CM Jagan Review : తిరుపతి, విజయవాడ వంటి ఘటనలు మళ్లీ జరగొద్దు - ఉన్నతాధికారులకు సీఎం ఆదేశం !
వైద్య ఆరోగ్య శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. తిరుపతి, విజయవాడ ఆస్పత్రుల్లో జరిగిన ఘటనలు మళ్లీ జరగకూడదని ఆదేశించారు.
ఆంధ్ర ప్రదేశ్‌లో వైద్య ఆరోగ్య పరిస్థితులపై సీఎం జగన్ వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కోవిడ్ నివారణా చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. ప్రధానమంత్రితో జరిగిన సమావేశంలో.. చర్చకు వచ్చిన అంశాలను అధికారులకు వివరించారు. అదే సమయంలో మంగళవారం రుయా ఆస్పత్రిలో జరిగిన ఘటనపైనా వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని సీఎం ఆదేశించారు. ఆస్పత్రుల్లో ఫిర్యాదు నంబర్లు అందరికీ కనిపించేలా ఉండాలన్నారు.108, 104, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ లాంటి వాహనాలమీద ఫిర్యాదు నంబర్లు కనిపించేలా ఉండాలన్నారు. అప్పుడే బాధితులు ఎలాంటి సమస్య ఎదుర్కొన్నా వెంటనే ఆ నంబర్లకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుందని వివరించారు.
జగన్‌ను విజయసాయిరెడ్డి ఎలా మెప్పించారు ? పార్టీలో కీలక పదవి ఎలా దక్కించుకున్నారు ?
ఒకటి రెండు ఘటనల వల్ల మొత్తం వ్యవస్థకే చెడ్డ పేరు వస్తోందని, ఇకపై అలాంటి పరిస్థితులు రాకూడదని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటివి పునరావృతం కాకుండా సమర్థవంతమైన ప్రోటోకాల్ ఉండాలన్నారు. అదే సమయంలో విజయవాడ ఆస్పత్రిలో చోటు చేసుకున్న సామూహిక అత్యాచారం ఘటనలు లాంటివి మరలా జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసులు మరింత విజిలెంట్‌గా, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలసత్వం వహించారనే ఆరోపణలపైనే సీఐ, ఎస్పైలపై చర్యలు తీసుకున్నామని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు.
మే 10 నుంచి ఇంటింటికి వైఎస్ఆర్‌సీపీ - 151 సీట్లు తగ్గకూడదన్న సీఎం జగన్!
ప్రభుత్వం అంటే .. మనల్ని నమ్ముకున్న ప్రజలకు మనం అన్నివేళలా మంచిచేయాలని జగన్ అన్నారు. దీని కోసం అన్నిరకాల చర్యలు తీసుకుని , కట్టు దిట్టంగా ఉండాన్నారు.ఇలాంటి ఘటనలు జరుగకుండా మరింత గట్టిగా వ్యవహరించాలన్నారు. విద్య, వైద్యం-ఆరోగ్యం, వ్యవసాయం, పోలీసు విభాగాలు సమర్థవంతంగా పనిచేయాలని అధికారులకు సీఎం దిశానిర్థేశం చేశారు. ఆస్పత్రుల్లో వరుసగా వివాదాలు చోటు చేసుకుంటూడటంతో జగన్ మరోసారి అలాంటివి జరగకూడదని స్పష్టం చేశారు.
చంద్రబాబు బృందం పది తప్పులు చేశారు - న్యాయసలహా మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామన్న వాసిరెడ్డి పద్మ !
కరోనా విషయంలోనూ జాగ్రత్తలు పాటించాలని సీఎం తెలిపారు. దేశవ్యాప్తంగా నాలుగో వేవ్ వచ్చే అవకాశం ఉందని.. వ్యాక్సిన్ల విషయంలో మరింత పనితీరు చూపించాలని సీఎం ఆదేశించారు. సీఎం ఆదేశంతో ఆస్పత్రుల వద్ద మరితం భద్రత కల్పించేలా పోలీసులు జాగ్రత్తలు తీసుకోనున్నారు. అంబులెన్స్ మాఫియాలపై దృష్టి పెట్టనున్నారు.