అన్వేషించండి

AP NEws : వీఆర్ఏలకు రూ. 500 డీఏ - సీఎం జగన్ నిర్ణయం

వీఆర్ఏలకు 500 రూపాయలు డీఏ మంజూరు చేస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఫైల్ పై సంతకం చేశారని ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డి తెలిపారు.


AP NEws :   ఏపీలో VRA లకు గతంలో  500 డీఏ మంజూరు చేస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఫైల్ పై సంతకం పెట్టినట్లుగా ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డి తెలిపారు. గతంలో డీఏ  300 రూపాయలు DA ఇచ్చేవారు. గత ప్రభుత్వం ఈ DA ను రద్దు చేసిందన్నారు.  VRA లకు DA ను పునరిద్దరించవలసిందిగా  ముఖ్యమంత్రి ని కలిసి కోరడం జరిగిందని.. . అందుకు ముఖ్యమంత్రి గారిని వెంటనే స్పందించి DA తిరిగి మంజూరు చేసేలా ఫైల్ సర్కులేట్ చేయమని అధికారులను  ఆదేశించడం జరిగిందన్నారు.  ఫైల్ లో DA ను 300 రూపాయలకు బదులుగా 500 రూపాయలు మంజూరు చేస్తూ   ముఖ్యమంత్రి సంతకం చేశారని  వెంకట్రామిరెడ్డి తెలిపారు. 

వీఆర్ఏలకు డీఏ నిలిపివేశారన్న ఆరోపణలపై గతంలో వివరణ ఇచ్చిన ప్రభుత్వం 
 
‘‘గత ప్రభుత్వంలో ఆర్థిక విభాగం నుంచి 29.01.2019 న GO. MS. No.14 ద్వారా వీఆర్ఏల తాత్కాలిక కరవు భత్యాన్ని నెలకు రూ .300/- చొప్పున 01.01.2018 నుండి 01.06.2018 వరకు (కేవలం 5 నెలలకు) మాత్రమే పరిమితం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అంటే 01.06.2018 నుండి వీఆర్ఏలకు డీఏ వర్తించదు అనే ఉత్తర్వులను గత ప్రభుత్వమే ఇచ్చింది.

తదనుగుణంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారు (Director, Treasury &Accounts - DTA) ఒక మెమో ద్వారా 5 నెలల కంటే ఎక్కువగా (GO. MS. No.14 ను అనుగుణంగా) డీఏ డ్రా చేసిన వీఆర్ఏల సమాచారాన్ని సేకరించమని DTA లకు తెలియజేశారు. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ.

తదుపరి అమరావతి జేఏసీతో పాటు ఇతర రెవెన్యూ ఉద్యోగ సంఘాలు ఈ విషయంపై ప్రస్తుత ప్రభుత్వానికి అభ్యర్థన పత్రాలను ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో ఇచ్చిన GO. MS. No.14 ద్వారా వీఆర్ఏల కరువు భత్యానికి సంబంధించి జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది మళ్లీ వీఆర్ఏల కరవు భత్యాన్ని పునరుద్దరించాలని కోరారు. ఈ ప్రభుత్వం  ఉద్యోగ సంఘాల సమస్యలను పరిశీలించడం, పరిష్కరించడం కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వారి ఆధ్వర్యంలో రెగ్యులర్ గా సమావేశాలను ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఈ సమావేశాలలో ఉద్యోగ సంఘాలకు సంబంధించిన  ఎజెండాలో భాగంగా  వీఆర్ఏల కరువు భత్యానికి సంబంధించిన అంశాన్ని కూడా చర్చించడం జరిగిందని ప్రభుత్వం తెలిపింది. ల


ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన వెంటనే సుమారు 3,795 మంది వీఆర్ఏలకు వీఆర్వోలుగా పదోన్నతి కల్పించడం జరిగింది. అదే విధంగా ఈ ప్రభుత్వ హయాంలో జరిగిన GSWS ఉద్యోగ నియామకాలలో కూడా అర్హత కలిగిన సుమారు 2,880 మంది నామినీ VAO లను, వీఆర్ఏ లను కూడా గ్రేడ్-2 VRO లుగా నియమించడం జరిగింది. 

ఇటీవల 2023వ సంవత్సరంలో కూడా అర్హత కలిగిన 66 మంది వీఆర్ఏ లను VRO గ్రేడ్ -2 లుగా పదోన్నతి కల్పించడం జరిగింది. ఈ ప్రభుత్వం వీఆర్ఏ లకు సంబంధించి అనేక ఉపయోగకర నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ కేవలం ఉద్యోగుల్లో భయాందోళన కలిగించాలనే ఉద్దేశంతో ఇటువంటి ప్రతికూల వార్తలను ప్రముఖ పత్రిక ఈ రోజు ప్రచురించిందని స్పష్టంగా తెలుస్తోంది.

ప్రస్తుతం సుమారు 19,359 మంది వీఆర్ఏలు మన రాష్ట్రంలో సేవలు అందిస్తున్నారు. Director ,Treasury &Accounts వారు మెమో ఇచ్చినప్పటికీ ఏ ఒక్క వీఆర్ఏ నుండి కూడా  అదనంగా డ్రా చేసిన DA ను రికవరీ చేయలేదు. 

రెవెన్యూ విభాగం వారు వీఆర్ఏల నుండి DAకు సంబంధించి ఎటువంటి రికవరీ లేకుండా చేయడంతో పాటు, ప్రతి వీఆర్ఏ కు నెలకు రూ .300/- చొప్పున కరువు భత్యం (DA) కొనసాగించేలా తగిన ప్రతిపాదనలను తయారు చేశారు. ఈ ప్రతిపాదనలపై అతి త్వరలో నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వంపై బురద చల్లాలనే ఉద్దేశ్యంతో ఈరోజు పత్రికలో వీఆర్ఏల నుండి ప్రభుత్వం DA రికవరీ చేస్తుందని ప్రతికూల వార్తలను రాశారు. ఆ పత్రికలో పేర్కొన్న అంశాలు పూర్తిగా అవాస్తవం’’ అని ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హైదరాబాద్‌లో టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అపశృతి.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు
హైదరాబాద్‌లో టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అపశృతి.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు
Net Zero Village: ఇంటింటా నెట్‌జీరో… అలవరం కోడూరులో ఈ విధానాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు
ఇంటింటా నెట్‌జీరో… అలవరం కోడూరులో ఈ విధానాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
Junior Doctors Stipend: జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ విషయంలో ఏపీ ప్రభుత్వం అన్యాయం చేస్తుందా? అసలు వాస్తవాలు ఏమిటి?
జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ విషయంలో ఏపీ ప్రభుత్వం అన్యాయం చేస్తుందా? అసలు వాస్తవాలు ఏమిటి?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gayatri Bronze Win: బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Gachibowli Building Collapse: అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
Konda Surekha Letter To TPCC: నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Viral Video: న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
Embed widget