అన్వేషించండి

CM Jagan : రూ.3099 కోట్లతో విద్యుత్ సబ్ స్టేషన్లు - వర్చువల్‌గా 12 ప్రారంభం - ప్రజలకు అంకితమిచ్చిన సీఎం జగన్

CM Jagan : 12 సబ్ స్టేషన్లు ప్రారంభించి ప్రజలకు అంకితం ఇచ్చినట్లుగా సీఎం జగన్ తెలిపారు. దాదాపు రూ.3099 కోట్లు సబ్‌స్టేషన్లకోసం ఖర్చుచేస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు.

 

CM Jagan :  విద్యుత్ సబ్‌స్టేషన్లు లేక ఇబ్బంది పడుతున్న వారికి కష్టాలు తీరనున్నాయని సీఎం  జగన్ ప్రకటించారు.  12 సబ్ స్టేషన్లను  ప్రారంభించిన సీఎం జగన్ వాటిని   స్థానికులకే అంకితం చేస్తున్నామని ప్రకటించారు.  రైతులకు 9 గంటల విద్యుత్‌ పగటి పూటే ఇవ్వాలని అధికారంలోకి రాగానే నిర్ణయించామని గుర్తు చేశారు.  రాష్ట్ర విద్యుత్‌ రంగ చరిత్రలో తొలిసారిగా ఒకేసారి 28 సబ్‌ స్టేషన్లకు ఆంధ్రప్రదేశ్‌ ట్రాన్స్‌మిషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ శ్రీకారం చుట్టింది. సీఎం జగన్‌ వర్చువల్‌ విధానంలో 16 సబ్‌స్టేషన్లకు శంకుస్థాపన, 12 సబ్‌స్టేషన్ల ప్రారంభోత్సవాలు చేశారు.

 14 జిల్లాల్లో విద్యుత్‌ పంపిణీ వ్యవస్థ బలోపేతం అవుతోందని సీఎం జగన్ తెలిపారు.   28 సబ్‌ స్టేషన్లలో కొన్నింటిని ప్రారంభించాం, కొన్నింటి పనులు ప్రారంభిస్తాం. గోదావరి ముంపు ప్రాంతాల్లో చింతూరు, వీఆర్‌పురం, ఎటపాక తదితర ప్రాంతాల్లో ఇటీవలే తిరిగినప్పుడు సబ్‌స్టేషన్లే లేకపోవడంవల్ల ఇబ్బందులు వస్తున్నాయని అక్కడి వారు చెప్పారు. ఆ సమస్యను పరిష్కరిస్తూ.. అక్కడ సబ్‌స్టేషన్లను ఇవాళ ప్రారంభిస్తూ అక్కడి ప్రజలకు అంకితం చేస్తున్నామని తెలిపారు.   12 సబ్‌స్టేషన్లను ఇవాళ ప్రారంభిస్తున్నాం, 16 సబ్‌స్టేషన్లకు శంకుస్థాపన చేస్తున్నామని తెలిపారు.                                      

ట్రాన్స్‌మిషన్‌ కెపాసిటీని విస్తరించుకుంటూ, నాణ్యమైన విద్యుత్‌ ప్రతి గ్రామానికి ప్రతిరైతుకు ఇచ్చే వ్యవస్థను క్రియేట్‌ చేస్తున్నామని జగన్ తెలిపారు.   రైతులకు 9 గంటలపాటు పగటిపూటే ఉచిత విద్యుత్‌ ఇవ్వాలన్న ఉద్దేశంతో అధికారంలోకి వచ్చిన తొలిరోజుల్లోనే విద్యుత్‌ పంపిణీ వ్యవస్థ బలోపేతానికి శ్రీకారం చుట్టాం. రూ.1700 కోట్ల తో ఫీడర్లను ఏర్పాటుచేసి రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను ఇస్తున్నాం. ఉచిత విద్యుత్‌ను స్థిరంగా ఇవ్వడానికి రూ.2.4లకే యూనిట్‌ ధరతో సెకీతో ఒప్పందం చేసుకున్నాం. మరో 25 సంవత్సరాలపాటు రైతులకు ఎలాంటి ఢోకా లేకుండా ఉచిత విద్యుత్‌ ఇస్తున్నాం. దీనివల్లరాష్ట్ర ప్రభుత్వంపై భారం తగ్గుతుందని సీఎం వివరించారు.                                     

 దాదాపు రూ.3099 కోట్లు  సబ్‌స్టేషన్లకోసం ఖర్చుచేస్తున్నామని సీఎం  జగన్ తెలిపారు.  రూ. 3400 కోట్లతో 850 మెగావాట్ల సోలార్‌ పవర్‌కు శ్రీకారం చుడుతున్నామన్నారు.  6500 కోట్ల పెట్టుబడి పెడుతున్నాం.  8 సబ్‌ స్టేషన్లలో 200 మందికి ఉద్యోగావకాశాలు వస్తున్నాయి. 850 మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్టు వల్ల 1700 ఉద్యోగాలు వస్తున్నాయి. హెచ్‌పీసీఎల్‌తో రూ.10 వేల కోట్ల పెట్టుబడికి ఒప్పందం పెడుతున్నాం. సోలార్‌,విండ్‌, పీఎస్పీ, గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రాజెక్టులను వీరు పెడుతున్నారు. దాదాపుగా 1500 మందికి ఉద్యోగావకాశాలు అందుబాటులోకి వస్తాయి. కాలుష్యరహిత విద్యుత్‌ రాష్ట్రానికి మేలు చేస్తుంది. పలు విద్యు త్‌ ప్రాజెక్టులను ఈరోజు ఇక్కడి నుంచి ప్రారంభిస్తూ.. ఈ రంగంలో మరింత అభివృద్ధి సాధించే దిశలో అడుగులు ముందుకు వేస్తున్నామన్నారు.         

       

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Amaravati pipes on fire: అమరావతిలో వరుసగా పైపులకు నిప్పు - కుట్ర కోణం ఉందని ప్రభుత్వం అనుమానం - విచారణ షురూ !
అమరావతిలో వరుసగా పైపులకు నిప్పు - కుట్ర కోణం ఉందని ప్రభుత్వం అనుమానం - విచారణ షురూ !
YCP 11th number Room: అమ్మో 11వ నెంబర్ - పార్లమెంట్‌లో రూం మార్చేసుకున్న వైసీపీ ఎంపీలు - ఎందుకో తెలుసా?
అమ్మో 11వ నెంబర్ - పార్లమెంట్‌లో రూం మార్చేసుకున్న వైసీపీ ఎంపీలు - ఎందుకో తెలుసా?
Vijayawada Terror Links: విజయవాడలో ఉగ్ర కుట్ర భగ్నం- ముగ్గురు యువకుల అరెస్టు.. ఐసిస్, ఆఖిస్‌లతో సంబంధాలు?
విజయవాడలో ఉగ్ర కుట్ర భగ్నం- ముగ్గురు యువకుల అరెస్టు.. ఐసిస్, ఆఖిస్‌లతో సంబంధాలు?
Rajahmundry King: ఇండోనేషియా, మలేషియాలను జయించిన రాజమండ్రి రాజు ! గొప్ప చక్రవర్తి పుట్టింది గోదావరి జిల్లాలోనా?
ఇండోనేషియా, మలేషియాలను జయించిన రాజమండ్రి రాజు ! గొప్ప చక్రవర్తి పుట్టింది గోదావరి జిల్లాలోనా?

వీడియోలు

Women Reservations 2029 | లోక్ సభ, అసెంబ్లీలో 50 శాతం స్థానాల పెంపు | ABP Desam
RCB KSCA Tributes Stampede Victims | విషాధ ఘటనను జ్ఞాపకంగా మార్చిన ఆర్సీబీ | ABP Desam
Petro Effect on PSL 2026 | పాపం పాకిస్తాన్ సూపర్ లీగ్ కాస్తా పెట్రోల్ షార్టేజ్ లీగ్ అయ్యిందే | ABP Desam
BCCI IPL 2026 New Rules | ఐపీఎల్ లో స్ట్రిక్ట్ రూల్స్...బీసీసీఐ సంచలన నిర్ణయం | ABP Desam
Jasprit Bumrah Injured IPL 2026 | ప్రాక్టీస్ మ్యాచ్ లకు హాజరుకాని జస్సీ భాయ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu Assembly Elections 2026: పురుషులకూ ఉచిత బస్సు, ఇంటికో ఫ్రిడ్జ్, దశలవారీ మద్యనిషేధం - అన్నాడీఎంకే మేనిఫెస్టోలో అన్నీ వింతలే
పురుషులకూ ఉచిత బస్సు, ఇంటికో ఫ్రిడ్జ్, దశలవారీ మద్యనిషేధం - అన్నాడీఎంకే మేనిఫెస్టోలో అన్నీ వింతలే
Fuel Crisis in Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్, LPG కష్టాలు! బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు.. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక సూచన
హైదరాబాద్‌లో పెట్రోల్, LPG కష్టాలు! బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు.. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక సూచన
Bomb Threat: ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
RCB vs SRH Tickets Live: నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. ఆర్సీబీ, సన్‌రైజర్స్ మ్యాచ్ టికెట్ ఎక్కడ తీసుకోవాలి
నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. RCB vs SRH Tickets ఎక్కడ తీసుకోవాలి
లాక్మే ఫ్యాషన్ వీక్ లో రాజాసాబ్ బ్యూటీ! వర్చువల్ హగ్ ఇవ్వాలనుకుంటున్నా అంటూ పోస్ట్!
లాక్మే ఫ్యాషన్ వీక్ లో రాజాసాబ్ బ్యూటీ! వర్చువల్ హగ్ ఇవ్వాలనుకుంటున్నా అంటూ పోస్ట్!
Professor Without a PhD : PhD లేకుండా కూడా ప్రొఫెసర్ అవ్వొచ్చని తెలుసా? ప్రాక్టీస్ ప్రొఫెసర్ గురించిన పూర్తి వివరాలివే
PhD లేకుండా కూడా ప్రొఫెసర్ అవ్వొచ్చని తెలుసా? ప్రాక్టీస్ ప్రొఫెసర్ గురించిన పూర్తి వివరాలివే
Stock Market on 24 March: యుద్ధానికి ట్రంప్ బ్రేక్.. భారత స్టాక్ మార్కెట్ జోరు.. రికవరీ అవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ 50
యుద్ధానికి ట్రంప్ బ్రేక్.. భారత స్టాక్ మార్కెట్ జోరు.. రికవరీ అవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ 50
Falls Sick or Dies on a Plane : విమానంలో ప్రయాణికుడు చనిపోతే ఏం జరుగుతుంది? ఎయిర్‌లైన్ పరిహారం ఇస్తుందా?
విమానంలో ప్రయాణికుడు చనిపోతే ఏం జరుగుతుంది? ఎయిర్‌లైన్ పరిహారం ఇస్తుందా?
Embed widget