By: ABP Desam | Updated at : 26 Apr 2022 03:54 PM (IST)
ప్రభుత్వ కార్యక్రమాలపై సీఎం జగన్ సమీక్ష
కొత్త జిల్లాల వల్ల పరిపాలన సులభతరంగా ఉండాలని ప్రజలకు మరింత అందుబాటులో ఉండాలని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులకు సీఎం జగన్ సూచిారు. " స్పందన "లో భాగంగా నిర్వహించిన సమీక్షలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఉపాధిహామీ పనులను ఏప్రిల్, మే, జూన్... నెలల్లో కనీసం 60 శాతం పనులను పూర్తి చేయాలన్నారు. కలెక్టర్లు ఈ మూడు నెలల్లో పనులు ముమ్మరంగా పనిచేయడంపై దృష్టిపెట్టాలని ఆదేశించారు. ప్రతిజిల్లాలో కూడా ప్రతిరోజూ కనీసం 1 లక్షల పనిదినాలు, నెలలో కనీసంగా 25 లక్షల పని దినాలు చేపట్టాలని ఆదేశించారు. కలెక్టర్లు, జేసీలు, పీడీలు, ఎంపీడీఓలు.. ఇలా ప్రతి అధికారి ప్రత్యేక దృష్టిపెట్టాలని రామ సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్ క్లినిక్కులు, ఆర్బీకేలు, డిజిటల్ లైబ్రరీలు.. అన్నింటినీకూడా పూర్తిచేయాలన్నారు. ఈ భవనాలకు అవసరం అయిన సిమెంటు, స్టీలు, ఇసుక, మెటల్ సరఫరా సవ్యంగా సాగేలా నోడల్ అధికారికి బాధ్యతలు అప్పగించాలన్నారు. డిసెంబర్ నాటికి 4545 డిజిటల్ లైబ్రరీల నిర్మాణం పూర్తి కావాలని దిశానిర్దేశం చేశారు. అదే సమయానికి ఇంటర్నెట్ కేబుల్‌కూడా సంబంధిత గ్రామాలకు చేరుకుంటుందని...గ్రామాల్లోనే వర్క్‌ఫ్రం హోం అందుబాటులోకి వస్తుందని జగన్ తెలిపారు.
ఇక ఇళ్ల నిర్మాణంపై జరిపిన సమీక్షలో తొలిదశలో 15.6 లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నామని అధికారులకు గుర్తు చేశారు. లే అవుట్లలో 11.9 లక్షలు, సొంతప్లాట్లు లేదా పొసెషన్ సర్టిఫికెట్లు పొందన వారి స్థలాల్లో 3.7 లక్షల ఇళ్ల నిర్మాణం చేయాలని.. ఆప్షన్ 3 ఎంపిక చేసుకున్న ఇళ్ల నిర్మాణంపైనా కలెక్టర్లు దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు. ప్రతి వేయి ఇళ్లకూ ప్రత్యేకంగా ఇంజినీరింగ్ అసిస్టెంట్‌ను పెట్టి.. బాధ్యతను వారికి అప్పగించాలన్నారు. లే అవుట్లలో కనీస మౌలిక సదుపాయాల కల్పన పనులు శరవేగంగా పూర్తిచేయాలని సూచించారు. ఆప్షన్ 3 కింద ప్రభుత్వమే ఇళ్లు నిర్మించే ఆప్షన్ ఎంచుకున్న వారి ఇళ్ల నిర్మాణాన్ని ఈనెల 28న ప్రారంభిస్తున్నామని జగన్ తెలిపారు. అదే రోజు 1.23 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తున్నామన్నారు. మొదటి విడత ఇళ్ల నిర్మాణంలో భాగంగా 15.6 లక్షలు, టిడ్కోలో 2.62 లక్షలు, విశాఖపట్నంలో 1.23 లక్షలు, పీఎంఏవై-వైఎస్సార్ గ్రామీణ్ ద్వారా 1.79లక్షల ఇళ్లు నిర్మాణాలు జరుగుతాయని తెలిపారు. అంటే 21.24 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతున్నట్టు లెక్కగా స్ప్టం చేశారు.
ఇళ్ల నిర్మాణం, స్కూళ్లు, ఆస్పత్రుల్లో నాడు – నేడు, సమగ్ర భూసర్వే, స్పందనలో అర్జీల పరిష్కారంలో నాణ్యత, ఎస్‌డీజీ లక్ష్యాలు, ఉపాధిహామీ పనులు, సచివాలయాల పనితీరు... ఈ అంశాల్లో ప్రగతి ఆధారంగా కలెక్టర్లు, జేసీల పనితీరును మదింపు చేస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఏసీబీ, ఎస్‌ఈబీ, దిశ, సోషల్‌మీడియా ద్వారా వేధింపుల నివారణ అంశాల్లో ప్రగతి ఆధారంగా ఎస్పీల పనితీరును మదింపు చేస్తామని.. ప్పటికప్పుడు క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించి ముందుకు సాగాలని జగన్ సూచించారు.
Gold-Silver Price: పసిడి ప్రియులకు కాస్త షాక్! నేడు పెరిగిన బంగారం ధర, వెండి మాత్రం నిలకడే - మీ నగరంలో రేట్లు ఇవీ
YS Jagan Davos Tour: దావోస్ చేరుకున్న ఏపీ సీఎం జగన్‌కు ఘన స్వాగతం, రేపు డబ్ల్యూఈఎఫ్‌తో కీలక ఒప్పదం
Cobra at Alipiri: అలిపిరి నడక మార్గంలో నాగుపాము ప్రత్యక్షం - వెంటనే భక్తులు ఏం చేశారో తెలుసా !
Breaking News Live Updates : తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్: ఎమ్మెల్సీ కవిత
Tomato Price: టమోటా ధరలకు మళ్లీ రెక్కలు, సెంచరీ వైపు దూసుకెళ్లడంతో సామాన్యులు బెంబేలు
MI Vs DC Highlights: ముంబై గెలిచింది - బెంగళూరు నవ్వింది - ఐదు వికెట్లతో ఓడిన ఢిల్లీ!
Bindu Madhavi: ‘బిగ్ బాస్ తెలుగు’ హిస్టరీలో తొలిసారి - విజేతగా లేడీ కంటెస్టెంట్, బిందు సరికొత్త రికార్డ్
Bigg Boss Telugu: ‘బిగ్ బాస్’ లైవ్ అప్డేట్స్: ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ విన్నర్ బిందు మాధవి
Horoscope Today 22 May 2022: ఈ రాశివారు దూకుడు తగ్గించుకోవాల్సిందే, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి