అన్వేషించండి

Chandrababu : 20వ తేదీన రైతుల ఖాతాల్లోకి నగదు బదిలీ - ముహుర్తం ఖరారు చేసిన చంద్రబాబు

Andhra Pradesh: రైతుల ఖాతాల్లోకి 20వ తేదీన నగదు బదిలీ చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్లులా నిర్వహిస్తామన్నారు.

Annadata Sukhibhava:   ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా అందరికీ తల్లికి వందనం అమలు చేస్తామని ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాటను నేడు నిలబెట్టుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. .  67.27 లక్షల మంది విద్యార్థులకు రూ.10,091 కోట్లు తల్లికి వందనం పథకం కింద ఖర్చు చేస్తున్నాం. ఇందులో రూ.1,346 కోట్లు పాఠశాలల అభివృద్ధికి ఖర్చు చేస్తామన్నారు.  గత ప్రభుత్వం కేవలం 42,61,965 మంది విద్యార్ధులకు అమ్మఒడి ఇచ్చారు... మా ప్రభుత్వం 67,27,164 మంది విద్యార్ధులకు ఇస్తోంది. అంటే గత ప్రభుత్వం కంటే 24,65,199 మందికి అదనంగా పథకం వర్తింపచేశామన్నారు. గత ప్రభుత్వం రూ.5,540 కోట్లు ఇవ్వగా... మేం రూ.8,745 కోట్లు జమ చేస్తున్నాం. వారికంటే రూ.3,205 కోట్లు అదనంగా ఇస్తున్నామని చంద్రబాబు తెలిపారు. 

బలహీన వర్గాలకే అధిక లబ్ధి  

’67.27 లక్షల మంది విద్యార్ధుల్లో 29.82 లక్షల మంది బీసీలు,  11.76 లక్షల మంది ఎస్సీలు, 4.26 లక్షల మంది ఎస్టీలు,  66.50 వేల మంది  మైనార్టీలు, 8.44 లక్షల మంది ఈడబ్యూసీ విద్యార్థులు ఉన్నారు. జనాభా సమతుల్యతలో భాగంగా ఇదొక ముందడుగు. ఒక కుటుంబంలో ఒక్క బిడ్డ ఉన్న విద్యార్ధులు 18,55,760 మంది, ఒక కుటుంబంలో ఇద్దరు బిడ్డలు ఉన్న విద్యార్ధులు 29,10,644 మంది ఉన్నారు. ఒక కుటుంబంలో ముగ్గురు బిడ్డలు ఉన్న విద్యార్ధులు 6,32,052 మంది ఉన్నారు. నలుగురు పిల్లలున్న తల్లులు 80,212 మంది ఉన్నారు. దక్షణ భారతదేశమంతా జనాభా తగ్గుతోంది. ఒకప్పుడు ఇద్దరు పిల్లలకంటే ఎక్కువమంది ఉంటే స్థానిక సంస్థల్లో పోటీకి అనర్హులుగా ప్రకటించాం. ఇప్పుడు ఇద్దరు పిల్లల కంటే తక్కువుంటే పోటీకి అనర్హులుగా చేయాల్సి వస్తుంది.’ అని సీఎం చంద్రబాబు అన్నారు.

ఈ నెల 20న అన్నదాత సుఖీభవ

‘అన్నదాతా సుఖీభవ కింద రైతులకు ఏడాదిలో కేంద్రం ఇచ్చే ఆరు వేలతో కలిపి మూడు విడతల్లో మొత్తం రూ. 20 వేలు ఖాతాల్లో వేస్తాం. ఈ పథకం కూడా ఈనెల 20న అమలు చేస్తాం. గత ప్రభుత్వం రైతులకు ఇచ్చింది కేవలం రూ.7,500 మాత్రమే. వాళ్లకు మాకు వ్యత్యాసం రూ.6,500. దీపం పథకం కింద ఆడబిడ్డలకు ఉచితంగా మూడు సిలిండర్లు ఇస్తున్నాం. మత్స్యకారుల సేవలో లక్షా 29 వేల 178 మందికి రూ.259 కోట్లు జమ చేశాం. గత ప్రభుత్వం లక్షా 9వేల 231 మందికి రూ.109 కోట్లే ఇచ్చింది. మన ప్రభుత్వం 19 వేల 947 మందికి అదనంగా ఇచ్చి రూ.150 కోట్లు ఎక్కువ ఖర్చు చేశాం. పింఛన్లు కింద గత పాలకులు ఏడాదికి రూ.21, 631 కోట్లు ఖర్చు చేస్తే, కూటమి ప్రభుత్వం రూ.34 వేల కోట్లు ఇచ్చింది. రూ.12,370 కోట్లు అధికంగా ఖర్చు చేస్తున్నాం. బటన్ నొక్కామని గొప్పలు చెప్పిన వారికి మేం అందించే సంక్షేమ కార్యక్రమాలు అర్థం కావాలి. వాలంటీర్లు లేకపోతే పింఛను ఎలా ఇస్తారని విమర్శించారు. ఒకటో తేదీనే గౌరవప్రదంగా ఇంటికెళ్లి పింఛను అందిస్తున్నాము. దేశంలో ఎక్కడైనా ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్ ఇస్తున్నారా?  అని చంద్రబాబు ప్రశ్నించారు.    

సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు 

‘అభివృద్ధి, సంక్షేమం ఎన్డీఏకు రెండు కళ్ల లాంటివి. సంపద సృష్టించి, ఆదాయాన్ని పెంచి దాన్ని అభివృద్ధికి, సంక్షేమానికి ఖర్చు చేస్తామని చెప్పాం. మాటల్లో చెప్పడం కాకుండా చేతల్లో చేసి చూపించాం. విధ్వంసమైన రాష్ట్రాన్ని ఎలా బాగు చేస్తారని ఎంతోమంది అడిగారు. కష్టాలు వచ్చినప్పుడు కాడి పడేయడం కాదని అందరికీ స్పష్టంగా చెప్పాను.  . ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 204 అన్నా క్యాంటీన్ల ద్వారా 4 కోట్ల భోజనాలు అందించాం.  21 ఆలయాల్లో నిత్యాన్నదానానికి శ్రీకారం చుడుతున్నాం. 20 లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇస్తాం. ఇప్పటికే రూ.9.50 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నాం. వీటి ద్వారా 8.50 లక్షల మందికి ఉద్యోగాలు రానున్నాయి.  లోకేష్ చైర్మన్‌గా ఎంప్లాయిమెంట్ జనరేషన్, ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ కార్యక్రమానికి వర్కవుట్ చేస్తున్నారు. నిరుద్యోగభృతి పథకం అమలుపైనా కసరత్తు చేస్తున్నాం.  ఆడబిడ్డ నిధి పథకానికి పీ4కు లింక్ చేస్తాం. ఇబ్బందుల్ని అధిగమనిస్తున్నాం. రోజులో ఒక గంటపాటైనా ఆర్థికశాఖపై సమీక్షిస్తున్నాను. పేదల్లో అత్యంత నిరుపేదలున్నారు. ఆర్థిక అసమానతలు తొలగించి పేదరికం నిర్మూలిస్తాం. ప్రజలందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు అందించాలన్నది ఎన్డీఏ ప్రభుత్వ ధ్యేయం.’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Mahindra XUV 7XO: 7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Mahindra XUV 7XO: 7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
Thiruparankundram: ఆ కొండపై దీపం వెలిగించుకోవచ్చు - మద్రాస్ హైకర్టు సంచలన తీర్పు - స్టాలిన్ సర్కార్ ఇక ఆపలేదు !
ఆ కొండపై దీపం వెలిగించుకోవచ్చు - మద్రాస్ హైకర్టు సంచలన తీర్పు - స్టాలిన్ సర్కార్ ఇక ఆపలేదు !
Venezuelan people happy: దేశాధ్యక్షుడ్ని అమెరికా కిడ్నాప్ చేస్తే సంబరాలు చేసుకుంటున్న వెనిజులా ప్రజలు - మదురో ఇంతగా టార్చర్ పెట్టారా?
దేశాధ్యక్షుడ్ని అమెరికా కిడ్నాప్ చేస్తే సంబరాలు చేసుకుంటున్న వెనిజులా ప్రజలు - మదురో ఇంతగా టార్చర్ పెట్టారా?
Embed widget