Chandrababu On Alliance : వైఎస్ కన్నా జగన్ గొప్పోడా, ఆయనే పొత్తులు పెట్టుకున్నారు : చంద్రబాబు
Chandrababu On Alliance : పొత్తులపై సరైన సమయంలో నిర్ణయం ఉంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాజశేఖర్ రెడ్డి కన్నా జగన్ గొప్పవారేమీ కాదని పొత్తులు లేకుండా వెళ్లడానికి అని చంద్రబాబు అన్నారు.
![Chandrababu On Alliance : వైఎస్ కన్నా జగన్ గొప్పోడా, ఆయనే పొత్తులు పెట్టుకున్నారు : చంద్రబాబు Chittoor tdp chadrababu responded on alliance with other political parties Chandrababu On Alliance : వైఎస్ కన్నా జగన్ గొప్పోడా, ఆయనే పొత్తులు పెట్టుకున్నారు : చంద్రబాబు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/08/ad132c4980cac64825d60fd4ed244b7a_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Chandrababu On Alliance : పొత్తులపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలియజేశారు. పొత్తులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన స్పందించారు. చిత్తూరులో పారిశ్రామికవేత్త సుందర్ నాయుడు శుభస్వీకరణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేత మహాదేవ సందీప్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎవరితోనూ పొత్తులు అవసరం లేదని వైసీపీ నేతలు విర్రవీగుతున్నారని విమర్శించారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా టీఆర్ఎస్, సీపీఎం, సీపీఐతో పొత్తు పెట్టుకున్నారుని గుర్తు చేశారు. పొత్తులపై ఇప్పుడు నేను కామెంట్ చేయాలేనని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కంటే జగన్ గొప్పోడా అని ఎద్దేవా చేశారు.
ఎవరిని వదిలి పెట్టే ప్రసక్తే లేదు
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడుతున్నారని ఇది చాలా బాధాకరమైన చూస్తూ ఊరుకోమని చంద్రబాబు హెచ్చరించారు. సదుం మండలంలో టీడీపీ కార్యకర్త రాజారెడ్డిపై వైసీపీ శ్రేణులు దాడులు చేయడం బాధాకరం అన్నారు. కార్యకర్తలపై దాడి చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. పుంగునూరులో మంత్రి అనుచరులు ఆగడాలు మితి మీరిపోతున్నాయని, ఎవరిని వదిలి పెట్టే ప్రసక్తే లేదని అన్నారు. పోలీసులు తీరు ఏమాత్రం మారలేదని తప్పు చేసే వారిని వదిలి పెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. జనంలో జగన్ కు తీవ్రమైన వ్యతిరేకత ఉందని తెలుగుదేశం పార్టీకి బలమైన కార్యకర్తలు ఉన్నారన్నారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అన్ని స్థానాలను గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
వైసీపీ ఎగిరెగిరిపడుతోంది
"రాజారెడ్డిని కిడ్నాప్ చేసి ఇష్టానుసారం కొట్టారు. ఈ కేసును పోలీసులు నీరు గార్చేలా చూస్తున్నారు. డమ్మీ సెక్షన్లు పెట్టి గంటలో స్టేషన్ బెయిల్ ఇచ్చారు. ఈసారి వైసీపీకి డిపాజిట్లు కూడా రావు. వైసీపీ నేతలు గ్రామాలకు వెళ్తే ప్రజలు తిరగబడుతున్నారు. జగన్ పోలీసులు లేకుండా బయటకు రావడంలేదు. ప్రజలు ఒకసారి ఆలోచించాలి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాం. ప్రజల్లో చైతన్యం రావాలి. రాజకీయంగా పోరాడాలి కానీ రౌడీయిజం చేస్తామంటే ఊరుకోం. ఇప్పటికైనా మారకపోయి తీవ్ర చర్యలు ఉంటాయి. వైసీపీ పొత్తులపై ఎగిరిపడుతున్నారు. పొత్తులు లేకుండా గెలుస్తానని చెప్పుతున్నారు వైసీపీ. రాజశేఖర్ రెడ్డి కన్నా జగన్ గొప్పోడా. ఆయన టీఆర్ఎస్ తో పొత్తుపెట్టుకున్నారు. " అని చంద్రబాబు నాయుడు అన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)