News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

అమరావతిలో అవినీతి-అసెంబ్లీలో మళ్లీ అదే సీన్ రిపీట్

అమరావతి నిర్మాణాల్లో బాబు దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు సీఎం జగన్. ఐటీ శాఖ అప్రైజల్‌ రిపోర్ట్‌ లో అన్ని విషయాలు ఉన్నాయని వాటి ఆధారంగానే అధికారులు చంద్రబాబుకు నోటీసులు పంపారని చెప్పారు. 

FOLLOW US: 
Share:

ఏపీకి రాజధానిగా అమరావతిని నిర్ణయించడమే పెద్ద స్కామ్ అని, తాత్కాలిక భవనాల పేరుతో అమరావతి నిర్మాణాల్లో భారీ అవినీతి జరిగిందనేది వైసీపీ ఆరోపణ. జగన్ సీఎం అయిన తర్వతా జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే అమరావతి వ్యవహారంపై టీడీపీని పూర్తిగా కార్నర్ చేశారు. తాజాగా జరిగిన బడ్జెట్ సమావేశాల చివరి రోజు కూడా అమరావతి వ్యవహారం హైలెట్ అయింది. అమరావతి నిర్మాణాల పేరుతో వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని, ఆ డబ్బంతా చంద్రబాబు అకౌంట్లకు దారి మళ్లించారని ఆరోపించారు సీఎం జగన్. గతంలో కూడా వైసీపీ నేతలు ఇవే ఆరోపణలు చేశారు, వాటిపై విచారణకు ఆదేశించారు, అయితే ఇప్పుడు అవే ఆరోపణలు తిరిగి చేశారంతే. సమావేశాల్లో చంద్రబాబు అవినీతిని సోదాహరణంగా వివరించిన నేతలు, ఆ సొమ్ముని ఎలా రికవరీ చేస్తారనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. 

అమరావతిలో అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్.. భవన నిర్మాణాల్లో చంద్రబాబు యథేచ్ఛగా దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు సీఎం జగన్. కాంట్రాక్టు సంస్థలను బెదిరించి భారీ వసూళ్లకు పాల్పడ్డారని, ఆ సొమ్ముని బోగస్ కంపెనీల్లో జమ చేశారని, వాటిని తిరిగి తన అకౌంట్లకు మళ్లించుకున్నారని అన్నారు. ఐటీ శాఖ అప్రైజల్‌ రిపోర్ట్‌ లో ఈ వాస్తవాలన్నీ ఉన్నాయని చెప్పారు. 

షాపూర్ జీ పల్లోంజీ కంపెనీకి చంద్రబాబు కాంట్రాక్ట్ పనులను అప్పగించారని, వాటి విలువ 7వేల కోట్ల రూపాయలని అన్నారు జగన్. ఆ సంస్థనుంచి చంద్రబాబు 143 కోట్ల రూపాయలు వసూలు చేశారని ప్పారు. చంద్రబాబు బెదిరింపుల వల్లే ఆయన చెప్పిన బోగస్‌ కంపెనీలకు నిధులు మళ్లించామని షాపూర్ జీ పల్లోంజీ కంపెనీ ప్రతినిధులు ఐటీ శాఖకు ఇచ్చిన వాంగ్మూలంలో అంగీకరించారని అన్నారు జగన్. 

ఐటీ దాడులతో వెలుగులోకి..
ఐటీశాఖ దాడులతో చంద్రబాబు అవినీతి బయటపడిందని అన్నారు జగన్. ఐటీ శాఖ ముందుగా షాపూర్ జీ పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ నివాసంలో 2019 నవంబర్‌లో సోదాలు నిర్వహించిందని, అక్కడ లభించిన సమాచారంతో 2020 ఫిబ్రవరిలో చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌ నివాసంలో సోదాలు చేశారని చెప్పారు. ఆ సమాచారంతో ఐటీ శాఖ తయారు చేసిన అప్రైజల్‌ రిపోర్ట్‌ లో అన్ని విషయాలు ఉన్నాయన్నారు. వాటి ఆధారంగానే ఐటీ అధికారులు చంద్రబాబుకు ఇప్పుడు నోటీసులు పంపారని చెప్పారు జగన్. 

అన్ని పనులూ ఆ కంపెనీకే.. 
కర్నూలు, గుంటూరు, అనంతపురం, పశ్చిమగోదావరి జిల్లాల్లో టిడ్కో ఇళ్లు, అమరా­వతిలో హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం తాత్కాలిక భవనాల నిర్మాణంతో పాటు రాజధానిలో ఇతర నిర్మాణ పనులను కలిపి 2018 నాటికి రూ.7 వేల కోట్ల విలువ చేసే కాంట్రాక్ట్‌ పనులు దక్కించుకుందని, అందులో కమీషన్లు వసూలు చేయడానికి చంద్రబాబు తన పీఏ శ్రీనివాస్‌ ను రంగంలోకి దింపారన్నారు జగన్. 

హయగ్రీవమ్, అన్నై షలాఖా, నయోలిన్, ఎవరెట్‌ అనే బోగస్ కంపెనీలు సృష్టించి, వాటికి షూపూర్ జీ పల్లోంజీ సంస్థ నుంచి బోగస్ కాంట్రాక్ట్ లు ఇచ్చినట్టు రికార్డులు సృష్టించి నిధులు మళ్లించారని ఆరోపించారు జగన్. ఆ కంపెనీలకు బోగస్‌ సబ్‌ కాంట్రాక్టుల కింద డబ్బులు ఇచ్చిన తర్వాత వాటిని వసూలు చేసి చంద్రబాబుకు అప్పగించే బాధ్యతను ఆర్వీఆర్‌ రఘు, కృష్ణ, నారాయణ్, శ్రీకాంత్, అనికేత్‌ బలోటాలకు అప్పగించారన్నారు. చంద్రబాబుకి దుబాయ్ లో 15.14 కోట్ల రూపాయలను దినార్ల రూపంలో అందించారని చెప్పారు. స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ కుంభకోణంలో కూడా చంద్రబాబుకు ఇలానే మూడు నెలల్లో రూ.371 కోట్లు అందాయన్నారు. 

ఆ రోజు అధికారాన్ని అడ్డుపెట్టుకుని 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని, ఇప్పుడు మరో నలుగురిని ప్రలోభాల ద్వారా లాక్కున్నారన్నారు జగన్. దోచుకో పంచుకో తినుకో(డీపీటీ) పనులు అప్పుడు జరిగాయని, ఇప్పుడు తమ హయాంలో డీబీటీ ద్వారా ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరుతోందని చెప్పారు జగన్. 

Published at : 25 Mar 2023 08:09 AM (IST) Tags: AMARAVATHI tdp AP Politics CM Jagan ysrcp chandrababu AP CM

ఇవి కూడా చూడండి

BRS Politics: చంద్రబాబు అరెస్టుపై రూటు మార్చేసిన బీఆర్ఎస్ అగ్రనేతలు, సీమాంధ్ర ఓటర్ల ఎఫెక్టేనా  ?

BRS Politics: చంద్రబాబు అరెస్టుపై రూటు మార్చేసిన బీఆర్ఎస్ అగ్రనేతలు, సీమాంధ్ర ఓటర్ల ఎఫెక్టేనా ?

AP PECET: ఏపీ పీఈసెట్-2023 సీట్ల కేటాయింపు పూర్తి, కళాశాలలవారీగా వివరాలు ఇలా

AP PECET: ఏపీ పీఈసెట్-2023 సీట్ల కేటాయింపు పూర్తి, కళాశాలలవారీగా వివరాలు ఇలా

TTD News: శ్రీవారి భక్తులకు అలెర్ట్ - ఎస్ఎస్‌డీ టోకెన్ల జారీ నిలిపివేత

TTD News: శ్రీవారి భక్తులకు అలెర్ట్ - ఎస్ఎస్‌డీ టోకెన్ల జారీ నిలిపివేత

TDP Protest: న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తాం, త్వరలోనే టీడీపీ జైలు భరో చేస్తుంది: చినరాజప్ప

TDP Protest: న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తాం, త్వరలోనే టీడీపీ జైలు భరో చేస్తుంది: చినరాజప్ప

Chandrababu Naidu Arrest : మోత మోగించిన టీడీపీ క్యాడర్ - చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా వినూత్న నిరసన !

Chandrababu Naidu Arrest :   మోత మోగించిన టీడీపీ క్యాడర్ - చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా వినూత్న నిరసన !

టాప్ స్టోరీస్

HCA Election Notification: హెచ్‌సీఏ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే

HCA Election Notification: హెచ్‌సీఏ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే

Hari Teja: నటి హరితేజకు విడాకులు- కూల్ గా ఆన్సర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ

Hari Teja: నటి హరితేజకు విడాకులు- కూల్ గా ఆన్సర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ

కూతురితో కనిపించిన మాజీ ప్రపంచ సుందరి - తల్లికి తీసిపోని అందం!

కూతురితో కనిపించిన మాజీ ప్రపంచ సుందరి - తల్లికి తీసిపోని అందం!

Aditya L1: ఇస్రో కీలక అప్‌డేట్, సూర్యుడి వైపు దూసుకెళ్తున్న ఆదిత్య L1

Aditya L1: ఇస్రో కీలక అప్‌డేట్, సూర్యుడి వైపు దూసుకెళ్తున్న ఆదిత్య L1