News
News
X

Jagan : చంద్రబాబును ప్రశ్నించని వారంతా దొంగల ముఠా - రాజమండ్రిలో సీఎం జగన్ ఘాటు విమర్శలు !

రాజమండ్రి సభలో చంద్రబాబుపై సీఎం జగన్ ఘాటు విమర్శలు చేశారు. ఆయనను.. ప్రశ్నించని వారంతా దొంగల ముఠా అని ప్రకటించారు.

FOLLOW US: 
Share:

Jagan : టీడీపీ అధినేత చంద్రబాబును ప్రశ్నించని వారంతా దొంగల ముఠా అని సీఎం జగన్ రాజమహేంద్రవరంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక సభలో ఘాటు విమర్శలు చేశారు.   ఓ ముద్దాయి  తల్లిదండ్రులను  చంపేసి  తనకు  తల్లిదండ్రులు లేరని  కోర్టులో  ఏడుస్తాడుని..  చంద్రబాబు  తీరు ఈ ముద్దాయిలాగే  ఉందని విమర్శించారు. ఎన్టీఆర్ ను చంపేసి  ఎన్నికలప్పుడు  ..ఫోటోకు  దండ వేస్తాడని.. అలాగే ఫోటో  షూట్ , డ్రోన్  షాట్ల కోసం ఇదే  రాజమండ్రిలో  29 మందిని  చంద్రబాబు చంపేశాడని ఆరోపించారు.  కందుకూరులో  ఫోటో షూట్, డ్రోన్ షాట్ కోసం ఎనిమిది మందిని  చంపేశాడని ఆరోపించారు. మనుషులను  చంపేస్తాడు  వాళ్ల పాలిట తానే  మానవతావాది  అంటాడన్నారు. కొత్త సంవత్సరం రోజు  కూడా  జనాన్ని  పొట్టపెట్టుకున్నాడని..  వేల సంఖ్యలో  టోకెన్లు ఇచ్చి  అరకొరగా  చీరలు  తెచ్చారని ఆరోపించారు. 2014  నుంచి 2019  వరకూ చంద్రబాబు మోసాలు  చూశామనన్నారు. చంద్రబాబు సభల్లో జనాలు చనిపోతున్నా..  ఇలాంటి దారుణాన్ని దత్తపుత్రుడు  ప్రశ్నించడని పవన్ కల్యాణ్ పై మండిపడ్డారు. 

పింఛన్లు పెంచుకుంటూ పోతానన్న మాట నిలబెట్టుకుంటున్నానన్న జగన్ 
 
పింఛన్లు పెంచుకుంటూ పోతామన్న హామీని మీ బిడ్డగా నిలబెట్టుకున్నానని వృద్ధులుక తెలిపారు.  పింఛన్లు కేవలం వృద్ధులకు మాత్రమే కాదు.. రకరకాల సమస్యలతో బాధపడుతున్న అర్హులైన వాళ్లందరికీ అందుతున్నాయి. ప్రభుత్వం తరపున పేదలకు అందిస్తున్న ఆ పెన్షన్‌ సాయం దేశంలో ఎక్కడా ఈ స్థాయిలో అందడం లేదని తమ పరిపాలనలోనే జరుగుతోందని సీఎం జగన్‌ ప్రకటించారు.  కొత్తగా మరికొందరికి పింఛన్లు జాబితాలో చేర్చామని, అందుకోసం నిధులను సైతం ప్రభుత్వం విడుదల చేసిందని గుర్తు చేశారు. కొత్తగా బియ్యం కార్డులు, ఆరోగ్య శ్రీ కార్డులు వలంటీర్లు ఇంటికి వెళ్లి మరీ అందిస్తున్నారని ఆయన ప్రకటించారు.

దేశంలో ఎక్కడా రూ. 2750 పెన్షన్ ఇవ్వడం లేదన్న సీఎం 

పింఛన్లు రూ. 2,500 నుంచి రూ.2,750కి పెంచాం. ఖర్చుకు వెనకాడకుండా లబ్ధిదారుల సంక్షేమం కోసం ప్రయత్నిస్తున్నామన్నారు.  గత ప్రభుత్వంలో కేవలం 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్‌ అందేది.. మేం అధికారంలోకి వచ్చాక ఆ సంఖ్య పెరిగిందన్నారు.  ఇప్పుడు ఏకంగా 64 లక్షల మందికి పెన్షన్‌ అందిస్తున్నాం. గత ప్రభుత్వంలో పెన్షన్ల కోసం చేసిన ఖర్చు కేవలం రూ.400 కోట్లు. ఈ ప్రభుత్వంలో పెన్షన్లకే రూ.1,765 కోట్లు ఇస్తున్నామన్నారు.  దేశంలో రూ. 2,750 నుంచి పదివేల రూపాయల దాకా పెన్షన్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీనేన్నారు. 

అర్హులైన అందరికీ పెన్షన్లు ఇస్తున్నామని ప్రకటన 

గత ప్రభుత్వంలో పింఛన్లు కావాలంటే.. జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. లంచాలు చెల్లించాల్సిన పరిస్థితి. కానీ, ఇప్పుడు గత ప్రభుత్వంలో మాదిరి పింఛన్ల విషయంలో వివక్ష లేదు, అవినీతికి తావు లేదు, కత్తిరింపులు లేవు, ఎగ్గొట్టడాలు లేవన్నారు.  ఇప్పుడు.. ఎక్కడా ఎలాంటి తారతమ్యాలు లేకుండా కేవలం అర్హత అనే దాని ప్రామాణికంగా పింఛన్‌ అందిస్తున్న వ్యవస్థ ఏపీలో ఉందన్నారు.  గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడాలను గమనించాలని లబ్ధిదారులను ఉద్దేశించి సీఎం వైఎస్‌ జగన్‌ కోరారు. 

Published at : 03 Jan 2023 02:06 PM (IST) Tags: Rajahmundry CM Jagan Jagan criticizes Chandrababu

సంబంధిత కథనాలు

YSRCP Tensions : వైఎస్ఆర్‌సీపీలో ఈ అలజడి ఎందుకు ? ఇంటలిజెన్స్ అత్యుత్సాహమే కొంప ముంచుతోందా ?

YSRCP Tensions : వైఎస్ఆర్‌సీపీలో ఈ అలజడి ఎందుకు ? ఇంటలిజెన్స్ అత్యుత్సాహమే కొంప ముంచుతోందా ?

Anganwadi Jobs: వైఎస్సార్‌ కడప జిల్లాలో 115 అంగన్‌వాడీ పోస్టులు, వివరాలివే!

Anganwadi Jobs: వైఎస్సార్‌ కడప జిల్లాలో 115 అంగన్‌వాడీ పోస్టులు, వివరాలివే!

Republic Day Celebrations 2023: రిపబ్లిక్ డే పరేడ్ లో సత్తా చాటిన ఏపీ, తెలంగాణ ఎన్‌సీసీ క్యాడెట్స్ - ప్రధాని మోదీ చేతుల మీదుగా బెస్ట్ క్యాడెట్ ట్రోఫీ

Republic Day Celebrations 2023:  రిపబ్లిక్ డే పరేడ్ లో సత్తా చాటిన ఏపీ, తెలంగాణ ఎన్‌సీసీ క్యాడెట్స్ - ప్రధాని మోదీ చేతుల మీదుగా బెస్ట్ క్యాడెట్ ట్రోఫీ

AP BRS : ఏపీలో విస్తరణకు బీఆర్ఎస్ ప్లాన్- గంటా శ్రీనివాస్, మాజీ జేడీ లక్ష్మీనారాయణతో మంతనాలు!

AP BRS : ఏపీలో విస్తరణకు బీఆర్ఎస్ ప్లాన్- గంటా శ్రీనివాస్, మాజీ జేడీ లక్ష్మీనారాయణతో మంతనాలు!

AP High Court On Advisers : ప్రభుత్వ సలహాదారుల రాజ్యాంగ బద్ధతపై తేలుస్తాం, హైకోర్టు కీలక వ్యాఖ్యలు

AP High Court On Advisers :  ప్రభుత్వ సలహాదారుల రాజ్యాంగ బద్ధతపై తేలుస్తాం, హైకోర్టు కీలక వ్యాఖ్యలు

టాప్ స్టోరీస్

K Viswanath : హిందీలోనూ విశ్వనాథ్ హిట్టే, ఆయన 'స్వయంకృషి' - ఓ తీరని కోరిక

K Viswanath : హిందీలోనూ విశ్వనాథ్ హిట్టే, ఆయన 'స్వయంకృషి' - ఓ తీరని కోరిక

Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?

Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?

Pawan Kalyan Marriages: మూడు పెళ్లిళ్ల వివాదంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ - చివర్లో బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్!

Pawan Kalyan Marriages: మూడు పెళ్లిళ్ల వివాదంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ - చివర్లో బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్!

K.Viswanath: చిరంజీవితో విశ్వనాథ్‌కు ప్రత్యేక అనుబంధం - కళా తపస్విని కన్నతండ్రిలా భావించే మెగాస్టార్!

K.Viswanath: చిరంజీవితో విశ్వనాథ్‌కు ప్రత్యేక అనుబంధం - కళా తపస్విని కన్నతండ్రిలా భావించే మెగాస్టార్!