![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Chandrababu Kuppam Tour : రౌడీ పాలనకు టైం దగ్గర పడింది - 175 స్థానాలూ టీడీపీనే గెలుస్తుంది - కుప్పంలో చంద్రబాబు ధీమా
Kuppam Tour : కుప్పంలో చంద్రబాబు మూడో రోజు పర్యటిస్తున్నారు - వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలను వైసీపీ నేతలు దోచుకుంటున్నారని అధికారంలోకి రాగానే మొత్తం కక్కిస్తానని హెచ్చరించారు.
![Chandrababu Kuppam Tour : రౌడీ పాలనకు టైం దగ్గర పడింది - 175 స్థానాలూ టీడీపీనే గెలుస్తుంది - కుప్పంలో చంద్రబాబు ధీమా Chandrababu is visiting Kuppam for the third day criticized the YCP government Chandrababu Kuppam Tour : రౌడీ పాలనకు టైం దగ్గర పడింది - 175 స్థానాలూ టీడీపీనే గెలుస్తుంది - కుప్పంలో చంద్రబాబు ధీమా](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/30/92c7dd50a5ab9878653ecd63ea380edd1703933682724228_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Chandrababu Kuppam Tour : ఏపీలో 175 స్థానాలూ టీడీపీనే గెలుస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. కుప్పంలో మూడో రోజు బిజీగా పర్యటిస్తున్నారు. రామకుప్పం బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందన్నారు చంద్రబాబు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలు టీడీపీవే అని ఆయన జోస్యం చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజా ద్రోహులుగా మారారని, అందుకు కారణమైన సైకో పాలనకు బుద్ధి చెప్పాలని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఒక్క కొత్త పరిశ్రమ కూడా రాలేదని, ఏ ఒక్కరికి ఉద్యోగావకాశం కల్పించలేదని పేర్కొన్నారు చంద్రబాబు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన తాను ఏ రోజు ఏ తప్పు చేయలేదని ఆయన స్పష్టం చేశారు.
”నాకు వయసు ఓ నంబర్ మాత్రమే. నా ఆలోచనలు 15 ఏళ్ల యువకుడిలా ఉంటాయి. వచ్చే 20 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తాను. కుప్పంలో లక్ష్య ఓట్ల మెజారిటీ లక్ష్యం. తప్పనిసరిగా సాధిస్తాం. హంద్రీనీవాలో నీళ్ళు పారించమంటే అవినీతి పారిస్తున్నారు. బటన్లు నొక్కి డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తున్నారు. అందరూ రోడ్డున పడ్డారు. సీఎం మాత్రం ప్యాలెస్ లో ఉన్నారు. వాటాలు అడుగుతున్న కారణంగా రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతున్నట్లు జగన్ కి అర్ధం అయ్యే ఉంటుంది. బటన్ నొక్కి డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని దీంతో ప్రజలు రోడ్డున పడ్డారని, సీఎం జగన్ మాత్రం ప్యాలెస్ లో ఉన్నాడని చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీలో ఈ తరహా రాజకీయాలు మునుపెన్నడూ చూడలేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. హంద్రీనీవా లో నీళ్లు పారించమంటే, అవినీతి పారిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రానికి పరిశ్రమలు రావడంలేదని, వాటాలు అడుగుతున్న కారణంగా పెట్టుబడులు ఎవరు పెట్టడం లేదని చంద్రబాబు ఆరోపించారు.
ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలైంది. మీ దాడులకు నేను భయపడను. మీరు తిన్నది కక్కిస్తాను. జగన్.. సామాజిక న్యాయం ఎక్కడ చేశావు? వైసీపీలో సామాజిక న్యాయం నేతి బీర నెయ్యి చందం. వైసీపీలో రెడ్లు ఎవ్వరూ బాగుపడలేదు. నలుగురు రెడ్లు పెద్దిరెడ్డి, సజ్జల, సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డిలు మాత్రమే బాగుపడ్డారు. మారాల్సింది ఎమ్మెల్యే అభ్యర్థులు కాదు.. సీఎం మాత్రమే. కుప్పంలో లక్ష ఓట్ల మెజారిటీ వస్తే రాష్ట్రంలో 175 స్థానాలు మనవే. గాడి తప్పిన పాలన మళ్లీ సరి చేయాలి. ఇదే నా కోరిక” అని చంద్రబాబు నాయుడు అన్నారు.
కుప్పంలో భక్త కనకదాసు విగ్రహాన్ని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు గారు ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో ప్రసంగించారు.#CBNInKuppam #NaraChandrababuNaidu pic.twitter.com/rhrFopQBVi
— Telugu Desam Party (@JaiTDP) December 30, 2023
కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న చంద్రబాబు.. శాంతిపురంలో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం, నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీడీపీ అధికారం కోల్పోయిన వెంటనే.. వైసీపీ సర్కార్ శీతకన్ను వేసిందన్నారు. రాష్ట్రంలో రౌడీ రాజ్యం, అవినీతి పాలన సాగుతోందన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమార్కుల ఆట కట్టించి, అవినీతి సొమ్మును కక్కిస్తామన్నారు చంద్రబాబు. మరోవైపు జాబు రావాలంటే బాబు రావాలని, యువత సైకిల్ ఎక్కితేనే అభివృద్ధి సాధ్యమన్నారు చంద్రబాబు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)