AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ, మహిళలకు ఉచిత బస్సు సహా చర్చించే కీలక అంశాలివే
Free Bus Scheme in Andhra Pradesh | నేడు ఏపీ మంత్రివర్గం సమావేశం కానుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సహా పలు కీలక అంశాలపై చంద్రబాబు అధ్యక్షతన సమావేమై కేబినెట్ చర్చించనుంది.

Andhra Pradesh Cabinet Meeting | అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు (జనవరి 17న) ఏపీ కేబినెట్ భేటీ కానుంది. గురువారం ఉదయం 11 గంటలకు ఏపీ మంత్రివర్గం సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించనుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలుపై కీలకంగా చర్చించే అవకాశం ఉంది. సూపర్ సిక్స్ పథకాల అమలులో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం (Free Bus For Women in AP) పథకం అమలుపై మంత్రులతో సీఎం చంద్రబాబు (Chandrababu) చర్చించనున్నారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై చర్చ
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏపీలో అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడిచినా కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయలేదు. ఈ పథకం ఎప్పుడెప్పుడా అమలు చేస్తారా అని రాష్ట్రంలోని మహిళలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆగస్టు 15, అక్టోబర్ 2న, నవంబర్ 1న ఉచిత బస్సు పథకం అమలు చేస్తారని భావించినా వారికి నిరాశే ఎదురైంది. సంక్రాంతికి సైతం పథకాన్ని పట్టాలెక్కించలేదు. మరోవైపు మంత్రుల బృందం తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించి మహిళలకు ఉచిత బస్సు పథకం తీరుతెన్నులను అధ్యయనం చేసింది. నేడు జరగనున్న కేబినెట్ భేటీలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. మార్చి 8న మహిళా దినోత్సవం నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తారని ప్రచారం మొదలైంది.
ఏపీ కేబినెట్ భేటీలో చర్చించే ఇతర అంశాలివే
గీత కార్మికులకు 10 శాతం మద్యం షాపులు కేటాయించాలని సీఎం చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. దీనిపై మంత్రివర్గం చర్చించి ప్రకటక చేసే ఛాన్స్ ఉంది. రైతు భరోసా సహా ఇతర సంక్షేమ కార్యక్రమాల అమలపై చర్చిస్తారు. బనకచర్ల ప్రాజెక్ట్‌పై తర్వాత ఎజెండా అంశంపై మంత్రులు చర్చించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోన్న తరుణంలో దీనిపై కీలకంగా చర్చ జరగనుంది. పలు ప్రాజెక్టుల్లో భాగంగా కూటమి ప్రభుత్వం ఆయా కంపెనీలకు కేటాయించిన భూములకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
సీఎం చంద్రబాబును కలవనున్న వాలంటీర్లు
సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనపైనా చర్చిస్తారని సమాచారం. మరోవైపు వాలంటీర్ల వ్యవస్థను కూటమి ప్రభుత్వం పునరుద్ధరించకపోవడంతో వాలంటీర్లు సీఎం చంద్రబాబును కలవనున్నారు. సీఎంను కలిసి వాలంటీర్లు వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించారు. కూటమి ప్రభుత్వం తమను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని, ఎన్నికల సమయంలో చెప్పినట్లుగా వారిని కొసాగించడంతో పాటు వారికి రెట్టింపు జీతం ఇవ్వాలని సీఎం చంద్రబాబును వాలంటీర్లు కోరనున్నారు.
Also Read: APSRTC : ఏపీఎస్ఆర్టీసీకి కలిసొచ్చిన సంక్రాంతి పండుగ.. రూ.12 కోట్ల ఆదాయంతో రికార్డ్ కలెక్షన్‌లు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

