News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

CM Jagan Meet Amit Shah : అమిత్ షాతో 45 నిమిషాల పాటు సీఎం జగన్ భేటీ - ఏం చర్చించారంటే ?

అమిత్ షాతో సీఎం జగన్ 45 నిమిషాల పాటు సమావేశం అయ్యారు. ఏ అంశాలపై చర్చించారన్నది ప్రధానితో భేటీ తర్వాత వెల్లడించే అవకాశం ఉంది.

FOLLOW US: 
Share:

CM Jagan Meet Amit Shah :  ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డి  కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశం అయ్యారు. దాదాపుగా 45  నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చలు జరిగినట్లుగా తెలుస్తోంది. తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోదీతోనూ జగన్ సమావేశం కానున్నారు. బీజేపీ అగ్రనేతలతో భేటీ కోసం సీఎం జగన్ ఉదయమే అమరావతి నుంచి ఢిల్లీ వెళ్లారు. ఆయన వెంట  ఎంపీలు  విజయసాయి రెడ్డి, మిధున్ రెడ్డి,  సీఎస్ జవహర్ రెడ్డి,  ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి.. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ చిదానందరెడ్డి... ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ ఎస్ రావత్‌లు ఉన్నారు.  అమిత్ షాతో  భేటీ కి మాత్రం సీఎం జగన్ ఒక్కరే వెళ్లారు. 

తెలంగాణతో పాటు ఎన్నికలకు వెళ్లాలన్నది జగన్ ఆలోచన ?  

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీకి వెళ్లే విషయంలో వ్యతిరేకంగా ఉన్నట్లుగా వైఎస్ఆర్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలు పూర్తిగా జాతీయ అంశాల ఆధారంగా జరుగుతాయి. అదే సమయంలో రాష్ట్రంలో ఎన్నికలు జరగడం వల్ల సంక్షేమ పథకాల అంశం పక్కకు  పోతుందని అనుకుంటున్నారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి కూడా క్లిష్టంగానే ఉంది. వచ్చే ఏడాది  మార్చి , ఏప్రిల్‌లో పోలింగ్ జరిగితే... ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు ఉండే సూచనలు కనిపిస్తూండటంతో  మరింత ఇబ్బందికరం అవుతుందని అందుకే ముందస్తుకు వెళ్లాలని అనుకుంటున్నారు. ఈ అంశంపై కేంద్ర పెద్దల్ని ఒప్పించేందుకే ఢిల్లీ వెళ్లారన్న ప్రచారం జరుగుతోంది. 
 
ముందస్తుకు కేంద్ర సహకారం కోసమే ఢిల్లీ పర్యటన !  

ముందస్తుకు వెళ్లాలంటే కేంద్రం సహకారం తప్పని సరి. కేంద్రం కాదంటే జరిగే చాన్స్ లేదు. ఆరు నెలల ముందు అసెంబ్లీని రద్దు చేసినా కేంద్రం కాదంటే మాత్రం.. రాష్ట్రపతి పాలన అయినా  విధిస్తారు కానీ ఎన్నికలు నిర్వహించరు. అయితే ఈ అంశంలో జగన్మోహన్ రెడ్డికి కేంద్రం సపోర్ట్ లభిస్తోందని చెబుతున్నారు. గత కొంత కాలంగా ఢిల్లీ వెళ్లినప్పుడు ప్రధాని మోదీకి ముందస్తుకు సహకరించాలన్న విజ్ఞప్తి చేశారని ఆయన మీ ఇష్టం అన్నారన్న ప్రచారం జరుగుతోంది. త్వరలో అసెంబ్లీని రద్దు చేయాలనుకుంటున్నారు కాబట్టి మరోసారి మోదీని కలిసి చెప్పేందుకు వెళ్లారని భావిస్తున్నారు. 

మందస్తు ఖాయమని నమ్ముతున్న ఏపీ రాజకీయ పార్టీలు 

ఏపీలో ముందస్తు ఎన్నికలు ఖాయమని.. ఈసీ అధికారుల్ని జగన్ సంప్రదించారని  జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఇటీవల ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎప్పట్నుంచో తెలంగాణతో పాటే ఏపీకి ఎన్నికలు జరుగుతాయని అంటున్నారు. ఈ క్రమంలో అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థుల్ని కూడా ఖరారు చేసుకుంటున్నాయి. ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇప్పటికే ఎన్నికల వాతావరణం పూర్తి స్థాయిలో ఏర్పడింది. ఇక అసెంబ్లీ రద్దు కోసం నిర్ణయం తీసుకుంటే.. డిసెంబర్ లోనే ఏపీలోనూ ఎన్నికలు జరుగుతాయి. జగన్ ఢిల్లీ  పర్యటన తర్వాత కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో  ముందస్తు ఉంటుందా లేదా అన్నదానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 

Published at : 05 Jul 2023 03:47 PM (IST) Tags: CM Jagan Shah Jagan met Amit Shah

ఇవి కూడా చూడండి

Chandrababu Custody Extends: అక్టోబర్ 5 వరకు చంద్రబాబు రిమాండ్ పొడిగించిన ఏసీబీ కోర్టు

Chandrababu Custody Extends: అక్టోబర్ 5 వరకు చంద్రబాబు రిమాండ్ పొడిగించిన ఏసీబీ కోర్టు

YCP Counter To  Purandeswari: ఈ తెలివితోనే మీరు కేంద్రమంత్రిగా పనిచేశారా? - పురందేశ్వరిపై వైసీపీ సెటైర్లు

YCP Counter To  Purandeswari: ఈ తెలివితోనే మీరు కేంద్రమంత్రిగా పనిచేశారా? - పురందేశ్వరిపై వైసీపీ సెటైర్లు

Chandrababu Custody: రెండోరోజు చంద్రబాబుపై ప్రశ్నల వర్షం, ముగిసిన సీఐడీ కస్టడీ!

Chandrababu Custody: రెండోరోజు చంద్రబాబుపై ప్రశ్నల వర్షం, ముగిసిన సీఐడీ కస్టడీ!

Chandrababu Naidu arrest: ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీ విజయవంతం, రాజమహేంద్రవరం చేరుకున్న ఉద్యోగులు

Chandrababu Naidu arrest: ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీ విజయవంతం, రాజమహేంద్రవరం చేరుకున్న ఉద్యోగులు

TDP Political Action Committee: టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ ఏర్పాటు- బాలకృష్ణకు చోటు

TDP Political Action Committee: టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ ఏర్పాటు- బాలకృష్ణకు చోటు

టాప్ స్టోరీస్

TTDP Protest in Hyderabad: చంద్రబాబుకు మద్దతుగా హైదరాబాద్‌లో టీడీపీ ఆందోళనలు- నేతల అరెస్ట్‌

TTDP Protest in Hyderabad: చంద్రబాబుకు మద్దతుగా హైదరాబాద్‌లో టీడీపీ ఆందోళనలు- నేతల అరెస్ట్‌

IND vs AUS, 2nd ODI: సాహో శ్రేయస్‌.. జయహో శుభ్‌మన్‌! ఆసీస్‌పై కుర్రాళ్ల సెంచరీ కేక

IND vs AUS, 2nd ODI: సాహో శ్రేయస్‌.. జయహో శుభ్‌మన్‌! ఆసీస్‌పై కుర్రాళ్ల సెంచరీ కేక

మళ్ళీ ప్రభాస్ తో కలిసి నటిస్తారా? - డార్లింగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కంగనా రనౌత్!

మళ్ళీ ప్రభాస్ తో కలిసి నటిస్తారా? - డార్లింగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కంగనా రనౌత్!

Motkupalli Narasimhulu: జగన్ ప్రభుత్వంతో ఏపీలో దుర్మార్గాలు, జనం నవ్వుకుంటున్నారు - దీక్షలో మోత్కుపల్లి కీలక వ్యాఖ్యలు

Motkupalli Narasimhulu: జగన్ ప్రభుత్వంతో ఏపీలో దుర్మార్గాలు, జనం నవ్వుకుంటున్నారు - దీక్షలో మోత్కుపల్లి కీలక వ్యాఖ్యలు