సుమారు రూ.278 కోట్ల వ్యయంతో మొత్తం 340 పశువుల అంబులెన్స్‌లను ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధంచేశారు. తొలిదశలో రూ.143 కోట్లతో 175 అంబులెన్స్‌లు అందుబాటులోకి తెచ్చారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయం వద్ద సీఎం జగన్ జెండా ఊపి అంబులెన్స్ లు ప్రారంభించారు. అంతకుముందు డాక్టర్‌ వైఎస్సార్‌ సంచార పశు ఆరోగ్య వాహనాల్లో ఉన్న సదుపాయాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు.

YSR Sanchara Pasu Arogya Seva : మూగజీవాలకు అంబులెన్స్‌లు, వైఎస్సార్‌ సంచార పశు ఆరోగ్య సేవలు ప్రారంభించి సీఎం జగన్

తొలిదశలో 165 అంబులెన్స్ అందుబాటులోకి 

రూ.135 కోట్లతో 165 అంబులెన్స్‌లను మలిదశలో అందుబాటులోకి తీసుకురానున్నారు. అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు చొప్పున 108 అంబులెన్స్‌ల తరహాలో ఈ అంబులెన్స్‌లను ప్రభుత్వం తీసుకొచ్చింది. వీటి నిర్వహణ ఖర్చులను కూడా ప్రభుత్వమే భరించనుంది. అంబులెన్స్‌ సేవల కోసం టోల్‌ ఫ్రీ నంబరు 1962 ఏర్పాటుచేశారు. ఫోన్‌ చేసి పశువు అనారోగ్య సమస్య వివరిస్తే అంబులెన్స్‌లో పశువైద్యులు రైతు ఇంటికి వెళ్లి వైద్యసేవలందిస్తారు. అవసరమైతే పశువును దగ్గర్లోని పశువైద్యశాలకు తరలించి మెరుగైన వైద్యసేవలందిస్తారు. ఆ పశువును తిరిగి రైతు ఇంటికి ఉచితంగా తరలిస్తారు. ప్రస్తుతం ఈ అంబులెన్స్‌లు విజయవాడ నున్న సమీపంలోని ముస్తాబాద శివారు ప్రాంతంలో ఉన్నాయి. వీటిని రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి రెండు చొప్పున అందుబాటులో ఉంచనున్నారు. 

అంబులెన్స్ లో సౌకర్యాలు 

డా. వైఎస్సార్‌ సంచార పశు ఆరోగ్య సేవలో భాగంగా పశువులకు అంబులెన్స్‌ సేవలను ఏపీ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. 278 కోట్ల వ్యయంతో మొత్తం 340 పశువుల అంబులెన్స్‌ల ను ఏర్పాటు చేశారు. మొదటి దశలో 143 కోట్ల వ్యయంతో 175 పశువుల అంబులెన్స్‌లను సీఎం జ‌గ‌న్ లాంఛ‌నంగా ప్రారంభించారు. మనుషుల ఆరోగ్యానికే కాదు పశువుల ఆరోగ్యానికి సైతం భద్రత, భరోసా కల్పిస్తూ విప్లవాత్మక కార్యక్రమాలు అమలు చేస్తున్నామ‌ని సీఎం జ‌గ‌న్  ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ప్రతి పశువుల అంబులెన్స్‌లో ఒక పశు వైద్యుడు, వెటర్నరీ డిప్లొమా చేసిన సహాయకుడు, డ్రైవర్‌ కమ్‌ అటెండర్ 20 రకాల పేడ సంబంధిత పరీక్షలు, 15 రకాల రక్త పరీక్షలు చేసేందుకు వీలుగా మైక్రోస్కోప్‌తో కూడిన చిన్న ప్రయోగశాల, అన్ని రకాల వ్యాక్సిన్లు, మందులతో పాటు పశువును వాహనంలోకి ఎక్కించేందుకు హైడ్రాలిక్‌ సౌకర్యం ఉండేలా ఏర్పాట్లు చేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohan Babu - Manchu Manoj: మోహన్ బాబు, మనోజ్ కొట్లాట?... ఆధారాలు లేకుండా అసత్య ప్రచారం వద్దు - స్పందించిన మంచు ఫ్యామిలీ
మోహన్ బాబు, మనోజ్ కొట్లాట?... ఆధారాలు లేకుండా అసత్య ప్రచారం వద్దు - స్పందించిన మంచు ఫ్యామిలీ
Ind Vs Aus 2nd Test: గులాబీ గుచ్చుకుంది- అడిలైడ్ టెస్టులో భారత్ ఘోర పరాజయం, సిరీస్ సమం చేసిన ఆసీస్
గులాబీ గుచ్చుకుంది- అడిలైడ్ టెస్టులో భారత్ ఘోర పరాజయం, సిరీస్ సమం చేసిన ఆసీస్
Pawan Kalyan: అల్లు అర్జున్ భుజాలపై గన్ పెట్టి, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ!
అల్లు అర్జున్ భుజాలపై గన్ పెట్టి, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ!
Telangana Mother Statue: కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగంఅడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థతఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Babu - Manchu Manoj: మోహన్ బాబు, మనోజ్ కొట్లాట?... ఆధారాలు లేకుండా అసత్య ప్రచారం వద్దు - స్పందించిన మంచు ఫ్యామిలీ
మోహన్ బాబు, మనోజ్ కొట్లాట?... ఆధారాలు లేకుండా అసత్య ప్రచారం వద్దు - స్పందించిన మంచు ఫ్యామిలీ
Ind Vs Aus 2nd Test: గులాబీ గుచ్చుకుంది- అడిలైడ్ టెస్టులో భారత్ ఘోర పరాజయం, సిరీస్ సమం చేసిన ఆసీస్
గులాబీ గుచ్చుకుంది- అడిలైడ్ టెస్టులో భారత్ ఘోర పరాజయం, సిరీస్ సమం చేసిన ఆసీస్
Pawan Kalyan: అల్లు అర్జున్ భుజాలపై గన్ పెట్టి, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ!
అల్లు అర్జున్ భుజాలపై గన్ పెట్టి, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ!
Telangana Mother Statue: కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
Palnadu Road Accident: దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
Rohini: విష్ణుప్రియకు అతనితో కనెక్షన్ ఉందని... కన్ఫర్మ్ చేసిన రోహిణి - బిగ్ బాస్ 8 ఎగ్జిట్ ఇంటర్వ్యూ
విష్ణుప్రియకు అతనితో కనెక్షన్ ఉందని... కన్ఫర్మ్ చేసిన రోహిణి - బిగ్ బాస్ 8 ఎగ్జిట్ ఇంటర్వ్యూ
Andhra Politics: టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
Natwar Lal: తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
Embed widget