Chandrababu : రైతులతో చంద్రబాబు " రచ్చబండ " - జగన్ వల్ల అన్నదాతలు చితికిపోయారని ఆగ్రహం !
రైతులతో ముఖాముఖి కార్యక్రమం రచ్చబండను చంద్రబాబు ప్రారంభించారు. సాగు రంగం జగన్ సర్కార్ వల్ల నిర్వర్యమైపోయిందన్నారు.
Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు రచ్చబండ అనే కార్యక్రమం ద్వారా రైతులతో మాట్లాడే కార్యక్రమన్ని ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా
మండపేట మండలం ఏడిద గ్రామంలో రైతులతో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు రచ్చబండలోపాల్గొన్నారు. జగన్ అసమర్థ పాలన రైతుల పాలిట శాపంగా మారిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పనిచేయకుండా చేశారన్నారు. చాగల్నాడు, పుష్కర ఎత్తిపోతల పథకాలు నిరుపయోగంగా మార్చేశారని మండిపడ్డారు. మళ్లీ మీరు ఓటు వేస్తే మేము అధికారంలోకి వస్తాం..రైతులకు మేలు జరుగుతుందన్నారు. దేశంలో రైతులపై సరాసరి అప్పు 75 వేలు అయితే.. ఏపీలో మాత్రం 2.40 లక్షల అప్పు ఉందని చంద్రబాబు గుర్తు చేశారు. . రైతు భరోసా కేంద్రాలు రైతులపాలిట శాపంగా మారాయన్నారు. వైసీపీ పాలనలో ఒక్క రైతు కూడా ఆనందంగా లేడని స్పష్టం చేశారు.
ఆరు నెలల్లో జగన్ ప్రభుత్వం పోతుంది !
6 నెలల్లో జగన్ ప్రభుత్వం పోతుంది చంద్రబాబు జోస్యం చెప్పారు. తాను ఏడిద గ్రామం వచ్చిన వెంటనే వర్షం రావటం శుభసూచికం. కరోనా సమయంలో వ్యవస్థలన్ని మూలనపడ్డాయన్నారు. రైతులు మాత్రం వ్యవసాయం ఆపలేదు. కాటన్ మహానీయుడు ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నిర్మించారు. పోలవరం పూర్తయ్యి ఉంటే సాగునీరు, తాగునీరు పూర్తిస్థాయిలో అందేవి. జగన్ రివర్స్ పాలన సాగిస్తున్నారు. చివరి భూములకు నీళ్ళు వస్తున్నాయా. టీడీపీ పాలనలో రైతులకే అధికారం ఇచ్చానని చంద్రబాబు తెలిపారు. జగన్ పిచ్చి నిర్ణయాలు అభివృద్ధికి ఆటంకం. ధాన్యం కొనుగోలు చేయలేని జగన్ మూడు రాజధానులు కడతాడట అని ఎద్దేవా చేశారు.
అక్వా రంగాన్ని దెబ్బకట్టిన జగన్
కోనసీమ అందాల సీమ అంటూ ఎన్నో సినిమాలు తీశారని చంద్రబాబు గుర్తు చేశారు. కోనసీమలో కొబ్బరికి జగన్ మద్దతు ధర ఇవ్వటం లేదు. జగన్ ఆక్వాసాగును నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శఇంచారు. ఆక్వా సాగు, రైతులు వెంటిలేషన్‌పై ఉన్నారని,... టీడీపీ అధికారంలోకి వస్తే రైతులకు పూర్వ వైభవం తీసుకువస్తానని హామీ ఇచ్చారు. ఏపీలో ఎక్కడ చూసినా గంజాయి పంట మాత్రమే ఉందన్నారు. పంటల భీమా కావాలని రైతులు అడుగుతున్నారు కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్దభేరి మోగించాననన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే కరెంట్ చార్జీలు పెంచనని స్పష్టం చేశారు. సోలార్ వ్యవస్థను ప్రోత్సాహిస్తాం. మందుబాబులనూ జగన్ మోసం చేశారని విమర్శించారు.
చింతాలమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన చంద్రబాబు
కోనసీమ జిల్లా పర్యటనలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు రాజమహేంద్రవరం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు టీడీపీ కార్యకర్తలు , అభిమానులు గజమాలతో ఘన స్వాగతం పలికారు. మార్గంమధ్యలో కడియం మండలం దుళ్లలో కాటన్ దొర విగ్రహానికి పూలమాల వేసి చంద్రబాబు నివాళులర్పించారు. అనంతరం అక్కడి గ్రామదేవత చింతాలమ్మను దర్శించుకొని పూజలు చేశారు.