అన్వేషించండి

Chandrababu Naidu: చంద్రబాబుకు ఇంటి నుంచే అల్పాహారం - ఫ్రూట్ సలాడ్ తీసుకెళ్లిన సిబ్బంది!

Chandrababu Naidu: టీడీపీ అధినేత చంద్రబాబు రాజమహేంద్రవరం జైల్లో ఉన్నట్లు అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆయనకు ఇంటి నుంచే అల్పాహారం వెళ్లింది. 

Chandrababu Naidu: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు రాజమహేంద్రవరం జైల్లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆయన కోసం ఇంటి నుంచే ప్రత్యేకంగా అల్పాహారం వెళ్లింది. జైల్లో ఉన్న బాబుకు ఆయన సిబ్బంది ఫ్రూట్ సలాడ్ ను తీసుకెళ్లి ఇచ్చారు. చంద్రబాబుకు ఇంటి భోజనానికి న్యాయస్థానం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఫ్రూట్ సలాడ్ తో పాటు వేడి నీళ్లు, బ్లాక్ కాఫీని కుటుంబ సభ్యులు పంపినట్లు సమాచారం. మరోవైపు చంద్రబాబుతో ములాఖత్ కు ముగ్గురు కుటుంబ సభ్యులు జైలు అధికారులు అనుమతి ఇచ్చారు. ములాఖత్ సమయంలో చంద్రబాబు భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి ఆయనను కలవనున్నారు. ఇంకాసేపట్లో చంద్రబాబుకు అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించబోతున్నారు. అతడిని ఉంచిన స్నేహ బ్లాక్ ఎదురుగానే జైలు ఆస్పత్రిలో పరీక్షలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. 

Read Also: Chandrababu remand: పెళ్లి రోజునే చంద్రబాబుకు రిమాండ్‌-కోర్టులోనే కన్నీరుపెట్టుకున్న నారా భువనేశ్వరి

కోర్టులోనే కన్నీరు పెట్టుకున్న భువనేశ్వరి

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయన్ను నిన్న రాజమండ్రి జైలుకు తరలించారు. సుదీర్ఘ వాదనల తర్వాత చంద్రబాబుకు  బెయిల్ వస్తుందని ఆశించిన ఆయన కుటుంబసభ్యులు, టీడీపీ శ్రేణులకు నిరాశే ఎదురైంది. చంద్రబాబుకు రిమాండ్‌ విధించడంతో... ఆయన కుటుంబసభ్యులు తీవ్ర ఆవేదనకు  గురయ్యారు. చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి ఏడ్చేశారు. తమ పెళ్లి రోజునే భర్తకు రిమాండ్‌ విధిస్తూ తీర్పు రావడంతో కోర్టులోనే కంటతడి పెట్టుకున్నారు ఆమె. 

సెప్టెంబరు 10న చంద్రబాబు-భువనేశ్వరిల పెళ్లి రోజు. ఆ రోజు ఇద్దరూ కలిసి విజయవాడ అమ్మవారిని దర్శించుకోవాలనుకున్నారు. కానీ... అందుకు ముందు రోజునే సీఐడీ  అధికారులు చంద్రబాబును అరెస్ట్‌ చేశారు. దీంతో ఆరోజు భువనేశ్వరి ఒక్కరే అమ్మవారి దర్శనానికి వెళ్లారు. నిన్న చంద్రబాబును సీఐడీ అధికారులు చంద్రబాబును కోర్టు  ముందు హాజరపరిచారు. నిన్న చంద్రబాబు-భువనేశ్వరి పెళ్లి రోజు. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు కోర్టులో సుధీర్ఘ వాదనలు జరిగాయి. దీంతో చంద్రబాబుతోపాటు ఆయన  భార్య భువనేశ్వరి కూడా కోర్టులోనే ఉన్నారు. బాబుకు బెయిల్ వస్తుందని ఆశించినప్పటికీ.. కోర్టు రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పు ఇవ్వడంతో... భువనేశ్వరి భావోద్వేగానికి  గురయ్యారు. కోర్టులోనే కన్నీటి పర్యంతమయ్యారు. చంద్రబాబు ఆమెను సముదాయించి ధైర్యం చెప్పారు. 

స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్‌ పేరుతో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారంటూ చంద్రబాబుపై సీఐడీ అభియోగాలు నమోదు చేసింది. దీనిపై విజయవాడ ఏసీబీ కోర్టులో నిన్న  ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఆ తర్వాత మూడు నాలుగు గంటల పాటు తీర్పును రిజర్వ్‌ చేసిన కోర్టు... సాయంత్రం 6.45 గంటల  సమయంలో చంద్రబాబుకు రిమాండ్‌ విధిస్తూ తీర్పు ఇచ్చింది. సెప్టెంబర్ 22 వరకు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు న్యాయాధికారి హిమబిందు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే  బాబుకు ఇంటి నుంచి భోజనం, భద్రతా కారణాల దృష్ట్యా జైల్లో ప్రత్యేక గది ఇవ్వాలని ఆదేశించారు. కోర్టు రిమాండ్‌ విధించిన తర్వాత... చంద్రబాబు నుంచి విజయవాడ ఏసీబీ  కోర్టు నుంచి రోడ్డుమార్గంలో రాజమండ్రి జైలుకు తరలించారు. అర్ధరాత్రి ఒంటి గంటల తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలుకు తీసుకెళ్లారు.  చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఇవాళ  రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది టీడీపీ. ఈ బంద్‌కు జనసేన కూడా మద్దతు తెలిపింది. ఇప్పటికే పలు చోట్లు నిరసనలు మొదలయ్యాయి. 

Read Also: Minister Chelluboina Venu Gopal: ఎంత పెద్ద లాయర్లను పెట్టుకున్నా ఇక్కడ చెల్లదు - మంత్రి వేణుగోపాలకృష్ణ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Kanguva Twitter Review: కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
Matka Twitter Review: 'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్వికారాబాద్ వివాదంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ట్రోఫీ మ్యాచ్‌లపై ఐసీసీకి లెటర్ రాసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్పెద్దపల్లిలో అదుపు తప్పిన గూడ్స్, 11 బోగీలు బోల్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Kanguva Twitter Review: కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
Matka Twitter Review: 'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
Matka: అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
Which OTT Platform Has Basic Instinct: మర్డర్లు చేస్తూ నవలలు రాసే హీరోయిన్- డిటెక్టివ్‌ ప్రేమ - బోల్డ్ సీన్లతో మతిపోగొట్టే బేసిక్ ఇన్‌స్టింక్ట్‌
మర్డర్లు చేస్తూ నవలలు రాసే హీరోయిన్- డిటెక్టివ్‌ ప్రేమ - బోల్డ్ సీన్లతో మతిపోగొట్టే బేసిక్ ఇన్‌స్టింక్ట్‌
Andhra News: అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
Sim Cards Blocked: 1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
Embed widget